Vijaysai Reddy: తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ కూలడం ఖాయం.. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు

|

Feb 05, 2024 | 5:57 PM

రాజ్యసభలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీకి కాంగ్రెస్‌ తీవ్ర అన్యాయం చేసిందంటూ పేర్కొన్నారు. రాష్ట్రాన్ని అన్యాయంగా విభజించారంటూ రాజ్యసభ సాక్షిగా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డారు.

YSRCP MP Vijaysai Reddy Sensational Comments : రాజ్యసభలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీకి కాంగ్రెస్‌ తీవ్ర అన్యాయం చేసిందంటూ పేర్కొన్నారు. రాష్ట్రాన్ని అన్యాయంగా విభజించారంటూ రాజ్యసభ సాక్షిగా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసినా 10 ఏళ్లు అధికారం దక్కలేదన్నారు. పదేళ్ల తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ సర్కార్‌ త్వరలో కూలడం ఖాయమంటూ విజయసాయిరెడ్డి పేర్కొన్నారు.

కుటుంబాలను చీల్చడం కాంగ్రెస్‌కు అలవాటని అన్నారు. దేశంలో అతిత్వరలో కాంగ్రెస్‌ కనుమరుగవుతుందంటూ విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. ఏపీలో కాంగ్రెస్‌ ఉనికి లేకుండా పోయిందన్నారు. గత ఎన్నికల్లో నోటా కంటే తక్కువ ఓట్లు వచ్చాయన్నారు. 2029లో కూడా తాను ఎంపీగా ఉంటానని పేర్కొన్న విజయసాయిరెడ్డి.. 2029లో కాంగ్రెస్‌కు ఒక్క ఎంపీ కూడా ఉండరు.. ఇది తన ఛాలెంజ్‌ అంటూ పేర్కొన్నారు.

కాగా.. పార్లమెంట్ లో విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారాయి. దీనిపై కాంగ్రెస్ నేతలు ఏ విధంగా స్పందిస్తారనేది.. హాట్ టాపిక్ గా మారింది.

వైఎస్ షర్మిల ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన నాటినుంచి వైసీపీ, కాంగ్రెస్ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఈ క్రమంలోనే.. విజయసాయిరెడ్డి రాజ్యసభలో తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం గురించి మాట్లాడటం చర్చనీయాంశమైంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..