YSR Vahan Mitra: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ (YS Jagan) శుక్రవారం (నేడు) విశాఖలో పర్యటించనున్నారు. ఏయూ ఇంజినీరింగ్ కాలేజీ గ్రౌండ్‌లో వాహన మిత్ర చెక్కులను పంపిణీ చేయనున్నారు. ట్యాక్సీ, మాక్సీ క్యాబ్ డ్రైవర్లకు నాలుగో విడత వైఎస్సార్ మిత్ర చెక్కులను పంపిణీ చేయనున్నారు. 2022–23 సంవత్సరానికి గాను రాష్ట్రంలో 2,61,516 మంది సొంత ఆటో, ట్యాక్సీ, మాక్సీ క్యాబ్ ఉన్న అర్హులైన డ్రైవర్లకు ఆర్థిక సాయం అందనుంది. ఒక్కొక్కరికి రూ.10వేల చొప్పున అందుకోనున్నారు. ఈ ఏడాది రూ.261.51 కోట్ల వరకు ప్రయోజనం కలుగనుంది. గత మూడేళ్ల కంటే ఈ ఏడాదిలో ఎక్కువ మంది ఈ వాహన మిత్ర సాయం అందుకోనున్నారు. ఈ వాహనదారులు ఆర్థికంగా ఇబ్బందులు పడుతుండగా, వైఎస్ జగన్ పాదయాత్ర సమయంలో సమస్యలను విన్నవించారు ఆటో డ్రైవర్లు.
వాహన మిత్రకు మొత్తం 2,61,516 లబ్దిదారుల ఎంపిక:
పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు ఈ సాయం అందిస్తున్నారు సీఎం జగన్. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈ పథకాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది ప్రభుత్వం. 2022–23కు గాను అర్హత గల డ్రైవర్ల నుంచి ప్రభుత్వం దరఖాస్తులు ఆహ్వానించింది ప్రభుత్వం. ఈ సంవత్సరం మొత్తం 2,61,516 మందిని లబ్ధిదారులుగా గుర్తించారు అధికారులు. ఈ నెల 15న విశాఖపట్నంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి లబ్ధిదారులకు రూ.10 వేల చొప్పున మొత్తం ఈ సాయం అందించనున్నారు. మొత్తం 2,61,516 మంది లబ్దిదారుల్లో బీసీలు 1,44,164 ఉండగా, ఎస్సీలు 63,594 మంది, ఎస్టీలు 10,472 మంది ఉన్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి