
Budh Gochar 2025
జనవరి 26 నుంచి ఫిబ్రవరి 27 వరకు బుధ గ్రహం తనకు ఎంతో ఇష్టమైన మకర, కుంభ రాశుల్లో సంచారం చేయడం జరుగుతోంది. ఈ రాశులకు అధిపతి అయిన శనీశ్వరుడు తనకు మిత్రుడైనందువల్ల బుధుడి ఈ రాశుల్లో ఎక్కువగా శుభ ఫలితాలనే ఇవ్వడం జరుగుతుంది. ఈ రాశుల్లో బుధ గ్రహానికి మంచి బలం కలుగుతుంది. శుభ పరిణామాలకు, శుభ వార్తలకు కారకుడైన బుధుడు ఈ రాశుల్లో ఉన్నంత కాలం కొన్ని రాశుల వారి జీవితంలో ఏదో ఒక శుభ పరిణామం చోటు చేసుకోవడం జరుగుతుంది. కన్యలో బుధుడు ప్రవేశిస్తున్న కారణంగా మేషం, వృషభం, మిథునం, కన్య, తుల, మకర రాశుల వారికి ఆదాయ వృద్ధి, సమస్యల పరిష్కారం, ఆరోగ్య లాభం, ఆశించిన గుర్తింపు తప్పకుండా కలుగుతాయి.
- మేషం: ఈ రాశివారికి బుధుడు దశమ, లాభ స్థానాల్లో సంచారం చేస్తున్నందువల్ల ఉద్యోగంలో మంచి గుర్తింపుతో పాటు హోదా పెరిగే అవకాశం ఉంది. అనేక మార్గాల్లో ఆదాయం వృద్ధి చెందుతుంది. ఆస్తి వివాదాలు, కోర్టు కేసులు అనుకూలంగా పరిష్కారమవుతాయి. వృత్తి, వ్యాపారాలు లాభదా యకంగా పురోగమిస్తాయి. నిరుద్యోగులకు ఆశించిన ఉద్యోగానికి ఆఫర్ అందుతుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. సమాజికంగా గౌరవ మర్యాదలు పెరుగుతాయి. షేర్లు వగైరాలు లాభిస్తాయి.
- వృషభం: ఈ రాశికి నవమ, దశమ స్థానాల్లో బుధుడి సంచారం వల్ల రెండు నెలల పాటు వీరి ఆదాయం దిన దినాభివృద్ధి చెందుతుంది. ఉద్యోగంలో సమర్థత, ప్రతిభలకు మంచి గుర్తింపు లభిస్తుంది. ఉద్యోగు లకు విదేశీ సంస్థల నుంచి ఆహ్వానాలు అందుతాయి. నిరుద్యోగులకు మంచి ఉద్యోగం లభిస్తుంది. షేర్లు, స్పెక్యులేషన్లు లాభాల వర్షం కురిపిస్తాయి. వృత్తి, వ్యాపారాల్లో తక్కువ శ్రమతో ఎక్కువ లాభాలు పొందుతారు. కొన్ని ముఖ్యమైన ఆర్థిక, వ్యక్తిగత సమస్యలను పరిష్కరించుకుంటారు.
- మిథునం: రాశ్యధిపతి బుధుడు మిత్ర క్షేత్రంలో సంచారం చేస్తున్నందువల్ల ఉద్యోగ స్థిరత్వం, ఆర్థిక స్థిరత్వం లభిస్తాయి. అంచనాలకు మించి ఆదాయం పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో యాక్టివిటీతో పాటు రాబడి కూడా బాగా వృద్ధి చెందుతుంది. ఆర్థిక వ్యవహారాలు, ఆస్తి వివాదాలు బాగా అనుకూలంగా పరిష్కారమవుతాయి. కొద్ది ప్రయత్నంతో సొంత ఇంటి కల నెరవేరుతుంది. వ్యాపారాల్లో లాభ దాయక ఒప్పందాలు కుదురుతాయి. సమాజంలో ఒక ప్రముఖ వ్యక్తిగా గుర్తింపు పొందుతారు.
- కన్య: రాశినాథుడు బుధుడు మిత్ర క్షేత్రంలో సంచారం చేస్తున్నందువల్ల మనసులోని కొన్ని కోరికలు, ఆశలు తప్పకుండా నెరవేరుతాయి. ఇష్టమైన వ్యక్తితో పెళ్లి ఖాయమవుతుంది. నిరుద్యోగులకు కొద్ది ప్రయత్నంతో కోరుకున్న ఉద్యోగం లభిస్తుంది. విదేశాల్లో ఉద్యోగం చేయాలనే కల కూడా నిజ మయ్యే అవకాశం ఉంది. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. ఆదాయ మార్గాలు విస్తరిస్తాయి. అనారోగ్యాలకు సరైన చికిత్స లభించి ఊరట కలుగుతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు దూసుకుపోతాయి.
- తుల: ఈ రాశివారికి నాలుగు, అయిదు స్థానాల్లో బుధ సంచారం అనేక శుభ యోగాలనిస్తుంది. ఏ ప్రయత్నం తలపెట్టినా దిగ్విజయంగా నెరవేరుతుంది. ఆదాయ వృద్ధి ప్రయత్నాలు నూరు శాతం విజయవంతం అవుతాయి. అనారోగ్యాల నుంచి ఉపశమనం లభిస్తుంది. కుటుంబంలో సుఖ సంతోషాలు వృద్ధి చెందుతాయి. ఉద్యోగంలో ప్రాధాన్యం, ప్రాభవం బాగా పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాలు అభివృద్ధి బాటపడతాయి. సొంత ఇంటి కల నెరవేరుతుంది. జీవనశైలి పూర్తిగా మారిపోతుంది.
- మకరం: ఈ రాశిలోనూ, ధన స్థానంలోనూ బుధుడి సంచారం వల్ల రెండు నెలల పాటు ఈ రాశివారికి ఆదాయం పెరగడంతో పాటు, ఆర్థిక సమస్యల నుంచి కూడా విముక్తి లభిస్తుంది. ఉద్యోగంలో ప్రతిభా పాటవాలకు ఆశించిన గుర్తింపు లభిస్తుంది. ఇంటా బయటా మాటకు విలువ పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు పురోగతి చెందడంతో పాటు విస్తరించే అవకాశం కూడా ఉంది. ఆరోగ్య లాభం కలుగుతుంది. ఉన్నత వర్గాలతో పరిచయాలు పెరుగుతాయి. కుటుంబ జీవితం హ్యాపీగా సాగిపోతుంది.