Andhra Pradesh: ఏపీ వ్యాప్తంగా రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు.. 30 పురస్కారాలు ప్రదానం చేయనున్న ప్రభుత్వం..
ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నారు. ప్రభత్వం అధికారికంగా ఈ వేడుకలను నిర్వహిస్తుండగా.. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక ‘వైఎస్సార్ జీవిత సాఫల్య, వైఎస్సార్ సాఫల్య–2022’ పురస్కారాలను..
ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నారు. ప్రభత్వం అధికారికంగా ఈ వేడుకలను నిర్వహిస్తుండగా.. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక ‘వైఎస్సార్ జీవిత సాఫల్య, వైఎస్సార్ సాఫల్య–2022’ పురస్కారాలను ప్రదానం చేయనుంది. ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని వరుసగా రెండో ఏడాది ఈ పురస్కారాలను ప్రభుత్వం అందిచనుంది. మంగళవారం ఉదయం విజయవాడలో జరిగే అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, విశిష్ట అతిథిగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, ఆత్మీయ అతిథిగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి సతీమణి వైఎస్ విజయమ్మ హాజరవుతారు. వ్యవసాయం, కళలు–సంస్కృతి, సాహిత్యం, మహిళా, శిశు సాధికారత, విద్య, జర్నలిజం, వైద్యం, పరిశ్రమ రంగాల్లో విశేషకృషి చేసిన 35 మంది వ్యక్తులు, సంస్థలకు కలిపి 30 పురస్కారాలను అందజేయనున్నారు. వీటిలో 20 వైఎస్సార్ జీవిత సాఫల్య పురస్కారాలు కాగా.. 10 వైఎస్సార్ సాఫల్య పురస్కారాలు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే అత్యున్నత పురస్కారాల తరహాలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ‘వైఎస్సార్’ అవార్డులను గత ఏడాది నుంచి అందిస్తూ వస్తోంది.
వ్యవసాయంలో 5, కళలు–సంస్కృతిలో 5, సాహిత్యంలో 3, మహిళా, శిశు సాధికారతలో 3, విద్యరంగంలో 4, జర్నలిజంలో 4, వైద్యంలో 5 అవార్డులు, పరిశ్రమల విభాగంలో ఒక అవార్డును ప్రదానం చేయనున్నారు. ఆయా రంగాల్లో సామాజిక అభ్యున్నతి కోసం అసామాన్య కృషిచేసి, విశిష్ట సేవలు అందించిన వ్యక్తులు, సంస్థలకు ఈ పురస్కారాలు అందజేయనున్నారు. వైఎస్సార్ జీవిత సాఫల్య పురస్కారం కింద రూ.10 లక్షల నగదుతో పాటు వైఎస్సార్ కాంస్య విగ్రహం, జ్ఞాపిక, ప్రశంసాపత్రం, వైఎస్సార్ సాఫల్య పురస్కారం కింద రూ.5 లక్షల నగదు, జ్ఞాపిక, ప్రశంసాపత్రం బహూకరించనున్నారు.
వివిధ రంగాల్లో పురస్కారాలు అందుకోనున్న వారి వివరాలు
వ్యవసాయ రంగం ( వైఎస్సార్ సాఫల్య పురస్కారాలు)
ఆదివాసీ కేష్యూనట్ ఫార్మర్స్ ప్రొడ్యూసర్ కంపెనీ– సోడెం ముక్కయ్య – బుట్టాయగూడెం, ఏలూరు జిల్లా
కుశలవ కోకోనట్ ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ కంపెనీ – ఎ.గోపాలకృష్ణ; బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా
అన్నమయ్య మ్యూచువల్లీ ఎయిడెడ్ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ – జయబ్బనాయుడు, తలుపల గ్రామం, పీలేరు మండలం, అన్నమయ్య జిల్లా
అమృత ఫల ఫార్మర్స్ ప్రొడ్యూసర్ కంపెనీ –కె.ఎల్.ఎన్. మౌక్తిక, సబ్బవరం, అనకాపల్లి జిల్లా
కట్టమంచి బాలకృష్ణారెడ్డి, కట్టమంచి గ్రామం, చిత్తూరు జిల్లా
కళలు–సంస్కృతి విభాగం (వైఎస్సార్ సాఫల్య పురస్కారాలు)