YSRCP cadre attack on TDP leader house: తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి పట్టాభి ఇంటిపై వైఎస్‌ఆర్‌సీపీ కార్యకర్తలు దాడి చేశారు. విజయవాడలోని ఆయన ఇంట్లోకి ప్రవేశించిన కార్యకర్తలు సామగ్రి ధ్వంసం చేశారు. ఈ రోజు ఉదయం పట్టాభి నిర్వహించిన మీడియా సమావేశంలో ప్రభుత్వాన్ని, సీఎం జగన్‌ను ఉద్దేశించి కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మాజీ మంత్రి నక్కా ఆనంద్‌బాబుకు విశాఖ నర్సీపట్నం పోలీసుల నోటీసులు ఇవ్వడాన్ని తప్పుబడుతూ పోలీసులు, రాష్ట్ర ప్రభుత్వంపై పట్టాభి ఈ వ్యాఖ్యలు చేశారు. మీడియా సమావేశం అనంతరం సీఎంపై వ్యాఖ్యలకు నిరసనగా.. వైఎస్ఆర్ సీపీకి చెందిన కొందరు వ్యక్తులు ఇంట్లోకి ప్రవేశించి దాడి చేశారు. ఈ దాడిలో ఇంట్లోనున్న ఫర్నిచర్ ధ్వంసం అయింది.
సీఎం జగన్‌పై వ్యాఖ్యలకు నిరసనగా.. వైఎస్ఆర్‌సీపీ కార్యకర్తలు పలు జిల్లాల్లోని టీడీపీ కార్యాలయాలు, నేతల ఇళ్లను ముట్టడించేందుకు కార్యక్రమాలు చేపట్టారు. దీంతోపాటు టీడీపీ కేంద్ర కార్యాలయంపై కూడా దాడిచేశారు. ఇప్పటికే హిందూపురం, విశాఖపట్నంలో వైకాపా కార్యకర్తలు, నేతలు నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. కొన్నిచోట్ల టీడీపీ, వైసీపీ వర్గాలు ఘర్షణకు కూడా దిగాయి.
Also Read: