Budh Gochar 2023
Budh Gochar 2023: ఈ నెల 27న(సోమవారం) ధనుస్సు రాశిలో బుధుడు ప్రవేశించాడు. ఈ గ్రహం ఇక్కడ దాదాపు ఫిబ్రవరి 2 వరకూ కొనసాగుతుంది. ఇది పుత్ర కారకుడైన గురువుకు సంబంధించిన రాశి అయినందువల్ల, ఈ రాశిలో ప్రవేశించిన బుధుడిని గురువు నవమ దృష్టితో చూస్తున్నందువల్ల ఆరు రాశుల వారికి తప్పకుండా సంతాన యోగం కలిగే అవకాశం ఉంది. ఆ ఆరు రాశులుః మేషం, మిథునం, సింహం, కన్య, వృశ్చికం, కుంభం. ఈ రాశులవారు బుధుడి అనుకూలత మరింతగా పెరగడం కోసం, సంతానం విషయంలో అనుకూల పరిస్థితులు ఏర్పడడం కోసం వినాయకుడికి తరచూ పూజ చేయడం గానీ, పచ్చ లేదా మరకతాన్ని ఉంగరంలో పొదిగి ధరించడం గానీ చేయడం వల్ల ఆశించిన ఫలితం ఉంటుంది. దాంపత్య జీవితం మీద కూడా దీని ప్రభావం బాగా ఉంటుంది.
- మేషం: మేష రాశివారికి నవమ స్థానంలో బుధ గ్రహ ప్రవేశం అన్నది అనేక ఇతర యోగాలతో పాటు సంతాన యోగం కలగజేయడానికి కూడా అవకాశం ఉంది. నూతన దంపతులకు, ఇంత వరకూ సంతానం కలగనివారికి ఫిబ్రవరి లోపల తప్పకుండా సంతానం కలగడానికి అవకాశం ఉంటుంది. పిల్లలు కలిగే అవకాశాలు బాగా మెరుగుపడతాయి. దాంపత్య జీవితం సజావుగా, అన్యోన్యంగా సాగిపోతుంది. సంతానం విషయంలో ఆరోగ్యపరంగా ఏవైనా సమస్యలున్న పక్షంలో అవి తొలగిపోతాయి.
- మిథునం: ఈ రాశివారికి రాశినాథుడైన బుధుడు సప్తమ కేంద్రంలో ప్రవేశించబోతున్నందువల్ల దాంపత్య జీవితంలో అన్యోన్యత బాగా పెరుగుతుంది. ఫిబ్రవరి లోగా సంతాన యోగానికి సంబంధించిన శుభ వార్త వినడానికి అవకాశం ఉంది. ఎటువంటి సమస్యలకూ, లోపానికి అవకాశం ఉండక పోవచ్చు. వైద్య పరీక్షల అవసరం కూడా ఉండకపోవచ్చు. సంతాన యోగం పట్టడానికి ఆలస్యం అయ్యే అవకాశం కూడా ఉండదు. తరచూ వినాయకుడిని పూజించడం వల్ల ఆశించిన ఫలితం ఉంటుంది.
- సింహం: ఈ రాశికి పుత్ర స్థానమైన ధనుస్సులో బుధుడు ప్రవేశించడం, ఈ బుధుడి మీద గురువు వీక్షణ కూడా ఉండడం వల్ల ఈ రాశివారికి తప్పకుండా సంతాన యోగానికి అవకాశం ఉంది. దాంపత్య జీవితంలో అనుకూలతలు బాగా పెరుగుతాయి. వైద్య పరీక్షల అవసరం ఉండకపోవచ్చు. సహజ పద్ధతుల్లో సంతానం కలగడానికి అవకాశం ఉంది. ఇప్పటికే గర్భం ధరించి ఉన్నవారికి తేలికగా ప్రసవం అయ్యే అవకాశం కూడా ఉంది. ఈ రాశివారికి కవలలు పుట్టే సూచనలు కూడా ఉన్నాయి.
- కన్య: ఈ రాశికి కుటుంబ స్థానంలో రాశ్యధిపతి బుధుడు ప్రవేశించడం వల్ల కుటుంబ వృద్ధి, విస్తృతి తప్పకుండా ఉంటుంది. భార్యాభర్తల అన్యోన్యత పెరగడానికి, సంతాన యోగం కలగడానికి అన్ని విధాలుగానూ అవకాశం ఉంది. ఈ రాశివారికి కొద్దిగా వైద్య పరీక్షలు, వైద్య సహాయం అవసరం కావచ్చు. డిసెంబర్ ద్వితీయార్థంలో సంతానానికి సంబంధించి శుభ వార్త వినడం జరుగుతుంది. పుత్ర కారకుడైన గురువు అష్టమంలో ఉన్నందువల్ల సంతానం విషయంలో కొద్దిగా ఇబ్బందులు ఉండవచ్చు.
- వృశ్చికం: ఈ రాశికి ద్వితీయ స్థానంలో బుధుడి ప్రవేశం వల్ల సంతాన యోగానికి తప్పకుండా అవకాశం ఉంటుంది. సంతానం కలిగిన తర్వాత అదృష్టం పడుతుంది. కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లి విరుస్తాయి. దాంపత్య జీవితం అన్యోన్యంగా సాగిపోతుంది. వైద్య పరీక్షలు, వైద్య సహాయం అవసర మవుతాయి. ప్రసవం విషయంలో కొద్దిపాటి సమస్యలున్నా అవి వెంటనే తొలగిపోతాయి. సాధార ణంగా డిసెంబర్ ప్రథమార్థంలో సంతానానికి సంబంధించిన శుభ వార్త వినడం జరుగుతుంది.
- కుంభం: ఈ రాశికి పదకొండవ స్థానంలో బుధ గ్రహ ప్రవేశం సంతాన యోగానికి తప్పకుండా అవకాశ మిస్తుంది. జనవరిలో సంతాన యోగానికి సంబంధించి శుభవార్త వినడం జరుగుతుంది. అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది. గర్భం ధరించిన దగ్గర నుంచి భార్యాభర్తలకు మంచి యోగం పడుతుంది. ఆరోగ్యవంతమైన సంతానం కలుగుతుంది. వైద్య సహాయం అవసరం ఉండక పోవచ్చు. భార్యాభర్తలు తరచూ వినాయకుడికి పూజ చేయడం వల్ల ఆశించిన సంతానం కలుగుతుంది.