Astro Tips: ఈ రాశివారు కింద పడ్డా పైచేయి అంటారు.. తప్పు చేసినా క్షమాపణ చెప్పడానికి ఇష్టపడరు.. ఈ రాశులు ఏమిటంటే..

జ్యోతిష్య శాస్త్రం ఒక పురాతన శాస్త్రం. ఇది గ్రహాల కదలికలు, నక్షత్రాల స్థానాల, ఇతర ఖగోళ సంఘటనలను అధ్యయనం చేస్తుంది. వీటి ఆధారంగా జ్యోతిష్కులు మనిషి వ్యక్తిత్వం, లక్షణాలు, సంబంధాలను మాత్రమే కాదు భవిష్యత్తులో జరిగే సంఘటనల గురించి అంచనా వేస్తారు. ఈ జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొంతమంది వ్యక్తులు తమ తప్పుని అంగీకరించి వెంటనే క్షమించమని అడుగుతారు. అదే సమయంలో మరికొందరు కింద పడ్డా పై చేయి తమదే అంటారు. క్షమించమని చెప్పడం అంటే ప్రాణం పోతున్నట్లు భావిస్తారు. ఈ రోజు క్షమాపణ చెప్పడానికి ఇష్టపడని రాశులు ఏమిటో ఈ రోజు తెలుసుకుందాం..

Astro Tips: ఈ రాశివారు కింద పడ్డా పైచేయి అంటారు.. తప్పు చేసినా క్షమాపణ చెప్పడానికి ఇష్టపడరు.. ఈ రాశులు ఏమిటంటే..
Relationship Tips

Updated on: Jul 15, 2025 | 11:04 AM

క్షమాపణ చెప్పడం సంబంధాలను నిలబెట్టడంలో సహాయపడుతుంది. క్షమాపణ చెప్పడం వల్ల అపార్థాలు తొలగి, సంబంధాలు బలపడతాయి. ముఖ్యంగా భాగస్వాములు, స్నేహితులు, కుటుంబ సభ్యుల మధ్య ఏర్పడిన గొడవల తర్వాత క్షమాపణ చెప్పడం వల్ల బంధాలు తిరిగి బలోపేతం అవుతాయి. అయితే అందరూ క్షమాపణ చెప్పడానికి అందరూ ఇష్టపడరు. ముఖ్యంగా గర్వం, అహం లేదా మొండి పట్టుదల ఉన్న వ్యక్తులు మొదటగా క్షమాపణ ఎట్టి పరిస్థితుల్లో చెప్పరు. జ్యోతిషశాస్త్రంలో కొన్ని రాశులకు చెందిన వ్యక్తులు పొరపాటున కూడా క్షమాపణ చెప్పడానికి ఇష్టపడరట. ఆ రాశులు ఏమిటో ఈ రోజు తెలుసుకుందాం,

సింహ రాశి: ఈ రాశి వారు ఆప్యాయంగా, ఉదారంగా, ప్రేమని కలిగి ఉంటారు. అయితే వీరికి చాలా గర్వం కూడా ఉంటుంది. వీరు తమని అందరూ ప్రశంసించాలని, ప్రతి ఒక్కరూ గౌరవించాలని కోరుకుంటారు. వీరు తాము నమ్మిన దానిని బలంగా, నమ్మకంగా వినిపించడానికి ఇష్టపడతారు. ముఖ్యంగా ఎవరితోనైనా తీవ్రంగా వాదించాల్సి వస్తే.. ఈ సమయంలో ముందుగా క్షమాపణ చెప్పడం వల్ల తమ శక్తిని లేదా గౌరవాన్ని కోల్పోతున్నట్లు భావిస్తారు. తాము తప్పు చేశామని ఒప్పుకోవడం వీరు అహం దెబ్బతిన్నట్లు భావిస్తారు. సింహరాశి వారు తాము తప్పు చేసినట్లు గుర్తించినా.. వీరు అవతలి వ్యక్తి ముందుగా తమను సంప్రదించే వరకు వేచి ఉంటారు. అయితే అవతలి వ్యక్తీ క్షమాపణ చెప్పినప్పుడు.. మాత్రం ఆ క్షమాపణని హృదయపూర్వకంగా అర్థం చేసుకుంటారు.

