YS Jagan: జగన్ వ్యూహం.. ప్రజల్లోకి వైసీపీ నాయకత్వం.. ఎన్నికలే టార్గెట్‌గా సామాజిక బస్సు యాత్రలు..
YSRCP Samajika Sadhikara Yatra: ఎన్నికలు దగ్గరపడుతున్నాయి.. దీంతో వచ్చే మూడు నెలలు ప్రజల్లో ఉండేలా అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పక్కా ప్రణాళికతో ముందుకెళ్తుంది. పార్టీ కేడర్ మొత్తం ప్రజల్లోనే ఉండేలా జగన్ నేతృత్వంలోని వైసీపీ ఇప్పటికే ఒక షెడ్యూల్‌ను రూపొందించింది. విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో జరిగిన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి.. పార్టీ తరపున చేపట్టాల్సిన కార్యక్రమాలను కేడర్‌కు స్పష్టంగా వివరించారు. సీఎం జగన్ ప్రకటించిన కార్యక్రమాలను ఒక్కొక్కటిగా ఆచరణలో పెడుతున్నారు.
YSRCP Samajika Sadhikara Yatra: ఎన్నికలు దగ్గరపడుతున్నాయి.. దీంతో వచ్చే మూడు నెలలు ప్రజల్లో ఉండేలా అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పక్కా ప్రణాళికతో ముందుకెళ్తుంది. పార్టీ కేడర్ మొత్తం ప్రజల్లోనే ఉండేలా జగన్ నేతృత్వంలోని వైసీపీ ఇప్పటికే ఒక షెడ్యూల్‌ను రూపొందించింది. విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో జరిగిన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి.. పార్టీ తరపున చేపట్టాల్సిన కార్యక్రమాలను కేడర్‌కు స్పష్టంగా వివరించారు. సీఎం జగన్ ప్రకటించిన కార్యక్రమాలను ఒక్కొక్కటిగా ఆచరణలో పెడుతున్నారు. ఇప్పటికే జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం ద్వారా ప్రభుత్వం సిబ్బందితో కలిసి పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రజల్లోకి వెళ్తున్నారు. ఇక గడిచిన నాలుగున్నరేళ్లలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేసిన సంక్షేమం, అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు బస్సు యాత్రలకు సిద్ధమవుతోంది పార్టీ నాయకత్వం.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిన తర్వాత ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, నిరుపేద వర్గాలకు చేసిన మేలును ఈ మీటింగుల ద్వారా వివరించి ఆయా వర్గాలకు మరింత చేరువ కావాలని సీఎం జగన్ దిశానిర్ధేశం చేశారు. ప్రతి రోజూ ఉత్తరాంధ్ర, దక్షిణ కోస్తా, రాయలసీమ.. ఇలా మూడు ప్రాంతాల్లోని ఏదో ఒక నియోజకవర్గంలో బస్సు యాత్రలు చేపట్టాలని సీఎం జగన్ ఆదేశించారు. సామాజిక బస్సు యాత్రల పేరిట ఈ బస్సు యాత్రలు చేపట్టనున్నారు. అక్టోబర్ 26 నుంచి డిసెంబర్ 31 వరకూ విడతల వారీగా మొత్తం మూడు ప్రాంతాల్లోని 175 నియోజకవర్గాల్లో బస్సు యాత్ర చేపట్టేలా పార్టీ రీజినల్ కోఆర్డినేటర్లు ఇప్పటికే సమావేశాలు నిర్వహించారు.
యాత్రలు సక్సెస్ చేసేందుకు రంగంలోకి రీజినల్ కోఆర్డినేటర్లు..
సామాజిక బస్సు యాత్రలు రేపటి నుంచి ప్రారంభంకానున్నాయి. ఈ యాత్రలు దాదాపు 60 రోజుల పైగా జరిగేలా ఇప్పటికే ప్రణాళికలు పూర్తిచేశారు. మూడు ప్రాంతాల్లో మూడు టీమ్‌లు బస్సు యాత్రల్లో పాల్గొంటాయి. ఒక్కో టీమ్‌లో పార్టీకి చెందిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సీనియర్ నాయకులంతా ఉంటారు. ఎమ్మెల్యేలు లేదా స్థానిక సమన్వయకర్తలు ఈ బస్సు యాత్రకు అధ్యక్షత వహిస్తారు. ఒక్కోరోజు ఆ ప్రాంతంలోని అసెంబ్లీ నియోజకవర్గంలో పర్యటించి అక్కడ మీటింగ్ నిర్వహించి ప్రభుత్వం చేసిన సామాజిక న్యాయం, మహిళా సాధికారత, స్కూళ్లు, ఆసుపత్రుల్లో నాడు- నేడు ద్వారా విద్యా వైద్య రంగంలో ఎలాంటి మార్పులు తీసుకొచ్చింది.. వ్యవసాయం గురించి, ఆయా నియోజకవర్గాల్లో జరిగిన అభివృద్ధి గురించి, తీసుకొచ్చిన మార్పుల గురించి వివరించాలని సీఎం దిశానిర్ధేశం చేశారు. అంతేకాకుండా.. ఆయా ప్రాంతాల్లో పబ్లిక్ మీటింగ్‌లు కూడా నిర్వహించనున్నారు. బస్సుపైనుంచే బహిరంగ సభలో ప్రసంగించేలా ఏర్పాట్లు చేశారు. ఈ యాత్రలు విజయవంతం చేసేందుకు రీజినల్ కోఆర్డినేటర్లకు బాధ్యతలు అప్పగించడంతో.. వారు ఇప్పటికే నియోజకవర్గాల వారీగా వారివారి జిల్లాల్లో సమావేశాలు ఏర్పాటుచేసి మొదటి విడత బస్సు యాత్రకు సంబంధించిన షెడ్యూల్‌ను సిద్ధం చేసారు.
మొదటి విడతలో భాగంగా మూడు ప్రాంతాల్లో గురువారం నుంచి ప్రారంభమయ్యే బస్సు యాత్రలు.. అక్టోబర్ 29, నవంబర్ 5వ తేదీ, ఆదివారాలు మినహా మిగిలిన 13 రోజుల పాటు.. అంటే నవంబర్ 9 వరకూ జరగనున్నాయి. ప్రతి నియోజకవర్గంలో జరిగే మీటింగ్‌లో ఎక్కువమంది పాల్గొనేలా ఇప్పటికే కార్యచరణను రూపొందించారు. ముఖ్యంగా పేద వర్గాలపై పార్టీ ఫోకస్ పెట్టింది. పేదలకు-పెత్తందార్లకు మధ్య జరుగుతున్న వార్‌గా ప్రజల్లోకి తీసుకెళ్లాలన్న సీఎం సూచనలతో ఆ దిశగా నాయకులు అన్ని ఏర్పాట్లను పూర్తిచేశారు. ఈ యాత్రలు సమన్వయం చేసే బాధ్యతలను ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఎమ్మెల్సీలు అప్పిరెడ్డి, తలశిల రఘురాంలకు పార్టీ అధిష్టానం ఇప్పటికే అప్పగించడంతో.. వారు నియోజకవర్గాల్లోనే మకాం వేసి.. యాత్రల విజయవంతానికి చర్యలు తీసుకుంటున్నారు.
నియోజకవర్గాల వారీగా యాత్ర షెడ్యూల్..
- అక్టోబర్ 26 – ఇచ్చాపురం – తెనాలి – శింగనమల
- అక్టోబర్ 27 – గజపతినగరం – నరసాపురం – తిరుపతి
- అక్టోబర్ 28 – భీమిలి – చీరాల – ప్రొద్దుటూరు
- అక్టోబర్ 30 – పాడేరు – దెందులూరు – ఉదయగిరి
- అక్టోబర్ 31 – ఆముదాలవలస – నందిగామ – ఆదోని
- నవంబర్ 1 – పార్వతీపురం – కొత్తపేట – కనిగిరి
- నవంబర్ 2 – మాడుగుల – అవనిగడ్డ – చిత్తూరు
- నవంబర్ 3 – నరసన్నపేట – కాకినాడ రూరల్ – శ్రీకాళహస్తి
- నవంబర్ 4 – శృంగవరపుకోట – గుంటూరు ఈస్ట్ – ధర్మవరం
- నవంబర్ 6 – గాజువాక – రాజమండ్రి రూరల్ – మార్కాపురం
- నవంబర్ 7 – రాజాం – వినుకొండ – ఆళ్లగడ్డ
- నవంబర్ 8 – సాలూరు – పాలకొల్లు – నెల్లూరు రూరల్
- నవంబర్ 9 – అనకాపల్లి – పామర్రు – తంబళ్లపల్లె
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..