జీఎస్టీ పరిహారం కింద రాష్ట్రాలకు చెల్లించాల్సిన రూ. 51,798 కోట్లను కేంద్రం తక్షణం చెల్లించాలని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కోరారు. కరోనా కారణంగా రాష్ట్రాల ఆదాయాలు తగ్గి అభివృద్ధి, సంక్షేమ పథకాల కొనసాగింపునకు నిధుల కొరతను ఎదుర్కొంటున్నాయని తెలిపారు. జీఎస్టీ వసూళ్లు పెరుగుతున్నందున బకాయిల విడుదలపై కేంద్ర ప్రభుత్వం దృష్టి పెట్టాలని కోరుతూ ఆయన ట్విట్టర్ ద్వారా కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. సోమవారంనాడు ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, గత వారం ప్రధాని నరేంద్ర మోడీని కూడా కలిసిన విజయసాయి..జీఎస్టీ పరిహారం చెల్లింపు అంశంపై ట్వీట్ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.
విజయసాయి రెడ్డి సోమవారంనాడు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను పార్లమెంటు ఆవరణాలోని ఆమె కార్యాలయంలో కలిసి విజ్ఞప్తి చేశారు. నిధుల కొరత కారణంగా అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుకు ఏపీ ప్రభుత్వం ఇబ్బందులు పడుతున్నట్లు వివరించారు. ఏపీ రుణ సేకరణపై విధించిన సీలింగ్, రిసోర్స్ గ్యాప్ ఫండింగ్, ఏపీ స్టేట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్, వైఎస్సార్ స్టీల్ కార్పొరేషన్ తో పాటు రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. గురువారంనాడు ప్రధాని నరేంద్ర మోడీని కూడా విజయసాయి రెడ్డి కలిసి.. ఏపీకి సంబంధించిన అంశాలపై చర్చించారు.
జీఎస్టీ పరిహారం కింద రాష్ట్రాలకు చెల్లించాల్సిన 51,798 కోట్లను కేంద్రం తక్షణం చెల్లించాలి. కరోనా కారణంగా రాష్ట్రాల ఆదాయాలు తగ్గి అభివృద్ధి, సంక్షేమ పథకాల కొనసాగింపునకు నిధుల కొరతను ఎదుర్కొంటున్నాయి. జీఎస్టీ వసూళ్లు పెరుగుతున్నందున బకాయిల విడుదలపై దృష్టి పెట్టాలి.
— Vijayasai Reddy V (@VSReddy_MP) December 14, 2021
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను కలిసి విజయసాయి రెడ్డి..
Hon’ble Union Finance Minister Smt. @NSitharaman was kind enough to give an appointment today to discuss Andhra Pradesh’s issues of Net Borrowing Ceiling, resource gap funding, APSDC, YSR Steel Corpn. and other finance related issues.@nsitharamanoffc pic.twitter.com/46bzHuT41T
— Vijayasai Reddy V (@VSReddy_MP) December 13, 2021
Also Read..
AP Crime News: అనంతపురంలో కన్నింగ్ లేడీ కహానీ.. లక్షకు పది వేల వడ్డీ ఇస్తానంటూ..