K Rosaiah: ఆ జిల్లాకు రోశయ్య పేరు పెట్టాలి.. తెరమీదకు కొత్త డిమాండ్‌..

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రిగా సేవలందించిన రోశయ్యకు గుంటూరు జిల్లాతో ఎంతో అనుబంధం ఉంది. ఆజిల్లాలోని వేమూరులోనే ఆయన పుట్టి పెరిగారు

K Rosaiah: ఆ జిల్లాకు రోశయ్య పేరు పెట్టాలి.. తెరమీదకు కొత్త డిమాండ్‌..

Updated on: Dec 14, 2021 | 6:40 PM

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రిగా సేవలందించిన రోశయ్యకు గుంటూరు జిల్లాతో ఎంతో అనుబంధం ఉంది. ఆజిల్లాలోని వేమూరులోనే ఆయన పుట్టి పెరిగారు. ఈక్రమంలోనే రోశయ్య కన్నుమూసిన తర్వాత గుంటూరు జిల్లాల్లో ఆయన విగ్రహాలు ఏర్పాటుచేసేందుకు అధికార, ప్రతిపక్ష పార్టీలు పోటీపడ్డాయి. కాగా ఇప్పుడు మరొక కొత్త ప్రతిపాదన తెరమీదకు వచ్చింది. ఆయన పుట్టి పెరిగిన గుంటూరు జిల్లాకు కొనిజేటి రోశయ్య పేరుపెట్టాలన్న డిమాండ్‌ వినిపిస్తోంది. ఈ మేరకు మంగళవారం జగ్గయ్యపేటలో జరిగిన రోశయ్య విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్లు వినతిపత్రం అందజేశారు.

ప్రస్తుతం గుంటూరు జిల్లా రాజకీయాలన్నీ రోశయ్య విగ్రహం చుట్టే తిరుగుతున్నాయి. ఆయన కన్నుమూసినప్పటి నుంచి తామంటే తాము విగ్రహాలు ఏర్పాటుచేస్తామంటూ వైసీపీ, టీడీపీలు పోటాపోటీగా ప్రతిపాదనలు చేశారు. ఈ నేపథ్యంలో టీడీపీ నాయకుల ఎత్తుగడలను ముందుగానే గమనించిన వైసీపీ జగ్గయ్యపేటలోని బస్టాండ్‌ సెంటర్‌లో శరవేగంగా రోశయ్య విగ్రహం ఏర్పాటుచేసింది. బుధవారం ఈ విగ్రహ ఆవిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమానికి దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌, ప్రభుత్వ విప్‌ సామినేని ఉదయభాను హాజరయ్యారు. కాగా ఈ కార్యక్రమంలోనే రోశయ్యకు భారతరత్న ఇవ్వాలని, గుంటూరు జిల్లాకు రోశయ్య జిల్లాగా పేరు పెట్టాలని వైసీపీ కౌన్సిలర్లు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు మంత్రి వెల్లంపల్లికి వినతి పత్రం అందించారు. కాగా ఈ విషయాన్ని ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి దృష్టికి తీసుకెళతామని మంత్రి వెల్లంపల్లి, ఉదయభాను వైసీపీ కౌన్సిలర్లకు హామీ ఇచ్చారు.

Also Read:

AP BJP: ఏపీ బీజేపీ నేతలకు అధిష్టానం నుంచి పిలుపు.. ఢిల్లీ వెళ్లిన కన్నా.. ఎందుకంటే..?

MP Vijayasai Reddy: GST పరిహారం చెల్లించండి.. కేంద్రాన్ని కోరిన వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి

ఏపీ ప్రభుత్వానికి చుక్కెదురు.. సినిమా టికెట్ల ధరల తగ్గింపు పై హైకోర్టు కీలక ఆదేశాలు..