విలాస జీవితం అనేది కొందరికి మాత్రమే సాధ్యమవుతుంది. ఈ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యుగంలో చాలామంది విలాస జీవితానికి బాగానే అలవాటు పడుతున్నప్పటికీ ఇంకా చాలామందికి ఇది అందని ద్రాక్షపండే. జ్యోతిష శాస్త్రం ప్రకారం శుక్ర గ్రహం విలాసాలకు, విలాస జీవితానికి కారకుడు. ఈ గ్రహం అనుగ్రహం ఉంటే తప్ప జాతకుడు విలాస జీవితాన్ని అనుభవించే అవకాశం ఉండదు. జాతక చక్రంలో ఈ శుక్ర గ్రహం స్థితిగతులను బట్టి జాతకుడు ఏ స్థాయిలో విలాస జీవితాన్ని అనుభవించేది అంచనా వేయవలసి ఉంటుంది. గ్రహచారం ప్రకారం ఈ నెల 18వ తేదీన శుక్రుడు తనకు ఉచ్ఛ రాశి అయిన మీన రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. దీని ఫలితంగా కొన్ని రాశుల వారి జీవనశైలి సమూలంగా మారిపోవటం జరుగుతుంది.
సాధారణంగా జాతక చక్రంలో శుక్ర గ్రహం బలంగా ఉన్నవారు సినిమా, టీవీ, రాజకీయాలు, కళలు, రియల్ ఎస్టేట్ వంటి రంగాల్లో బాగా రాణిస్తుంటారు. డబ్బు సంపాదనకు సంబంధించినంత వరకు వీరికి తెలిసినన్ని మెలకువలు ఇతరులకు తెలియకపోవచ్చు. అంతేకాదు వీరు కొద్దిపాటి శ్రమతో అత్యధికంగా సంపాదించడం అనే కళను బాగా వంట పట్టించుకుంటారు. అధిక వడ్డీలకు డబ్బు అప్పులు ఇచ్చేవారికి కూడా శుక్ర గ్రహం ఎంతో బలంగా ఉంటుంది. సినిమా తారలు, నటులు, వ్యాపారవేత్తలు విలాసవంతమైన జీవితం గడపటానికి, విలాసవంతమైన భవంతులలో నివసించడానికి, ఖరీదైన కార్లలో తిరగటానికి, అనేక విధాలైన సుఖమయ జీవితం ఏర్పరచుకోవడానికి వారి జాతకంలోని శుక్ర గ్రహమే కారణం.
ఇంతకూ ఈనెల 18వ తేదీన శుక్ర గ్రహం తనకు ఉచ్ఛ రాశి అయిన మీన రాశిలోకి ప్రవేశించడం వల్ల ముఖ్యంగా వృషభం కర్కాటకం వృశ్చికం మకరం మీన రాశులవారు అత్యధికంగా విలాస జీవితాన్ని, సుఖమయ జీవితాన్ని అనుభవించబోతున్నారు. నిరాశ జీవితం పట్ల ఈ రాశుల వారిలో ఎవరి దృక్పథం లేదా ఆలోచనా ధోరణి వారికి ఉండటం సహజం. అయితే, ఇతర రాశుల వారు శుక్ర గ్రహ రాశి మార్పు కారణంగా జీవితాలలో స్థిరపడటానికి, విలువైన వస్తువులు సమకూర్చుకోవడానికి, తమకు తగిన ఇల్లు, వాహనాలు కొనుక్కోవడానికి ఎక్కువ సమయం కేటాయించడం జరుగుతుంది. కానీ ఈ నాలుగు రాశుల వారు మాత్రం ఎక్కువగా తమ మనసులోని కోరికలను అన్నిటిని తీర్చుకోవడానికి, జీవితంలో కనివిని ఎరుగని ఆనందాన్ని అనుభవించడానికి తమ సమయాన్ని, తమ సంపదను, తమ సంపాదనను వినియోగించడం జరుగుతుంది.
వృషభ రాశి: ఈ రాశి వారు తమ పాత ఇంటిని అమ్మేసి, కొత్త భవంతిని కొనుగోలు చేసే అవకాశం ఉంది. వాహన యోగం పడుతుంది. విహారయాత్రల మీద, కార్లలో తిరగటం మీద, విలాసవంతమైన హోటళ్లలో బస చేయటం మీద వీరు ఎక్కువగా ఖర్చు పెట్టడానికి అవకాశం ఉంది. ఆర్థికపరమైన ప్రణాళికలతో వీరు అదనపు సంపాదనను ఆర్జించే సూచనలు ఉన్నాయి. తమ జీవన శైలిని సమూలంగా మార్చుకోవడానికి ఈ రాశి వారు గట్టి ప్రయత్నం చేస్తారు. సునాయాసంగా డబ్బు సంపాదించడం మీద బాగా దృష్టి పెడతారు. అక్రమ సంబంధాలకు, వ్యసనాలకు అలవాటు పడే సూచనలు కూడా ఉన్నాయి.
