
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి మేమంతా సిద్ధం బస్సు యాత్రతో దూసుకుపోతున్నారు. ఎన్నికల క్యాంపేన్‌లో ప్రజలతో మమేకమవుతూ ముందుకు సాగుతున్నారు. ఇవాళ తొమ్మిదో రోజు బస్సు యాత్ర.. నెల్లూరు జిల్లాలో సాగనుంది. సాయంత్రం కావలిలో జరిగే బహిరంగ సభలో జగన్ ప్రసంగిస్తారు. ఉదయం 9గంటలకు చింతరెడ్డిపాలెం నుంచి జగన్ బస్సుయాత్ర మొదలవుతుంది. కొవ్వూరు క్రాస్, సున్నబట్టి, తిప్ప, గౌరవరం మీదగా సాగుతుంది. లంచ్ బ్రేక్ తర్వాత కావలి బహిరంగసభలో పాల్గొంటారు జగన్. సభ ముగిశాక… ఏలూరుపాడు, ఉలవపాడు క్రాస్, సింగరాయకొండ క్రాస్, ఓగురు, కందుకూరు, పొన్నలూరు, వెంకుపాలెం వరకు బస్సు యాత్ర సాగుతుంది. రాత్రికి జువ్విగుంట క్రాస్ దగ్గర బస చేస్తారు జగన్.
ఇప్పటికే రాయలసీమ జిల్లాల్లో బస్సు యాత్రను కంప్లీట్ చేసుకున్నారు సీఎం జగన్. మొత్తం 8రోజులపాటు రాయలసీమలో పర్యటించారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..