Zodiac Signs
Image Credit source: Getty Images
ఈ నెల 30 నుంచి డిసెంబర్ 10 వరకూ బుధుడికి అస్తంగత్య దోషం పడుతోంది. రవికి బాగా దగ్గరగా రావడం వల్ల బుధుడు దగ్ధం కావడాన్నే అస్తంగత్వం అంటారు. వృశ్చిక రాశిలో ఏర్పడు తున్న ఈ బుధ అస్తంగత్వ దోషం వల్ల కొన్ని రాశుల వారికి దశ తిరగబోతోంది. ఆధిపత్యం రీత్యా కొన్ని రాశులకు చెడు ఫలితాలను ఇవ్వవలసిన బుధుడు ఈ అస్తంగత్వ దోషం వల్ల శుభ ఫలితాలను ఇవ్వడం జరుగుతుంది. మేషం, మిథునం, కర్కాటకం, కన్య, వృశ్చికం, ధనూ రాశులకు ఈ అస్తంగత్వ దోషం బాగా యోగించే అవకాశం ఉంది. కొన్ని దీర్ఘకాలిక సమస్యల నుంచి విముక్తి లభించడం, ఆదాయ ప్రయత్నాలు సఫలం కావడం, ఆగిపోయిన పనులు పూర్తి కావడం, కొన్ని కోరికలు నెరవేరడం వంటివి జరుగుతాయి.
- మేషం: ఈ రాశికి బుధుడు పరమ పాపి కింద లెక్క. అటువంటి పాప గ్రహం అష్టమ రాశిలో సంచారం చేయడంతో పాటు, దగ్ధం కావడం వల్ల ఈ రాశివారికి కొన్ని దీర్ఘకాలిక ఆర్థిక, అనారోగ్య, వ్యక్తిగత సమస్యల నుంచి విముక్తి లభించే అవకాశం ఉంది. ఉద్యోగ జీవితం నల్లేరు మీద బండిలా సాగి పోతుంది. వృత్తి, వ్యాపారాలు నష్టాలు, ఆర్థిక సమస్యల నుంచి చాలావరకు బయటపడతాయి. ఆస్తి, గృహసంబంధమైన ఒప్పందాలు కుదురుతాయి. ఆదాయ మార్గాలు సత్ఫలితాలనిస్తాయి.
- మిథునం: ఈ రాశికి బుధుడు రాశ్యధిపతి అయినప్పటికీ, ఆరవ స్థానంలో సంచారం వల్ల కొన్ని ఆర్థిక, ఆరోగ్య సమస్యలు కలిగే అవకాశం ఉంటుంది. పురోగతికి ఆటంకాలు కలుగుతాయి. అయితే, ప్రస్తుతం బుధ గ్రహం అస్తంగతుడు అయినందువల్ల ఇటువంటి సమస్యలు తొలగిపోతాయి. ఉద్యోగంలో శీఘ్ర పురోగతి ఉంటుంది. వృత్తి, వ్యాపారాల్లో ఆశించిన గుర్తింపు లభించి, రాబడి బాగా వృద్ధి చెందుతుంది. నిరుద్యోగులకు ఆశించిన ఉద్యోగం లభిస్తుంది. వ్యక్తిగత సమస్యలు తగ్గిపోతాయి.
- కర్కాటకం: ఈ రాశికి అత్యంత పాపి అయిన బుధుడు పంచమ స్థానంలో అస్తంగతుడైనందువల్ల ఆదాయ పరంగా, ఉద్యోగపరంగా అంచనాలకు మించిన అభివృద్ధి ఉంటుంది. ఆగిపోయిన పనులన్నీ పూర్తయి మానసికంగా ఊరట లభిస్తుంది. అనారోగ్యాలకు సరైన చికిత్స లభ్యమవుతుంది. విదేశీ యానానికి మార్గం సుగమం అవుతుంది. నిరుద్యోగులకు విదేశాల నుంచి ఆఫర్లు అందుతాయి. ఉద్యోగులకు డిమాండ్ పెరుగుతుంది. ఒక ప్రముఖుడుగా గుర్తింపు పొందే అవకాశం ఉంటుంది.
- కన్య: ఈ రాశికి అధిపతి అయినప్పటికీ బుధుడు తృతీయ స్థాన సంచారం వల్ల బాగా బలహీనపడే అవ కాశం ఉంటుంది. అస్తంగత్వ దోషం ఏర్పడినందువల్ల బలం పుంజుకుని, ఆశించిన పురోగతిని ఇవ్వడం జరుగుతుంది. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. ఉద్యోగంలో పదో న్నతి లభిస్తుంది. వృత్తి, వ్యాపారాలు లాభాలపరంగా కొత్త పుంతలు తొక్కుతాయి. అనేక మార్గాల్లో ఆదాయం వృద్ధి చెందుతుంది. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది.
- వృశ్చికం: ఈ రాశికి పరమ పాపి అయిన బుధుడు ఈ రాశిలో అస్తంగత్వం చెందడం వల్ల ఆదాయానికి, ఉద్యోగానికి సంబంధించిన విషయాల్లో దశ తిరుగుతుంది. బుధాదిత్య యోగ ఫలితాలు ఈ రాశి వారికి అనుభవానికి వస్తాయి. అనారోగ్యాల బాధ బాగా తగ్గుతుంది. ఆర్థిక సమస్యలకు, కొన్ని వ్యక్తిగత సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. ఆస్తిపాస్తులు కలిసి వస్తాయి. వివాదాలు పరిష్కార మవుతాయి. ఉద్యోగంలో స్థిరత్వం లభిస్తుంది. వృత్తి, వ్యాపారాలు అభివృద్ది బాటపట్టే అవకాశం ఉంది.
- ధనుస్సు: ఈ రాశికి వ్యయ స్థానంలో సంచారం చేస్తున్న బుధుడి అస్తంగత్వం చెందడం వల్ల కుటుంబంలో ఆగిపోయిన శుభకార్యాలు పూర్తయ్యే అవకాశం ఉంది. ఆస్తి వివాదాలు, కోర్టు కేసులు సానుకూ లంగా పరిష్కారం అవుతాయి. ఆదాయ వృద్ధికి అవకాశం ఉంది. కొందరు బంధుమిత్రులకు ఆర్థిక సహాయం చేయడం జరుగుతుంది. ఉద్యోగులకు, నిరుద్యోగులకు విదేశాల నుంచి ఆఫర్లు అందు తాయి. ప్రతిభా పాటవాలు వెలుగులోకి వస్తాయి. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు పెరుగుతాయి.