కర్కాటక రాశి: ఈ రాశి వారు ఈ ఏడాది ఎక్కువగా ఉద్యోగపరంగా లేదా వ్యాపార పరంగా విదేశాలకు వెళ్ళవలసి వస్తుంది. వీరు తమ విదేశీ పర్యటనల సందర్భంగా తమ సాధారణ జీవి తాన్ని విలాసవంతమైన జీవితంగా మార్చుకుం టారు. ఖరీదైన హోటళ్ళలో బస చేయడం, చిత్ర విచిత్రమైన విదేశీ వంటకాలను ఆరగించడం, విదేశీ మద్యపానానికి అలవాటు పడటం, వాహనాలలో తిరగటం లాంటివి ఎక్కువగా చోటుచేసుకుని అవకాశం ఉంది. ఇక వీరు సౌధ ప్రాకార ప్రకాశితమైన గృహాన్ని ఏర్పాటు చేసుకునే సూచనలు కూడా ఉన్నాయి. విలాస జీవితానికి సంబంధించినంతవరకు వీరికి పట్టపగ్గాలు ఉండవు. ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు పెంచుకుంటారు. వ్యాపార రంగంలో ఉన్నవారు కొత్త భాగస్వాములను చేర్చుకుంటారు. అనవసర పరిచయాలకు కూడా అవకాశం ఉంటుంది.
వృశ్చిక రాశి: ఈ రాశి వారు మొదటి నుంచి అంతర్లీనంగా విలాస జీవితాన్నే కోరుకుంటూ ఉంటారు. ఇటువంటి జీవితానికి సంబంధించి వీరు ఎక్కువగా ఊహాలోకాల్లో తేలిపోతూ ఉంటారు. వీరి మనసులోని కోరికలు ఈ నెల 18 నుంచి నెరవేరటం ప్రారంభమవుతుంది. సాధారణంగా వీరు విలాసవంతమైన హోటళ్లలో బసచేయ డానికి, ఖరీదైన మద్యం సేవించడానికి, విదేశీ వంటకాలను ఆరగించడానికి, ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు పెంచుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. వినోద యాత్రలు, విహార యాత్రలకు బాగా ఖర్చు చేయడం జరుగు తుంది. ముఖ్యంగా వీరు శృంగార సంబంధమైన యాత్రలు లేదా పర్యటనలు చేయడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆకాశమే హద్దుగా వీరు విలాస జీవితాన్ని అనుభవిస్తారు. ఇందుకోసం ఆరోగ్యాన్ని సైతం పణంగా పెడతారు.
మకర రాశి: ఈ ఏడాదంతా ఈ రాశి వారికి ఉద్యోగం లేదా వ్యాపార పరంగా పర్యటనలు ఎక్కువగా ఉండబోతున్నాయి. ఈ రాశి వారికి సాధారణంగా అద్భుతమైన లేదా కళ్ళకు ఇంపైన ప్రదేశాలకు వెళ్లడం మీద మోజు ఉంటుంది. ఇటువంటి ప్రదేశాలకు స్నేహితురాళ్లతో కలిసి వెళ్లడానికి, భోగవంతమైన జీవితాన్ని గడపటానికి వీరు అత్యంత ప్రాధాన్యం ఇస్తారు. ఈ విషయంలో ఈ రాశి వారు ఈ ఏడాది ఏ చిన్న అవకాశాన్నీ వదులుకోరు అని చెప్పవచ్చు. ఈ రాశి వారు తప్పకుండా ఒక మంచి ఇంటిని అమర్చుకుం టారు. ఉన్నత స్థాయి వ్యక్తులతో మంచి పరి చయాలు ఏర్పడతాయి. రాజకీయ నాయకులకు సన్నిహితులు అవుతారు. ప్రభుత్వపరంగా అనేక ప్రయోజనాలు పొందుతారు. తమ మనసులోని కోరికలను నెరవేర్చుకోవడానికి ఎంత శ్రమను అయినా ఓర్చుకుంటారు. ఏది ఏమైనా, ఈ ఏడాదంతా వీరి దృష్టి విలాసాల మీదే కేంద్రీకృతం అయి ఉంటుంది.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం క్లిక్ చేయండి..