CM Jagan: ఎన్నికలకు ‘సిద్ధం’పై వైసీసీ సన్నాహక సమావేశం.. ఆ కీలక నేతలు గైర్హాజరు

తిరుపతిలో వైసీపీ సిద్ధం సభ సన్నాహక సమావేశం జరిగింది. వైసీపీ ప్రజాప్రతినిధులు, నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌లు ఈ మీటింగ్‌లో పాల్గొన్నారు. టిక్కెట్‌ దక్కని కొంతమంది అసంతృప్త ఎమ్మెల్యేలు సమావేశానికి డుమ్మా కొట్టారు. మరోవైపు రానున్న ఎన్నికల్లో రాయలసీమను క్లీన్‌స్వీప్‌ చేస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు మంత్రి పెద్దిరెడ్డి.

CM Jagan: ఎన్నికలకు సిద్ధంపై వైసీసీ సన్నాహక సమావేశం.. ఆ కీలక నేతలు గైర్హాజరు
YSRCP

Edited By: Basha Shek

Updated on: Jan 29, 2024 | 7:16 PM

తిరుపతిలో వైసీపీ సిద్ధం సభ సన్నాహక సమావేశం జరిగింది. వైసీపీ ప్రజాప్రతినిధులు, నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌లు ఈ మీటింగ్‌లో పాల్గొన్నారు. టిక్కెట్‌ దక్కని కొంతమంది అసంతృప్త ఎమ్మెల్యేలు సమావేశానికి డుమ్మా కొట్టారు. మరోవైపు రానున్న ఎన్నికల్లో రాయలసీమను క్లీన్‌స్వీప్‌ చేస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు మంత్రి పెద్దిరెడ్డి. ఆంధ్రప్రదేశ్‌లో అధికార YSRCP ఎన్నికలకు సిద్ధమవుతోంది. అందులో భాగంగానే సిద్ధం పేరుతో భారీ బహిరంగ సభలను నిర్వహిస్తోంది. మొన్న ఉత్తరాంధ్రలోని భీమిలిలో భారీ సభను నిర్వహించి ఎన్నికల శంఖారావాన్ని పూరించింది. ఇక ఫిబ్రవరి 3వ తేదీన అనంతపురంజిల్లాలోనూ సిద్ధం పేరుతో బహిరంగ సభను నిర్వహించేందుకు ప్లాన్‌ చేస్తోంది. అందులో భాగంగానే ఇవాళ తిరుపతిలో సన్నాహక సభను నిర్వహించారు. ఇందులో రాయలసీమలోని 49 నియోజకవర్గాలకు చెందిన ఎమ్మెల్యేలు, వైసీపీ ఇన్‌ఛార్జ్‌లు పాల్గొన్నారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో తిరుపతిలో జరిగిన సన్నాహక సమావేశంలో సిద్ధం సభ ఏర్పాట్లపై చర్చించారు. ఎమ్మెల్యేల అభిప్రాయాలు, రాష్ట్రంలోనే ఓ పెద్దసభగా దీన్ని నిర్వహించేలా ప్లాన్‌ చేస్తున్నామని మంత్రి పెద్దిరెడ్డి తెలిపారు. ఇంతకుముందు సీమలో ఓడిపోయిన 3 స్థానాల్లోనూ గెలిచేందుకు సమాయత్తం అవుతున్నామన్నారు. తనపై కోనేరు ఆదిమూలం చేసిన వ్యాఖ్యలను ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నానన్నారు. తాను అవినీతిపరుడో కాదో.. జిల్లా ప్రజలకు తెలుసన్నారు మంత్రి పెద్దిరెడ్డి.

 

ఇవి కూడా చదవండి

మరోవైపు అనంతపురంలో జరిగే “సిద్ధం” సభ నిర్వహణకు సన్నాహకంగా జరిగిన ఈ సమావేశానికి కొందరు నేతలు డుమ్మా కొట్టారు. ఈ ఎన్నికల్లో టిక్కెట్‌ దక్కని అసంతృప్తి ఎమ్మెల్యేలంతా హాజరుకాలేదు. వారిలో రాష్ట్ర మంత్రి గుమ్మనూరు జయరాం, ఎమ్మెల్యేలు ఆదిమూలం, MS బాబు, నవాజ్‌ బాషా, తిప్పేస్వామి, మేడ మల్లిఖార్జునరెడ్డి, సిద్ధారెడ్డి హాజరుకాలేదు. మరోవైపు కొందరు అసంతృప్తి ఎమ్మెల్యేలకు ఆహ్వానం లేకుండానే సమావేశం నిర్వహించినట్లు తెలుస్తోంది. మొత్తానికి సన్నాహక సమావేశానికి ఏకంగా పదిమందికిపైగా ప్రజాప్రతినిధులు హాజరుకాకపోవడం చర్చనీయాంశంగా మారింది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..