వైఎస్ఆర్‎కు ఘన నివాళి.. జగన్, షర్మిలతో తల్లి విజయమ్మ..

వైఎస్ఆర్ 75వ జయంతిని పురస్కరించుకుని వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ ఇడుపులపాయలో తన తండ్రికి నివాళులు అర్పించారు. ముందుగా వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలవేసిన తరువాత తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సమాధి వద్దకు చేరుకున్నారు. వైఎస్ జగన్ కంటే ముందే వైఎస్ఆర్ ఘాట్ వద్దకు చేరకున్న తల్లి విజయమ్మను.. వైఎస్ జగన్ ఆలింగనం చేసుకున్నారు. అనంతరం ఇద్దరూ ‎దివంగతనేత వైఎస్ఆర్ స్మారకంపై పుష్పగుచ్ఛం ఉంచి నివాళి అర్పించారు. అనంతరం ప్రత్యేక ప్రార్థనలు చేశారు.

వైఎస్ఆర్‎కు ఘన నివాళి.. జగన్, షర్మిలతో తల్లి విజయమ్మ..
Ysr Ghat
Follow us

|

Updated on: Jul 08, 2024 | 10:13 AM

వైఎస్ఆర్ 75వ జయంతిని పురస్కరించుకుని వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ ఇడుపులపాయలో తన తండ్రికి నివాళులు అర్పించారు. ముందుగా వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలవేసిన తరువాత తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సమాధి వద్దకు చేరుకున్నారు. వైఎస్ జగన్ కంటే ముందే వైఎస్ఆర్ ఘాట్ వద్దకు చేరకున్న తల్లి విజయమ్మను.. వైఎస్ జగన్ ఆలింగనం చేసుకున్నారు. అనంతరం ఇద్దరూ ‎దివంగతనేత వైఎస్ఆర్ స్మారకంపై పుష్పగుచ్ఛం ఉంచి నివాళి అర్పించారు. అనంతరం ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ జగన్ సతీమణి వైఎస్ భారతి, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, తిరుపతి ఎంపీ గురుమూర్తి, మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషాతోపాటు కడప జిల్లా నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ తన ఎక్స్ ఖాతాలో ఒక సందేశాన్ని ఇచ్చారు.

‘ వైఎస్ఆర్ 75వ పుట్టిన రోజు తమకు పండుగ రోజని.. అలాగే కోట్లాది కుటుంబాలు ఇవాళ మహానేతను జ్ఙాపకం చేసుకుంటున్నాయన్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు రాజన్న పుట్టిన రోజు సందర్భంగా అనేక సేవాకార్యక్రమాలు చేస్తున్నారని తెలిపారు. ప్రజా శ్రేయస్సు కోసం మీరు చూపిన మార్గం తమకు శిరోధార్యం అని కీర్తించారు. జీవితాంతం మీరు పాటించిన క్రమశిక్షణ, చేసిన కఠోర శ్రమ, రాజకీయాల్లో చూపిన ధైర్యసాహసాలు తమకు మార్గం అని అన్నారు. వైఎస్ఆర్ ఆశయాల సాధనే లక్ష్యంగా, కోట్లాది కుటుంబాల క్షేమమే ధ్యేయంగా చివరివరకూ తాము కృషి చేస్తామని తెలిపారు.

అనంతరం వైఎస్ఆర్ తనయ వైఎస్ షర్మిల కూడా ఇడుపులపాయకు చేరుకుని తండ్రి రాజశేఖర్ రెడ్డికి నివాళులు అర్పించారు. ఆమెతో కూడా తల్లి విజయమ్మ పాల్గొనడం ఆసక్తిని కలిగించింది. ఒక తల్లిగా ఇద్దరు బిడ్డలను సమానంగా చూస్తానన్న సందేశాన్ని దివంగత నేత వైఎస్ఆర్ ఘాట్ సాక్షిగా తెలిపారు. ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలతో పాటు భర్త అనిల్, కొడుకు, కోడలు, కుమార్తె, కాంగ్రెస్ పార్టీ నాయకులు తులసి రెడ్డి, కార్యకర్తలు పాల్గొన్నారు. వైఎస్ఆర్ ఘాట్ లో తండ్రికి నివాళి అర్పించిన తరువాత వైఎస్ షర్మిల మంగళగిరి బయలుదేరి వెళ్లారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

రాజయ్య అంగిల జొర్రి ఆగం పట్టిచ్చిన తొండ | బతుకమ్మ స్టెప్పులతో..
రాజయ్య అంగిల జొర్రి ఆగం పట్టిచ్చిన తొండ | బతుకమ్మ స్టెప్పులతో..
తల మసాజ్‌ వల్ల పక్షవాతం.! యువకుడి ప్రాణంతో బార్బర్ చెలగాటం..
తల మసాజ్‌ వల్ల పక్షవాతం.! యువకుడి ప్రాణంతో బార్బర్ చెలగాటం..
అమ్మా క్షమించు.! మారాలని ఉన్నా మారలేక శాశ్వతంగా వెళ్లిపోతున్నా.!
అమ్మా క్షమించు.! మారాలని ఉన్నా మారలేక శాశ్వతంగా వెళ్లిపోతున్నా.!
మగమహారాజులకు డేంజర్ బెల్స్.. ఆ క్యాన్సర్ ముప్పు వారికే ఎక్కువ.!
మగమహారాజులకు డేంజర్ బెల్స్.. ఆ క్యాన్సర్ ముప్పు వారికే ఎక్కువ.!
దారుణం.! పోలీసును వెంటాడి, కారుతో ఈడ్చుకెళ్లి.. వీడియో వైరల్..
దారుణం.! పోలీసును వెంటాడి, కారుతో ఈడ్చుకెళ్లి.. వీడియో వైరల్..
సూసైడ్‌ చేసుకున్న టిక్‌టాక్ స్టార్, షాక్‌లో ఫ్యాన్స్‌.!
సూసైడ్‌ చేసుకున్న టిక్‌టాక్ స్టార్, షాక్‌లో ఫ్యాన్స్‌.!
వామ్మో.. తీయని కేక్‌ తింటే ఇన్ని ఆరోగ్య సమస్యలా? 12 రకాల కేకులు..
వామ్మో.. తీయని కేక్‌ తింటే ఇన్ని ఆరోగ్య సమస్యలా? 12 రకాల కేకులు..
మెట్రోలో పీతల సందడి.. మెట్రోలో ప్రయాణికురాలి సంచి నుంచి బయటపడ్డయి
మెట్రోలో పీతల సందడి.. మెట్రోలో ప్రయాణికురాలి సంచి నుంచి బయటపడ్డయి
ఇకపై రైల్వే ట్రాక్‌పై వస్తువులు పెట్టేవారి అంతు చూస్తాం.!
ఇకపై రైల్వే ట్రాక్‌పై వస్తువులు పెట్టేవారి అంతు చూస్తాం.!
హౌతీ తీవ్రవాదులపై ఇజ్రాయెల్ పంజా.! యెమెన్‌లో భీకర దాడులు..
హౌతీ తీవ్రవాదులపై ఇజ్రాయెల్ పంజా.! యెమెన్‌లో భీకర దాడులు..