YSRCP: 11మంది సిట్టింగ్‌లకు సీట్లు గల్లంతు.. రెండు మూడు రోజుల్లోనే మూడో జాబితా! టెన్షన్.. టెన్షన్..

అదిగోఇదిగో అంటూ ఉత్కంఠ రేపిన వైసీపీ సెకండ్‌ లిస్ట్‌ వచ్చేసింది!. మొదటి జాబితా ప్రకటించిన నాలుగు వారాల తర్వాత సెకండ్‌ లిస్ట్‌ అనౌన్స్‌మెంట్‌ జరిగింది. మొదట 11మందిని... ఇప్పుడు 27మందిని... మొత్తంగా 38మంది ఇన్‌ఛార్జ్‌ల్ని ఇప్పటివరకు ప్రకటించింది. 

YSRCP: 11మంది సిట్టింగ్‌లకు సీట్లు గల్లంతు.. రెండు మూడు రోజుల్లోనే మూడో జాబితా! టెన్షన్.. టెన్షన్..
Ys Jagan
Follow us

|

Updated on: Jan 03, 2024 | 8:41 AM

అదిగోఇదిగో అంటూ ఉత్కంఠ రేపిన వైసీపీ సెకండ్‌ లిస్ట్‌ వచ్చేసింది!. మొదటి జాబితా ప్రకటించిన నాలుగు వారాల తర్వాత సెకండ్‌ లిస్ట్‌ అనౌన్స్‌మెంట్‌ జరిగింది. మొదట 11మందిని… ఇప్పుడు 27మందిని… మొత్తంగా 38మంది ఇన్‌ఛార్జ్‌ల్ని ఇప్పటివరకు ప్రకటించింది. ఫస్ట్‌ లిస్ట్‌లో కేవలం ఎమ్మెల్యే అభ్యర్థుల్ని మాత్రమే ప్రకటిస్తే, సెకండ్‌ లిస్ట్‌లో మాత్రం ఎంపీ టికెట్స్‌ కూడా అనౌన్స్‌ చేసింది. అనంతపురం, హిందూపురం, అరకు పార్లమెంట్‌ స్థానాలకు కొత్త అభ్యర్థుల్ని రంగంలోకి దింపింది. అలాగే, నలుగురు సిట్టింగ్‌ ఎంపీలకు ఎమ్మెల్యే టికెట్లు కేటాయించింది వైసీపీ. రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్‌ను రాజమండ్రి సిటీకి, కాకినాడ ఎంపీ వంగా గీతను పిఠాపురంకు, అరకు ఎంపీ గొడ్డేటి మాధవిని అరకు అసెంబ్లీ స్థానానికి, అనంతపురం ఎంపీ తలారి రంగయ్యను కళ్యాణదుర్గం ఇన్‌ఛార్జ్‌లుగా ప్రకటించింది.

ఎమ్మెల్యే బరిలోకి ఎంపీలు

మార్గాని భరత్‌ – రాజమండ్రి సిటీ (ప్రస్తుతం రాజమండ్రి ఎంపీ)

వంగా గీత – పిఠాపురం (ప్రస్తుతం కాకినాడ ఎంపీ)

గొడ్డేటి మాధవి – అరకు (ప్రస్తుతం అరకు ఎంపీ)

కళ్యాణదుర్గం – తలారి రంగయ్య (ప్రస్తుతం అనంతపురం ఎంపీ)

ఇక, మిగతా మార్పులను చూస్తే, రాజాంకు తాలె రాజేష్‌ను, అనకాపల్లికి మలసాల భరత్‌కుమార్‌ను, పాయకరావుపేటకు కంబాల జోగులును, రామచంద్రపురానికి పిల్లి సూర్యప్రకాష్‌ను, పి.గన్నవరానికి విప్పర్తి వేణుగోపాల్‌ను, జగ్గంపేటకు తోట నరసింహంను, ప్రత్తిపాడుకు వరుపుల సుబ్బారావును, రాజమండ్రి రూరల్‌కు చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణను, పోలవరానికి తెల్లం రాజ్యలక్ష్మి, కదిరికి బీఎస్‌ మక్బూల్‌ అహ్మద్‌ను, యర్రగొండపాలెంకు తాటిపర్తి చంద్రశేఖర్‌ను, ఎమ్మిగనూరుకు మాచాని వెంకటేష్‌ను, తిరుపతికి భూమన అభినయ్‌రెడ్డిను, గుంటూరు ఈస్ట్‌కు షేక్‌ నూరి ఫాతిమాను, మచిలీపట్నంకు పేర్ని కృష్ణమూర్తి అలియాస్‌ కిట్టును, చంద్రగిరికి చెవిరెడ్డి మోహిత్‌రెడ్డిని, పెనుకొండకు కేవీ ఉషాశ్రీ చరణ్‌ను, పాడేరుకు మత్స్యరాస విశ్వేశ్వరరాజును, విజయవాడ సెంట్రల్‌కు వెల్లంపల్లి శ్రీనివాసరావును, విజయవాడ వెస్ట్‌కు షేక్‌ ఆసిఫ్‌ను ఇన్‌ఛార్జ్‌లుగా నియమించింది వైసీపీ.