వృశ్చిక రాశి: వృశ్చిక రాశి వారు తీవ్రంగా, భావోద్వేగానికి లోనవుతారు. అయితే వీరు తమలో కలిగిన భావాలను మనసులోనే దాచుకుంటారు. తమ బలహీనత ఎదుటివారికి తెలియడానికి ఇష్టపడరు. ముందుగా క్షమాపణ చెప్పడం అంటే తమపై ఇతరులకు నియంత్రణ ఇచ్చినట్లు భావిస్తారు. వీరు ముందుగా క్షమాపణ చెప్పడం కంటే మౌనంగా ఉండటానికి ఇష్టపడతారు. ముఖ్యంగా వీరి భావాలు గాయపడితే.. తరచుగా తమను తాము రక్షించుకోవడానికి భావోద్వేగ గోడలను నిర్మించుకుంటారు. కనుక ఈ వృశ్చిక రాశి వారు జరిగిన దానికి పశ్చాత్తాపపడినప్పటికీ.. వీరు తమని ఇతరులు దుర్బలలు అని భావించకుండా ఉండటానికి నిశ్శబ్దంగా ఉంటారు.

ఇవి కూడా చదవండి

మకర రాశి: వీరు దృఢంగా ఉంటారు. తార్కికంగా ఆలోచిస్తారు. లక్ష్యాన్ని లక్ష్యంగా చేసుకుంటారు. తాము తప్పు చేశామని భావించే విషయం పట్ల బాధ్యత వహించడానికి ఇష్టపడతారు. అయితే తాము ఏ తప్పు చేయలేదని నమ్ముతారు. అవసరమైతే తప్ప.. క్షమాపణ చెప్పడంలో అర్థం లేదని వారు భావిస్తారు. వీరికి క్షమాపణ చెప్పడం అంటే అదొక పెద్ద విషయంగా భావిస్తారు. అందుకనే తాము చేసిన తప్పు ఒప్పుకునే ముందు తాము నిజంగా తప్పు చేశామా అనే విషయాన్ని నిర్ధారించుకోవాలని కోరుకుంటారు. అందుకనే వీరు క్షమాపణ చెప్పే ముందు.. విషయం పట్ల స్పష్టతను కోరుకుంటారు.

కుంభ రాశి: కుంభ రాశి వారు ఆలోచనాపరులు. వీరి భావోద్వేగంతో కాకుండా తర్కంతో పరిస్థితులను అర్థం చేసుకోవడానికి ఇష్టపడతారు. కనుక గొడవ జరిగినప్పుడు.. దానిని పరిష్కరించాల్సిన పజిల్ లాగా చూడటానికి ప్రయత్నిస్తారు. తాము న్యాయంగా ఉన్నామని భావిస్తారు. అయితే ఎల్లప్పుడూ ఎందుకు క్షమాపణ చెప్పాలి అని ఆలోచిస్తారు. వీరు ఎవరినైనా బాధపెట్టినప్పటికీ.. తాము ఎందుకు అలా బాధపెట్టామో, తమ ప్రవర్తన ఏమిటో వీరు గ్రహించరు. ఎందుకంటే వీరు ఎప్పుడూ తాము మంచిగా నడుచుకుంటున్నామని భావిస్తారు. మనసులో మాత్రం తాము చేసిన పనిని చెడుగా భావిస్తారు.. అయితే ఎల్లప్పుడూ దానిని బయటకు వ్యక్త పరచరు. ముఖ్యంగా మొదటి క్షమాపణ చెప్పరు.

మేష రాశి: మేష రాశి వారు ఆవేశపూరితంగా ఉంటారు. స్పీడ్ గా నడుచుకుంటారు. ఒకే చోట కూర్చోవడానికి ఇష్టపడరు. ముఖ్యంగా భావోద్వేగపరంగా.. వీరు కోపంలో ఉన్నప్పుడు త్వరగా స్పందిస్తారు. తరచుగా వీరు అర్థం చేసుకోని విషయాల గురించి ఇతరుల నుంచి అడగడానికి మొహమాట పడరు. వీరు వేగంగా ముందుకు సాగుతారు. ఒకవేళ తప్పు జరిగితే దాని గురించి మాట్లాడటానికి తిరిగి ఆ తప్పుని గుర్తు చేసుకోవడానికి ఇష్టపడరు. వీరు ఎదుటివారు మొదట క్షమాపణ చెప్పే వరకు వేచి ఉంటారు. అంతేకాదు తప్పు చేసిన వారిపై ఎక్కువ సేపు కోపంగా ఉండరు. అంటే మేష రాశి వారు ఎక్కువసేపు పగ పెంచుకోరు. అంతేకాదు వీరు తాము చేసిన తప్పుని అంగీకరించడానికి ఇష్టపడరు. పైగా ఎటువంటి తప్పు జరగలేదని నటించడానికి ఇష్టపడతారు.

 

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.