Career Horoscope 2024: కొత్త సంవత్సరంలో ఆ రాశుల వారికి ఉద్యోగ సమస్యలు పరిష్కారం..! అందులో మీరున్నారా..?

| Edited By: Janardhan Veluru

Dec 29, 2023 | 6:09 PM

కొత్త సంవత్సరంలో అయినా ఉద్యోగ సమస్యలకు పరిష్కారం ఉందా? నిరుద్యోగ సమస్య వదిలిపోతుందా? ఉద్యోగం మారడానికి అవకాశం ఉందా? స్థాన చలనం ఉంటుందా? విదేశాల్లో ఉద్యోగం దొరికే సూచనలున్నాయా? ఈ ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలంటే ఉద్యోగ స్థానాన్ని, అంటే దశమ స్థానాన్ని, దశమాధిపతిని పరిశీలించాల్సి ఉంటుంది.

Career Horoscope 2024: కొత్త సంవత్సరంలో ఆ రాశుల వారికి ఉద్యోగ సమస్యలు పరిష్కారం..! అందులో మీరున్నారా..?
Career Horoscope 2024
Follow us on

కొత్త సంవత్సరంలో అయినా ఉద్యోగ సమస్యలకు పరిష్కారం ఉందా? నిరుద్యోగ సమస్య వదిలిపోతుందా? ఉద్యోగం మారడానికి అవకాశం ఉందా? స్థాన చలనం ఉంటుందా? విదేశాల్లో ఉద్యోగం దొరికే సూచనలున్నాయా? ఈ ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలంటే ఉద్యోగ స్థానాన్ని, అంటే దశమ స్థానాన్ని, దశమాధిపతిని పరిశీలించాల్సి ఉంటుంది. దశమ స్థానం, దశమ స్థానాధిపతిని బట్టి కొన్ని రాశులవారికి జనవరిలోనే ఉద్యోగ సంబంధంగా శుభ పరిణామాలు చోటు చేసుకోవడం, శుభ వార్తలు వినడం జరుగుతుంది. అవిః మేషం, వృషభం, మిథునం, ధనుస్సు, కుంభం, మీనం.

  1. మేషం: ఈ రాశివారికి జనవరి నెలంతా దశమ స్థానం పటిష్టంగా ఉండబోతోంది. ఫలితంగా నిరుద్యోగులకు తప్పకుండా ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఉద్యోగంలో సమస్యలు తగ్గిపోవడం, అధికారులతో సామరస్యం ఏర్పడడం వంటివి చోటు చేసుకుంటాయి. అంతేకాక, ఉద్యోగంలో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. స్థాన చలనాలకు అవకాశం లేదు. విదేశీ ఉద్యోగాలకు ప్రయత్నాలు చేయడానికి సమయం అనుకూలంగా ఉంది. ఉద్యోగం మారే అవకాశాలు చాలా తక్కువ.
  2. వృషభం: ఈ రాశికి దశమ స్థానంలో దశమ స్థానాధిపతి బలమైన సంచారం చేస్తున్నందువల్ల నిరుద్యోగు లకు తప్పకుండా సమయం అనుకూలంగా ఉంది. శుభవార్తలు వింటారు. ఉద్యోగపరంగా ఒకటి రెండు శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఉద్యోగం మారే ప్రయత్నాలు ఫలించకపోవచ్చు. ప్రస్తుత ఉద్యోగంలోనే స్థిరత్వం, పురోగతి లభిస్తాయి. స్థాన చలనాలు ఉండకపోవచ్చు. వృత్తి, ఉద్యోగాల్లో పని భారం, ప్రత్యేక బాధ్యతల భారం కాస్తంత ఎక్కువగానే ఉండే అవకాశం ఉంది.
  3. మిథునం: ఈ రాశికి చెందిన నిరుద్యోగులకు దాదాపు అప్రయత్నంగానే ఉద్యోగం లభించే సూచనలున్నాయి. కోరుకున్న కంపెనీలో ఆశించిన ఉద్యోగం లభిస్తుంది. సాధారణంగా దూర ప్రాంతాల్లో లేదా విదేశాల్లో ఉద్యోగం సంపాదించడం జరుగుతుంది. ఉద్యోగ రీత్యా బాగా ప్రయాణాలు చేయాల్సిన అవసరం ఏర్పడవచ్చు. అధికారుల నుంచి సమస్యలు ఉండే అవకాశం లేదు. ఉద్యోగంలో స్థిరత్వం లభిస్తుంది. శీఘ్ర పురోగతి కూడా ఉంటుంది. ఉద్యోగంలో సానుకూల మార్పులు జరిగే అవకాశం ఉంది.
  4. ధనుస్సు: ఈ రాశికి దశమ స్థానంలో వక్ర గ్రహం ఉన్నందువల్ల ఊహించని విధంగా కొత్త ఉద్యోగం లభించే అవకాశం ఉంటుంది. ఉద్యోగంలో తరచూ మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంటుంది. స్థాన చలనాలు ఉండవచ్చు. ఉద్యోగం మారడానికి కూడా అవకాశం ఉంటుంది. అధికారుల నుంచి గానీ, సహోద్యోగుల నుంచి కానీ సమస్యలు ఉండకపోవచ్చు. ఉద్యోగంలో తలకు మించిన లక్ష్యాలు, బాధ్యతలతో తలపడాల్సి ఉంటుంది. అధికారులు అతిగా ఆధారపడడం జరుగుతుంది.
  5. కుంభం: ఈ రాశికి దశమ స్థానం జనవరి నెలంతా శుభప్రదంగా ఉండడం వల్ల నిరుద్యోగులకు అనేక ఆఫర్లు అందే అవకాశం ఉంది. ఉద్యోగపరంగా తప్పకుండా స్థిరపడడం జరుగుతుంది. ప్రస్తుతం ఉద్యోగంలో ఉన్నవారికి ప్రమోషన్లు లభించడం, అధికార యోగం పట్టడం వంటివి జరిగే అవకాశం ఉంది. ఉద్యోగానికి సంబంధించి శుభవార్తలు వినడం, ఉద్యోగంలో శుభ పరిణామాలు చోటు చేసు కోవడం జరుగుతుంది. ఉద్యోగం మారడానికి అవకాశం ఉంది. అధికారుల నుంచి ఆదరణ లభిస్తుంది.
  6. మీనం: ఈ రాశివారికి దశమ స్థానం, దశమాధిపతి జనవరి నెలంతా బాగా అనుకూలంగా ఉండడం జరుగుతుంది. ఫలితంగా ఉద్యోగ సంబంధమైన సమస్యలేవీ ఉండకపోవచ్చు. నిరుద్యోగులకే కాకుండా ఉద్యోగంలో ఉన్నవారికి కూడా అనేక ఆఫర్లు అంది వస్తాయి. ముఖ్యంగా ఉద్యోగంలో స్థిరత్వం ఏర్పడుతుంది. ప్రమోషన్లకు, జీతభత్యాలు పెరగడానికి అవకాశం ఉంది. విదేశీ సంబంధమైన ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్నవారికి తప్పకుండా శుభ వార్తలు అందుతాయి.