సెకండ్‌ లిస్ట్‌లో 11మంది సిట్టింగ్‌లకు షాక్‌ ఇచ్చారు జగన్‌. వీళ్లల్లో 10మంది ఎమ్మెల్యేలు కాగా, ఒకరు ఎంపీ. పి.గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు, జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు, ప్రత్తిపాడు ఎమ్మెల్యే పర్వతప్రసాద్‌, పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబు, విజయవాడ సెంట్రల్‌ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, ఎమ్మిగనూరు ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి, కదిరి ఎమ్మెల్యే సిద్ధారెడ్డి, అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్‌, పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబూరావు, అరకు ఎమ్మెల్యే చెట్టి ఫాల్గుణ, హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్‌… ఈ 11మందీ టిక్కెట్లు కోల్పోయారు. అయితే, మరో ఐదు సిట్టింగ్‌ ఎమ్మెల్యేల స్థానాల్లో వాళ్ల వారసులకు సీట్లిచ్చింది వైసీపీ. మరి, థర్డ్‌ లిస్ట్‌లో ఎంతమంది సిట్టింగ్‌ల చీటీ చిరగబోతోందో మరో రెండు మూడ్రోజుల్లో తేలిపోనుంది!.

సిట్టింగ్‌లకు షాక్‌.. 11 మంది వీరే..

  • కొండేటి చిట్టిబాబు (పి.గన్నవరం)
  • జ్యోతుల చంటిబాబు (జగ్గంపేట)
  • పర్వతప్రసాద్‌ (ప్రత్తిపాడు)
  • పెండెం దొరబాబు (పిఠాపురం)
  • మల్లాది విష్ణు (విజయవాడ సెంట్రల్‌)
  • చెన్నకేశవరెడ్డి (ఎమ్మిగనూరు)
  • సిద్ధారెడ్డి(కదిరి)
  • గుడివాడ అమర్‌నాథ్‌(అనకాపల్లి)
  • గొల్ల బాబూరావు(పాయకరావుపేట)
  • చెట్టి ఫాల్గుణ(అరకు)
  • గోరంట్ల మాధవ్‌ (హిందూపురం ఎంపీ)

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

అనుమానాస్పదంగా ఆగిన రెడ్ కలర్ కారు.. డోర్లు ఓపెన్ చేస్తే..
అనుమానాస్పదంగా ఆగిన రెడ్ కలర్ కారు.. డోర్లు ఓపెన్ చేస్తే..
ఈ సినిమాను పైరసీ చెయ్యలేరు .. సవాల్ విసిరిన నరేష్
ఈ సినిమాను పైరసీ చెయ్యలేరు .. సవాల్ విసిరిన నరేష్
ఆ పథకంలో వేలల్లో పెట్టుబడితో కోట్లల్లో రాబడి..కానీ వారికి మాత్రమే
ఆ పథకంలో వేలల్లో పెట్టుబడితో కోట్లల్లో రాబడి..కానీ వారికి మాత్రమే
కేరళకు వెళ్లొద్దు.. విద్యార్థులకు తమిళనాడు ప్రభుత్వం వార్నింగ్.!
కేరళకు వెళ్లొద్దు.. విద్యార్థులకు తమిళనాడు ప్రభుత్వం వార్నింగ్.!
‘చీరమీను’ రుచి అదిరేను.. మీకు తెలుసా ఈ చేపల గురించి
‘చీరమీను’ రుచి అదిరేను.. మీకు తెలుసా ఈ చేపల గురించి
అక్బరుద్దీన్‌కు సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్.. వీడియో చూశారా..
అక్బరుద్దీన్‌కు సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్.. వీడియో చూశారా..
వానొచ్చింది.. ఊరు మురిసింది..! గాడిదల నోరు తీపి చేస్తూ సంబరాలు..
వానొచ్చింది.. ఊరు మురిసింది..! గాడిదల నోరు తీపి చేస్తూ సంబరాలు..
కీలక గ్రహాలు అనుకూలం.. ఆ రాశుల వారి ఆదాయం దినదినాభివృద్ధి..!
కీలక గ్రహాలు అనుకూలం.. ఆ రాశుల వారి ఆదాయం దినదినాభివృద్ధి..!
18ఏళ్లకే పెళ్లైంది.. 20 ఏళ్లకే తలైంది.. ఇప్పుడు కోట్లల్లో సంపాదన.
18ఏళ్లకే పెళ్లైంది.. 20 ఏళ్లకే తలైంది.. ఇప్పుడు కోట్లల్లో సంపాదన.
మరికొన్ని గంటల్లో భారత్- శ్రీలంక మ్యాచ్.. ఆస్పత్రిలో కీలక ప్లేయర్
మరికొన్ని గంటల్లో భారత్- శ్రీలంక మ్యాచ్.. ఆస్పత్రిలో కీలక ప్లేయర్