Astro Tips For Career
ఉద్యోగం కోసం వెళ్లే ఇంటర్వ్యూ లేదా ముఖ్యమైన పనిలో చేయాల్సిన ప్రదర్శన గురించి మీరు భయపడుతున్నారా? విజయం కోసం సమయాన్ని కూడా పట్టించుకోకుండా ఎన్ని గంటలు ప్రిపేర్ అయినప్పటికీ మీలో ఆత్రుత, ఇంకా ఏదో మిస్ అయిన ఫీలింగ్ ఉందా.. అయితే భయపడవద్దు! సనాతన ధర్మంలో .. వేద జ్యోతిష్య శాస్త్రంలో కొన్ని చర్యలు సూచించారు. అవి మీలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడంలో సహాయపడతాయి. తద్వారా అత్యుత్తమ పనితీరును కనబరుస్తారు. జ్యోతిషశాస్త్ర నివారణలు చర్యలు అద్భుత ఫలితాలను అందిస్తాయి. మీ కోసం రోజును ఆదా చేస్తాయి. “సంకల్పం ఉన్న చోటే మార్గం ఉంటుంది” అని సామెతను గుర్తు చేసుకుని.. మీ లక్ష్యాలను సాధించడానికి, కలలను సాకారం చేసుకోవడానికి ఈ నివారణలలో కొన్నింటిని ప్రయత్నించవచ్చు. కెరీర్ విజయావకాశాలను పెంచుకోవడానికి ప్రయత్నించే కొన్ని సాధారణ జ్యోతిష్య నివారణల గురించి తెలుసుకోవచ్చు..
వ్యాపారంలో అభివృద్ధి, విజయవంతమైన కెరీర్ కోసం 10 ఎఫెక్టివ్ రెమెడీస్
- ప్రతి రోజూ ఉదయం నిద్ర లేవగానే “కరాగ్రే వసతే లక్ష్మీ కర మధ్య సరస్వతీ” అనే మంత్రాన్ని చదువుతూ మీ అరచేతి వైపు చూసుకోండి. పొద్దున్నే లేచిన వెంటనే చేసే ఈ చర్య దేవతల నుండి ఆశీర్వాదం పొందడానికి మీరు సాధన చేయగల సులభమైన పద్ధతుల్లో ఇది ఒకటి.
- సూర్య భగవానునికి అర్ఘ్యం సమర్పించండి. సూర్యోదయ సమయంలో ఒక రాగి పాత్ర తీస్కుని అందులో కొంచెం నీరు తీసుకుని, అందులో కొంత బెల్లం, పచ్చి గడ్డి, ఎరుపురంగు పువ్వులు, అక్షతలు వేయండి. తూర్పు ముఖం పెట్టి నిలబడి “ఓం ఘృణి సూర్యాయ నమః” అనే మంత్రాన్ని పదకొండు సార్లు జపించండి. నమస్కారం చేయండి. విజయవంతమైన కెరీర్ కోసం సూర్యుడిని ప్రార్థించండి. అర్ఘ్యం సమర్పించండి.
- గాయత్రీ మంత్రాన్ని జపించండి. చేపట్టిన పనుల్లో ఏర్పడే అడ్డంకులను తొలగించగల శక్తివంతమైన మంత్రం. ఇంటర్వ్యూకి బయలుదేరే ముందు ఎల్లప్పుడూ “ఓం భూర్ భువః స్వః తత్సవితుర్ వరేణ్యం… భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రోచోద్యత్” అని చదవండి. గాయత్రీ దేవికి నైవేద్యంగా లడ్డూ సమర్పించి, బయటకు వెళ్లే ముందు ఆ ప్రసాదాన్ని తీసుకోండి.
- అదృష్టం కోసం బయటకు వెళ్లే సమయంలో జేబులో ఆకుపచ్చ రంగు రుమాలు పెట్టుకోండి.
- మీ ఉద్యోగం లేదా పని కోసం బయలుదేరే ముందు మీ పూర్వీకులను ప్రార్థించండి.
- మీరు పని కోసం బయలుదేరినప్పుడు కొన్ని అక్షతలు చల్లమని మీ పెద్దవారిని అడగండి.
- ఇంటర్వ్యూకి వెళ్లే ముందు లేదా కొత్త ఉద్యోగం ప్రారంభించే ముందు మీ తల్లిదండ్రులు, గురువులు, ఉపాధ్యాయులు, పెద్దల ఆశీస్సులు తీసుకోండి.
- తెలుపు లేదా నీలం రంగు చొక్కా లేదా టాప్ ధరించండి. న్యూమరాలజీ ప్రకారం రెండు రంగులు తటస్థంగా ఉంటాయి. మీ ఉద్యోగ ఇంటర్వ్యూ , పని కోసం మీరు దుస్తులు ధరించే విధానం మీ వ్యక్తిత్వాన్ని సూచిస్తుంది. మీరు మాట్లాడే ముందు మీరు ధరించే దుస్తులు ఒక అభిప్రాయాన్ని ఎదుటివారికి ఏర్పాటు చేస్తుంది.
- ఇంటి నుండి బయలుదేరే ముందు ఎల్లప్పుడూ చక్కెర కలిపిన పెరుగు తినండి. ప్రతి ఒక్కరి జీవితానికి అనుసంధానించబడిన అత్యంత శక్తివంతమైన నివారణల చర్యల్లో ఇది ఒకటి.
- బయటకు వెళ్లే ముందు “ఓం శ్రీ హనుమతే నమః” అనే మంత్రాన్ని ఇరవై ఒక్క సార్లు చదవండి.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Note: (ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది.. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం).