AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వచ్చే నెల 3న మరోసారి టీడీపీ-జనసేన ఉమ్మడి విస్తృత స్థాయి సమావేశం.. ఏం చెప్పబోతున్నారంటే?

మొదటి జాయింట్‌ యాక్షన్‌ కమిటీ మీటింగ్‌లో మూడు తీర్మానాలు చేశాయి టీడీపీ, జనసేన. ఈ క్రమంలోనే నవంబర్ 3న విజయవాడలో మరోసారి టీడీపీ-జనసేన ఉమ్మడి విస్తృత స్థాయి సమావేశం నిర్వహించాలని ఫ్లాన్ చేశాయి రెండు పార్టీలు. ఈ సందర్భంగా ఉమ్మడిగా ఇంటింటి ప్రచారంపై కేడర్‌కు దిశానిర్దేశం చేయనున్నారు రెండు పార్టీల నేతలు.

వచ్చే నెల 3న మరోసారి టీడీపీ-జనసేన ఉమ్మడి విస్తృత స్థాయి సమావేశం.. ఏం చెప్పబోతున్నారంటే?
Tdp Janasena
Balaraju Goud
|

Updated on: Oct 25, 2023 | 8:38 AM

Share

తెలుగు దేశం పార్టీ – జనసేన ఉమ్మడి కార్యాచరణ దిశగా అడుగులు పడుతున్నాయి. ఇప్పటికే కమిటీ సభ్యులను నియమించిన ఇరు పార్టీలు.. వేర్వేరుగా సమావేశమై పలు అంశాలపై చర్చించాయి. ఆ తర్వాత సమావేశమైన పవన్, లోకేష్ ప్రస్తుత రాజకీయాలు, ఉమ్మడి పోరాటానికి సంబంధించిన కార్యాచరణపై నిర్ణయాలు తీసుకున్నారు. ఈ క్రమంలోనే నవంబర్ 1నుంచి ఉమ్మడిగా జనంలోకి వెళ్ళాలని నిర్ణయించారు.

టీడీపీ-జనసేన ఉమ్మడి ఎజెండాతో జనంలోకి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగానే నవంబర్‌ 1 నుంచి ఇంటింటి ప్రచారం చేపట్టబోతున్నట్టు ప్రకటించారు. రెండు పార్టీలకు సంబంధించి ఉమ్మడి మేనిఫెస్టోతో ఒకటో తేదీ నుంచి ప్రజల్లోకి వెళ్తున్నామంటున్నారు. ఓట్ల తొలగింపుతో సహా ప్రతి ప్రజా సమస్యపై ఇక నుంచి రెండు పార్టీలు కలిసే పోరాడాలే కార్యచరణ రూపొందించినట్లు సమాచారం. ఈ క్రమంలోనే నవంబర్ 3న విజయవాడలో మరోసారి టీడీపీ-జనసేన ఉమ్మడి విస్తృత స్థాయి సమావేశం నిర్వహించాలని ఫ్లాన్ చేశాయి రెండు పార్టీలు. ఈ సందర్భంగా ఉమ్మడిగా ఇంటింటి ప్రచారంపై కేడర్‌కు దిశానిర్దేశం చేయనున్నారు రెండు పార్టీల నేతలు.

ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు 100 రోజుల ప్రణాళిక రూపొందించింది టీడీపీ-జనసేన. వైసీపీ పోవాలి.. టీడీపీ-జనసేన రావాలి అనే నినాదంతో ఉమ్మడిగా ప్రజల్లోకి వెళ్తామని ఇదివరకే పవన్ కల్యాణ్, నారా లోకేశ్ సంయుక్తంగా ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే నవంబర్‌ 1న ఉమ్మడి కార్యాచరణతో సిద్ధమవుతున్నారు. ఇకపై ఉమ్మడి వెళ్లే ఏ కార్యక్రమంలోనూ రెండు పార్టీలు సమన్వయం కలిసి వెళ్ళేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. ఈ క్రమంలోనే విజయవాడలో మరోసారి టీడీపీ-జనసేన ఉమ్మడి విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది.

ఇటు తెలుగు దేశం పార్టీతో కలిసి నడుస్తూనే భారతీయ జనతా పార్టీతో పొత్తుపైనా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. జనసేన ఎన్డీయేలోనే కొనసాగుతుందన్న విషయాన్ని గుర్తు చేశారు. ఏపీలో ప్రత్యేక పరిస్థితులు ఉన్నందునే పొత్తు పెట్టుకున్నామని, దీనిపై బీజేపీ అధిష్టానం కూడా సానుకూలంగా ఉందని పవన్ క్లారిటీ ఇచ్చారు. అంటే వచ్చే ఎన్నికల నాటికి మూడు పార్టీలు కలిసి వెళ్ళే అవకాశమున్నట్లు పవన్ మాటలను బట్టి అర్థమవుతోంది.

ఈ నేపథ్యంలోనే మొదటి జాయింట్‌ యాక్షన్‌ కమిటీ మీటింగ్‌లో మూడు తీర్మానాలు చేశాయి టీడీపీ, జనసేన. ఆంధ్రప్రదేశ్‌ను అరాచక పాలన నుంచి కాపాడడం, అన్ని వర్గాలకు అభివృద్ది అందించడం, చంద్రబాబు అరెస్ట్‌కు నిరసన తెలపడం. వీటిని ఉమ్మడి కార్యాచరణగా తీసుకెళ్లడానికి జిల్లాల స్థాయిలో కార్యకర్తల సమావేశాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఏపీలోని ఉమ్మడి జిల్లాల్లో అక్టోబర్ 29, 30, 31 తేదీల్లో జరిగే సమావేశాలకు రెండు పార్టీల కార్యకర్తలు పాల్గొని, నిర్ణయాలు తీసుకుంటారన్నారు. ఆ తరువాత ఏమాత్రం ఆలస్యం చేయకుండా.. మ్యానిఫెస్టో ప్రకటించి, నవంబర్‌ 1 నుంచే ఇంటింటి ప్రచారం కూడా చేపడతామన్నారు. ఇక ప్రజా సమస్యలపై పోరులో భాగంగా రాష్ట్రంలో కరువు పరిస్థితులపై ప్రాంతాల వారీగా నివేదిక తయారు చేయబోతున్నాయి రెండు పార్టీలు. మరోవైపు టీడీపీ-జనసేన ఉమ్మడి కార్యాచరణపై అధికార పార్టీ నుంచి గట్టి విమర్శలే వస్తున్నాయి. ఆ రెండు పార్టీల జాయింట్‌ యాక్షన్‌తో జగన్ ప్రభుత్వానికి వచ్చిన నష్టమేమీ లేదంటున్నారు వైసీపీ నేతలు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…