Ketu Effect: తులా రాశిలో కేతువు సంచారం.. ఆ రాశుల వారికి అంతుబట్టని కష్టనష్టాలు! వారికి రెట్టింపు ఆదాయం

| Edited By: Janardhan Veluru

Aug 02, 2023 | 6:50 PM

కేతు గ్రహం ఎప్పుడు ఏ విధంగా ఇబ్బంది పెడతాడన్నది ఒక పట్టాన చెప్పలేం. ఏ రాశిలో ఉంటే ఆ రాశికి సంబంధించిన ఏదో ఒక ఇబ్బంది లేదా కష్టం కలగజేస్తాడని మాత్రం చెప్పవచ్చు. కేతువు ఒక మిస్టరీ లేదా మార్మిక గ్రహం. కనిపించకుండా, తెలియకుండా అకస్మాత్తుగా కాటు వేయడం కేతువు స్వభావం. క్రమం తప్పకుండా సుబ్రహ్మణ్యాష్టకం చదువుకోవడం..

Ketu Effect: తులా రాశిలో కేతువు సంచారం.. ఆ రాశుల వారికి అంతుబట్టని కష్టనష్టాలు! వారికి రెట్టింపు ఆదాయం
Ketu Effects and Remedies
Follow us on

Astrology in Telugu: జ్యోతిష శాస్త్రం ప్రకారం విష సర్పానికి రాహువు తల అయితే, కేతువు తోక. రాహు గ్రహమంత ప్రమాదకారి కానప్పటికీ, కేతువు కూడా కొద్దో గొప్పో ప్రమాదకర గ్రహమే. ఇది కూడా వక్ర గ్రహమే. మోక్షానికి, వైరాగ్యానికి కారకుడుగా చెప్పుకునే కేతు గ్రహం ఎప్పుడు ఏ విధంగా ఇబ్బంది పెడతాడన్నది ఒక పట్టాన చెప్పలేం. ఏ రాశిలో ఉంటే ఆ రాశికి సంబంధించిన ఏదో ఒక ఇబ్బంది లేదా కష్టం కలగజేస్తాడని మాత్రం చెప్పవచ్చు. కేతువు ఒక మిస్టరీ లేదా మార్మిక గ్రహం. కనిపించకుండా, తెలియకుండా అకస్మాత్తుగా కాటు వేయడం కేతువు స్వభావం. క్రమం తప్పకుండా సుబ్రహ్మణ్యాష్టకం చదువుకోవడం, శ్రద్ధగా కుల దైవాన్ని లేదా ఇష్ట దైవాన్ని పూజించడం లేదా వైఢూర్యం పొదిగిన ఉంగరాన్ని ధరించడం వల్ల ఈ కేతువుకు సంబంధించిన దుష్ఫలితాలు చాలా వరకు తగ్గిపోతాయి. ఈ ఏడాది అక్టోబర్ 24 వరకూ తులా రాశిలో కేతువు సంచరించడం జరుగుతోంది. దీనివల్ల ఏ రాశివారికి ఏ విధమైన ఫలితాలు ఉండబోతున్నాయో పరిశీలిద్దాం.

  1. మేషం: ఈ రాశికి సప్తమంలో సంచరిస్తున్న కేతు గ్రహం వల్ల సాధారణంగా జీవిత భాగస్వామితో లేదా వ్యాపార భాగస్వాములతో ఊహించని విధంగా ఇబ్బందులు ఏర్పడతాయి. ఒక్కోసారి అకస్మా త్తుగా అనారోగ్యం పాలయ్యే అవకాశం కూడా ఉంటుంది. జీవిత భాగస్వామితో సత్పంబంధాలకు అడుగడుగునా అడ్డు తగులుతూనే ఉంటాడు. అయితే, సప్తమ స్థానంలో ఉన్న ఈ కేతువు మీద మేష రాశి నుంచి గురు దృష్టి ఉండడం వల్ల కొద్దిగా అదుపులో ఉండే అవకాశం ఉంది.
  2. వృషభం: ఈ రాశికి కేతువు షష్ట స్థానంలో ఉండడం కొద్దిగా మంచి ఫలితాలనే ఇస్తుంది. పైగా దీని మీద గురు దృష్టి కూడా ఉన్నందువల్ల ఈ వక్ర గ్రహం మరింతగా అదుపులో ఉండి అనుకూల ఫలితాలు ఇవ్వడం జరుగుతుంది. సాధారణంగా అనారోగ్యాలకు, రుణ సమస్యలకు అవకాశం ఉండదు. ఉద్యోగంలో అధికారుల నుంచి అకారణంగా ఆదరణ పెరుగుతుంది. వెనుక కుట్రలు, కుతంత్రాలు చేసేవారు పూర్తిగా చతికిలపడిపోతారు. దీర్ఘకాలిక అనారోగ్యాలేమైనా ఉంటే ఉపశమనం లభిస్తుంది.
  3. మిథునం: జీవితంలో అకస్మాత్తుగా మార్పులు, చేర్పులు చోటు చేసుకుంటూ ఉంటాయి. గతంలో ఎన్నడూ లేని కొత్త జీవితం ఏర్పడుతుంది. పరిశోధనల్లో, సృజనాత్మకతలో విజయాలు సాధిస్తారు. పిల్లలు పురోగతి చెందుతారు. ఆదాయం, ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటాయి. సంతానం లేని వారికి కవలలు కలగడం వంటివి కూడా జరుగుతుంది. అయితే, మానసిక పరిస్థితి ఒక్కోసారి బాగుం టుంది, ఒక్కోసారి బాగుండదు. ‘బ్లో హాట్ బ్లో కోల్డ్’ అన్నట్టుగా ఉంటుంది. ఆలోచనల్లో నిలకడ ఉండదు.
  4. కర్కాటకం: ఈ రాశివారికి సుఖ స్థానంలో కేతువు సంచారం వల్ల సుఖ సంతోషాలు లోపిస్తాయి. జీవితంలో సంతోషకరమైన విషయాలు లేదా శుభ పరిణామాలు చోటు చేసుకున్నా ఆనందించడానికి అవ కాశం ఉండదు. కొద్దిగా మనశ్శాంతి తగ్గుతుంది. గృహ, వాహన విషయాల్లో సమస్యలు తలెత్తు తాయి. ముఖ్యంగా నాలుగవ స్థానంలో కేతువు సంచారం తల్లికి మంచిది కాదు. గురు దృష్టి వల్ల పెద్దగా ప్రమాదం ఉండకపోవచ్చు. వృత్తి, ఉద్యోగాల్లో కొద్దిగా ఆచితూచి వ్యవహరించడం మంచిది.
  5. ఇవి కూడా చదవండి
  6. సింహం: ఈ రాశివారికి తోబుట్టువులతో వివాదాలు, విభేదాలు ఏర్పడతాయి. స్నేహితుల్లో కొందరు అపా ర్థాల కారణంగా దూరమవుతారు. ప్రయాణాల్లో విలువైన లేదా ముఖ్యమైన వస్తువులు , పత్రాలు కోల్పోయే అవకాశం ఉంటుంది. ఎంత గట్టిగా ప్రయత్నం చేసినా ముఖ్యమైన వ్యవహారాలు, పనులు పూర్తిగా విజయవంతం అయ్యే అవకాశం ఉండదు. ప్రయత్న లోపం వల్ల కొన్ని అవకా శాలు చేజారిపోతాయి. ఎక్కువగా చెడు కలలు, పీడకలలు రావడం కూడా జరుగుతుంది.
  7. కన్య: ధన, కుటుంబ స్థానంలోనే అక్టోబర్ 24 వరకూ కేతువు తిష్ఠ వేయడం ఈ రాశివారికి ఇబ్బందికరమేనని చెప్పవచ్చు. రావాల్సిన డబ్బు అందక, కష్టానికి తగిన ప్రతిఫలం లభించక, సకాలంలో చెల్లింపులు జరగక ఇబ్బందిపడే అవకాశం ఉంది. వీటితో పాటు, కుటుంబ సమస్యలు కూడా చుట్టుముట్టే ప్రమాదం ఉంది. కుటుంబంలో లేనిపోని వివాదాలు చెలరేగే అవకాశం ఉంటుంది. దాంపత్య సంబంధమైన సమస్యలు కూడా తలెత్తవచ్చు. మాటల్లో కూడా నిగ్రహం ఉండాలి.
  8. తుల: ఈ రాశిలోనే కేతువు సంచరించడం వల్ల, ఆశించిన స్థాయిలో పురోగతి ఉండకపోవడం, తనను అందరూ అపార్థం చేసుకోవడం, ఎవరూ పూర్తిగా నమ్మకపోవడం వంటివి జరిగే అవకాశం ఉంది. అనవసర స్నేహాలు ఏర్పడతాయి. మధ్య మధ్య దారితప్పే సూచనలున్నాయి. ముఖ్యంగా జీవితంలో వేగం తగ్గుతుంది. ముఖ్యమైన వ్యవహారాలకు వెడుతున్నప్పుడు చిన్న చిన్న అనా రోగ్యాలు ఇబ్బంది పడతాయి. అయితే, గురు గ్రహ దృష్టి ఉన్నందువల్ల ఉపశమనం ఉంటుంది.
  9. వృశ్చికం: ఈ రాశికి వ్యయ స్థానంలో కేతు సంచారం కొద్దిగా ఉపయుక్తంగా ఉంటుంది. ఆదాయం పెరగడం, పురోగతి సాధించడం వంటివి యథావిధిగా సాగిపోతాయి. అయితే, అనవసర పరిచయాలకు అవకాశం ఉంటుంది. ఈ చెడు స్నేహాల వల్ల నష్టపోవడం ఉంటుంది. ఆర్థికంగా ఎదగనివ్వని పరిస్థితులు ఏర్పడతాయి. ఆస్తి సంబంధమైన వివాదాలు తలెత్తుతాయి. అనవసర ఖర్చులు, అనుకోని ఖర్చులు తప్పకపోవచ్చు. రహస్య శత్రువుల వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి.
  10. ధనుస్సు: ఈ రాశికి లాభస్థానంలో కేతువు సంచారం వల్ల, దాని మీద రాశ్యధిపతి గురువు దృష్టి కూడా ఉండడం వల్ల మంచి స్నేహాలు ఏర్పడతాయి. పలుకుబడి కలిగిన వ్యక్తులతో లాభదాయక, ఉప బయోగకర పరిచయాలు ఏర్పడతాయి. దీర్ఘకాలిక అనారోగ్యం నుంచి అనుకోకుండా ఉపశమనం లభిస్తుంది. అయితే, డబ్బు వృథా కావడం, కొందరు సన్నిహితులే మోసం చేయడం, బంధువులు దుష్ప్రచారం చేయడం వంటివి జరుగుతాయి. ధార్మిక, దైవ కార్యాలపై ఖర్చు చేయడం జరుగు తుంది.
  11. మకరం: ఈ రాశివారికి వృత్తి, ఉద్యోగాలకు సంబంధించిన దశమ స్థానంలో కేతువు సంచరించడం వల్ల తప్పకుండా ఉద్యోగ సమస్యలు తలెత్తుతాయి. ఉద్యోగంలో ఏ సమస్య అయినా ఎప్పుడు, ఏ విధంగా తలెత్తుతుందో అర్థం కాని పరిస్థితి ఏర్పడుతుంది. ఉద్యోగంలో మార్పు కోసం, ఉద్యోగం మారడం కోసం చేసే ప్రయత్నాలు చాలావరకు సానుకూలం అయినట్టు కనిపిస్తాయి కానీ, చివరికి భంగపాటు తప్పకపోవచ్చు. గురు దృష్టి ఉన్నందువల్ల ఉద్యోగ భద్రతకు భంగం ఉండకపోవచ్చు.
  12. కుంభం: ఈ రాశికి నవమ స్థానంలో కేతు గ్రహ సంచారం వల్ల ఆధ్యాత్మిక చింతన మీదా, దైవ కార్యాల మీదా ఆసక్తి పెరిగే అవకాశం ఉంది. చదువులు, ఉద్యోగాలకు సంబంధించి విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందే అవకాశం ఉంటుంది కానీ, అడుగడుగునా విఘ్నాలు మాత్రం తప్పక పోవచ్చు. కష్టానికి తగ్గ ఫలితం అందకపోవచ్చు. తీర్థయాత్రలకు సరైన ప్లాన్ వేసుకున్నప్పటికీ కొన్ని ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. తండ్రి ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది.
  13. మీనం: ఈ రాశివారికి అష్టమ రాశిలో కేతు సంచారం ఏమంత అనుకూలంగా లేదు. ఏదో ఒక భయం, ఏదో ఒక దిగులు వెంటాడుతూ ఉంటుంది. మనస్సు స్తిమితంగా ఉండదు. జీవిత భాగస్వామికి బాగుంటుంది. మంచి పురోగతి, గుర్తింపు లభిస్తాయి. జీవిత భాగస్వామి తరఫు నుంచి అనుకో కుండా సంపద కలిసి రావడానికి అవకాశం ఉంది. లాటరీలు, జూదాలు, బెట్టింగులు, వడ్డీ వ్యాపా రాలు, షేర్లు వగైరాల వల్ల లబ్ధిపొందే సూచనలు ఉన్నాయి. అయితే, డబ్బు వృథా కావడాన్ని ఆపలేరు.

Note: ఇక్కడ సమకూర్చిన సమాచారం వారివారి నమ్మకం, విశ్వాసాల మీద ఆధారపడి ఉంటుంది. దీన్ని నిర్ధారించేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని గమనించగలరు. పాఠకుల ఆసక్తిని, నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ సమాచారాన్ని అందించాము.

మరిన్ని జ్యోతిష్య కథనాలు చదివేందుకు ఇక్కడ క్లిక్ చేయండి