Horoscope Today: ఈ రాశివారికి అనవసరపు ఖర్చులు ఎక్కువ.. అందులో మీ రాశి ఉందా.?

| Edited By: Ravi Kiran

Jan 18, 2023 | 6:56 AM

శని దశమ స్థానంలోకి ప్రవేశించడంతో ఉద్యోగంలో అధికార యోగానికి అవకాశం ఉంది. అధికారులు బరువు బాధ్యతలను పెంచుతారు. వృత్తి వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి.

Horoscope Today: ఈ రాశివారికి అనవసరపు ఖర్చులు ఎక్కువ.. అందులో మీ రాశి ఉందా.?
Horoscope
Follow us on

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

ఈ రోజు నుంచి శనీశ్వరుడు కుంభరాశిలో సంచారం ప్రారంభించినందువల్ల ఈ రాశి వారికి ఉద్యోగ పరంగా పురోగతి సాధించడానికి అవకాశం ఏర్పడింది. ఆర్థిక సమస్యల నుంచి కూడా క్రమంగా బయటపడే సూచనలు ఉన్నాయి. నిరుద్యోగులకు ఆశించిన విధంగా ఉద్యోగం లభిస్తుంది. వృత్తి వ్యాపారాల్లో అభివృద్ధి కనిపిస్తుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

శని దశమ స్థానంలోకి ప్రవేశించడంతో ఉద్యోగంలో అధికార యోగానికి అవకాశం ఉంది. అధికారులు బరువు బాధ్యతలను పెంచుతారు. వృత్తి వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి. సమాజంలో గౌరవ మర్యాదలు పెంపొందుతాయి. తల్లిదండ్రులలో ఒకరి ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది కానీ, అనవసర ఖర్చులు పెరుగుతాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

శని భాగ్య స్థానమైన నవమ రాశిలో ప్రవేశించడం వల్ల ఆర్థిక సమస్యల నుంచి బయటపడటానికి అవకాశం కలుగుతుంది. వీసా సమస్యలు పరిష్కారం అవుతాయి. దూర ప్రాంతంలో ఉన్న ఒక మంచి కంపెనీ నుంచి ఆఫర్ వచ్చే సూచనలు ఉన్నాయి. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. శుభవార్తలు వింటారు. ఆరోగ్యంలో సానుకూలంగా మార్పు వస్తుంది. ప్రేమ వ్యవహారాలలో ముందుకు దూసుకు వెళతారు.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

ఈ రాశి వారికి ఈ రోజు నుంచి అష్టమ శని ప్రారంభం అయింది. ముఖ్యమైన పనుల్లో ఆలస్యాలు జరుగుతాయి. కొద్దిగా అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంది. ఆస్తి సంబంధమైన కోర్టు కేసు ఒకటి సానుకూలంగా పరిష్కారం అవుతుంది. నిరుద్యోగులకు సొంత ఊర్లోనే ఉద్యోగం లభించే అవకాశం ఉంది. వృత్తి వ్యాపారాల వారి ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు సానుకూలంగా సాగిపోతాయి.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

సప్తమ రాశిలో శని ప్రవేశించడం వల్ల ఉద్యోగ పరంగా బాధ్యతలు పెరగడానికి అవకాశం ఉంది. ఉద్యోగంలో మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది. అనవసర ఖర్చులు తగ్గించుకోవడం మంచిది. కుటుంబ పరిస్థితులు సానుకూల పడతాయి. పెళ్లి ప్రయత్నాలు ఇబ్బంది పెడతాయి. ప్రేమ వ్యవహారాలు నిరుత్సాహం కలిగిస్తాయి. ఆరోగ్యంలో చిన్న చిన్న సమస్యలు తలెత్తుతాయి.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

ఈ రోజుతో శని ఆరవ రాశిలో సంచారం ప్రారంభించడం వల్ల ఉద్యోగ పరంగా ఊహించని ప్రయోజనాలు పొందుతారు. ప్రమోషన్ కు అవకాశం ఉంది. ఉద్యోగ పరంగా రావలసిన బకాయిలు అందే సూచనలు ఉన్నాయి. నిరుద్యోగులు శుభవార్త వింటారు. ఆదాయం పెరిగి ఆర్థిక సమస్యలు తగ్గుముఖం పడతాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. బంధువులతో అపార్ధాలు తలెత్తకుండా జాగ్రత్త పడండి.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

శనీశ్వరుడు 5వ రాశిలో సంచారం ప్రారంభించడం ఈ రాశి వారికి ఉద్యోగ పరంగా మేలు చేస్తుంది. ఈ రాశి వారి సలహాలు, సూచనలను అధికారులు స్వీకరించి ప్రయోజనం పొందుతారు. సంతానం నుంచి శుభవార్త వింటారు. కుటుంబ పరంగా కొన్ని మంచి నిర్ణయాలు తీసుకుంటారు. ఆర్థిక పరిస్థితుల్లో పెద్దగా మార్పు ఉండకపోవచ్చు. వృత్తి వ్యాపారాల్లో స్థిరత్వం లభిస్తుంది.

వృశ్చికం (విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ)

ఈ రాశి వారికి శనీశ్వరుడు నాలుగవ స్థానంలోకి ప్రవేశించడం వల్ల గృహ, కుటుంబ సంబంధమైన ఒకటి రెండు సమస్యలు పరిష్కారం కావడానికి అవకాశం ఉంది. అయితే, పాత సమస్యల స్థానంలో కొత్త సమస్యలు ప్రవేశించే సూచనలు ఉన్నాయి. ఇల్లు కానీ, స్థలం కానీ కొనే ఆలోచన చేస్తారు. అద్దె ఇంటివారు ఇల్లు మారాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెంచాల్సి ఉంది. ఉద్యోగంలో ఒత్తిడి పెరుగుతుంది.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

శనీశ్వరుడు మూడవ రాశిలో ప్రవేశించడంతో ఈ రాశి వారికి ఏలినాటి శని తొలగిపోయింది. ఉద్యోగ పరంగా, ఆర్థికపరంగా కొంతకాలంగా అనుభవిస్తున్న సమస్యలు పరిష్కారమయ్యే సూచనలు ఉన్నాయి. కుటుంబంలో ప్రశాంత పరిస్థితులు నెలకొంటాయి. దంపతుల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. ఆరోగ్యంలో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. ఒకటి రెండు శుభవార్తలు వింటారు.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2)

శనీశ్వరుడు మకర రాశి నుంచి కుంభ రాశిలోకి మారటం వల్ల ఈ రాశి వారికి ఆర్థికంగా మేలు జరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా ఒకటి రెండు ప్రధాన ఆర్థిక సమస్యలు పరిష్కారం కావచ్చు. ఉద్యోగంలో స్థిరత్వం లభిస్తుంది. వృత్తి వ్యాపారాల్లో లాభాలు నిలకడగా ముందుకు సాగుతాయి. నిరుద్యోగులు మంచి ఉద్యోగంలో చేరే అవకాశం ఉంది. కుటుంబ పరిస్థితులు చాలావరకు చక్కబడతాయి. ఆరోగ్యం పరవాలేదు.

కుంభం (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

శని ఈ రాశిలో ప్రవేశించడం వల్ల ఉద్యోగ పరంగా బరువు బాధ్యతలు బాగా పెరిగే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి చాలావరకు సజావుగానే ఉంటుంది. వృధా ఖర్చులతో ఇబ్బంది పడతారు. వృత్తి వ్యాపారాల్లో లాభాల పరిస్థితి సామాన్యంగా ఉంటుంది. వాగ్దానాలు చేయడం, హామీలు ఇవ్వడం మంచిది కాదు. కొద్దిగా డబ్బు నష్టపోయే అవకాశం ఉంది. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త అవసరం. ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

ఈ రాశి వారికి ఈ రోజుతో ఏలినాటి శని ప్రారంభం అయింది. ప్రయాణాలు, శుభకార్యాల మీద బాగా ఖర్చు అవుతుంది. ఆదాయంలో పెద్దగా మార్పు ఉండకపోవచ్చు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. మంచి పరిచయాలు ఏర్పడతాయి. వృత్తి వ్యాపారాలలో శ్రద్ధ పెంచాల్సిన అవసరం ఉంది. ఆరోగ్యం సాధారణ స్థాయిలో ఉంటుంది. ఉద్యోగం సాఫీగా సాగిపోతుంది.