Ambati Rambabu: వైసీపీ నేత అంబటి రాంబాబుకు కరోనా.. మూడోసారి సోకిన మహమ్మారి..
YSRCP MLA Ambati Rambabu: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. మరోవైపు కొత్త వేరియంట్ ఒమిక్రాన్ సైతం
YSRCP MLA Ambati Rambabu: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. మరోవైపు కొత్త వేరియంట్ ఒమిక్రాన్ సైతం అలజడి రేపుతోంది. థర్డ్‌వేవ్‌లో సాధారణ ప్రజల నుంచి సెలబ్రిటిల వరకు అందరూ కరోనా బారిన పడుతున్నారు. వీరితోపాటు రాజకీయ నాయకులకు సైతం కరోనా సోకుతోంది. అయితే.. ఫస్ట్ వేవ్, సెకెండ్ వేవ్‌లో కరోనా బారిన పడ్డవారు కూడా థర్డ్‌వేవ్ ఈ మహమ్మారి బారిన పడుతుండటం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా ఏపీలో అధికార వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, సత్తెనపల్లి ఎమ్మెల్యే అంబటి రాంబాబు మళ్లీ కరోనా బారినపడ్డారు. తాజాగా నిర్వహించిన పరీక్షలో కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు ఆయన ఆదివారం తెలిపారు. ఆయనకు కరోనా సోకడం ఇది మూడోసారని పేర్కొన్నారు.
అంబటి రాంబాబు శుక్రవారం భోగి సందర్భంగా ప్రజలతో కలిసి ఆడిపాడారు. ఆ తర్వాత కరోనా స్వల్ప లక్షణాలు కనిపించడంతో వైద్య పరీక్షలు చేయించుకోగా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు తెలిపారు. ఈ మేరకు అంబటి రాంబాబు ఓ వీడియోను సోషల్ మీడియాలో పంచుకున్నారు. ప్రస్తుతం స్వల్ప లక్షణాలు ఉన్నాయని, ఇంట్లో క్వారంటైన్లో ఉంటానని తెలిపారు. తనను కలిసేందుకు ఎవ్వరూ రావొద్దని రాంబాబు సూచించారు.
కాగా.. అంబటి రాంబాబుకు మొదట 2020 జులైలో కరోనా పాజిటివ్ వచ్చింది. ఆ తర్వాత డిసెంబరులో రెండోసారి.. తాజాగా మూడోసారి కూడా కరోనా సోకింది.
Also Read: