తిరుపతి సమీపంలోని రాయల చెరువు కట్టకు పడిన లీకేజీలను వెంటనే పూడ్చి, స్థానికుల్లో నెలకొన్న భయాందోళనలు తొలగించాలని ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు పేర్కొన్నారు. రాయల చెరువును పరిశీలించిన ఆయన.. చెరువు కట్టకు చేస్తున్న మరమ్మతులను పరిశీలించారు. చెరువు ప్రస్తుత పరిస్థితిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. యుద్ధ ప్రాతిపదినక పనులు పూర్తి చేయాలని కోరారు. మరమ్మతులు వేగవంతం చేయకుంటే.. ప్రమాదం జరిగే అవకాశముందని అన్నారు. కాగా బాబు పర్యటన సందర్భంగా ఇక్కడ ఆసక్తికర సన్నివేశం కనిపించింది. రాయల చెరువు వద్ద సహాయ కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్న ప్రభుత్వ విప్, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి… చంద్రబాబు కనిపించగానే లేచి నిల్చుని నమస్కారం చేశారు. అయితే చంద్రబాబు ప్రతి నమస్కారం చేశారా లేదా అన్నది విజువల్స్‌లో సరిగ్గా కనిపించలేదు. ప్రస్తుతం ఏపీలో నడుస్తోన్న పొలిటికల్ హీట్ నేపథ్యంలో ఈ దృశ్యం అక్కడ ఉన్నవారిని ఆశ్చర్యానికి గురించేసింది.
తిరుపతి రూరల్ ప్రాంతాన్ని భయపెడుతున్న రాయల చెరువును పరిశీలించేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు తొలుత పర్మిషన్ లేదన్నారు పోలీసులు. రాయలచెరువును రెడ్ జోన్‌గా గుర్తించినట్లు వివరించారు. చెరువుకు గండి పడడంతో మరమ్మతులు పనులు జరుగుతున్నాయని.. చంద్రబాబు కాన్వాయ్ వచ్చేందుకు ఇబ్బంది అవుతుందని చెప్పారు. ఆయనకు భద్రత కల్పించలేమంటూ చిత్తూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడు నానికి నోటీస్ ఇచ్చారు స్థానిక DSP. దీంతో.. అక్కడ పోలీసులు పెద్దసంఖ్యలో మోహరించారు. అయినప్పటికీ చంద్రబాబు అక్కడికి చేరుకుని రాయలచెరువును పరిశీలించారు.
Also Read: గుటక గుటకలో గరళం.. గరం గరం ఛాయ్‌లో విష రసాయనాలు.. టీ తాగేవారికి షాకింగ్ న్యూస్