నవ గ్రహాల్లో ఒకటి గురువు. దేవతలకు గురువుగా పరిగణిస్తారు. వ్యక్తి జాతకంలో నైనా ఆనందం, అదృష్టానికి కారకంగా పరిగణించబడతాడు. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం ధనుస్సు, మీన రాశులకు బృహస్పతి అధిపతిగా పరిగణించబడుతున్నాడు. ఎవరి జాతకంలోనైనా బృహస్పతి బలంగా ఉంటే.. వారు సంతోషంగా ఉంటారు. మంచి విద్యను పొందుతారు. ధర్మవంతుడిగా జీవిస్తారు. జీవితంలో అడుగడుగునా అదృష్టాన్ని అందుకుంటాడు. అయితే దీనికి విరుద్ధంగా వ్యక్తి జాతకంలో గురు స్థానం బలహీనంగా ఉంటే అతని చదువులో ఆటంకాలు ఏర్పడతాయి. వివాహంలో సమస్యలు కలుగుతాయి. జాతకంలో బృహస్పతి గ్రహానికి సంబంధించిన దోషాల కారణంగా అతని జీవితంలో అన్నీ కష్టలే.. ఎవరి జాతకంలోనైనా బృహస్పతికి సంబంధించిన దోషం ఉంటే.. నివారణ కోసం కోరిన కోరికలు నెరవేరడానికి కొన్ని నివారణలు చేయండి.
జ్యోతిష్య శాస్త్రంలో నవగ్రహాల అనుగ్రహంతో ఐశ్వర్యం పొందడానికి నవరత్నాలకు సంబంధించిన పరిహారాలు సూచించబడ్డాయి. అటువంటి పరిస్థితిలో బృహస్పతి అనుగ్రహంతో ఐశ్వర్యాన్ని పొందాలనుకుంటే జ్యోతిష్కుని సలహాతో పుష్పరాగాన్ని బంగారు ఉంగరంలో పొందుపరిచి, పూర్తి క్రతువులతో ధరించాలి. శుభ సమయంలో.. ముఖ్యంగా గురువారం ఈ చర్యలు చేయండి. అప్పుడు ఖచ్చితంగా దాని ఫలితాలను పొందుతారు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు