AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

YS Jagan: శ్వేత పత్రాలతో రాష్ట్ర ప్రజలను మభ్య పెట్టే యత్నం చేస్తున్నారుః వైఎస్ జగన్

ఏపీలో అరాచకపాలన సాగుతోందంటూ.. డిల్లీ స్థాయిలో గొంతెత్తిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ మరోసారి ఏపీ సర్కార్‌పై విరుచుకుపడ్డారు. తాడేపల్లిలోని తన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతున్నారు. రాష్ట్రం పురోగతి రివర్స్‌లో నడుస్తోందని ఎద్దేవా చేశారు.

YS Jagan: శ్వేత పత్రాలతో రాష్ట్ర ప్రజలను మభ్య పెట్టే యత్నం చేస్తున్నారుః వైఎస్ జగన్
Ys Jagan
Balaraju Goud
|

Updated on: Jul 26, 2024 | 1:37 PM

Share

ఏపీలో అరాచకపాలన సాగుతోందంటూ.. డిల్లీ స్థాయిలో గొంతెత్తిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ మరోసారి ఏపీ సర్కార్‌పై విరుచుకుపడ్డారు. తాడేపల్లిలోని తన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతున్నారు. రాష్ట్రం పురోగతి రివర్స్‌లో నడుస్తోందని ఎద్దేవా చేశారు. గత 52 రోజులుగా దాడులు, అత్యాచారాలు, ఆస్తుల ధ్వంసం కొనసాగుతోందని ఆరోపించారు. ప్రశ్నించే వాళ్లను అణచివేసే ధోరణితో చంద్రబాబు పాలన సాగుతోందని మండిపడ్డారు. విధ్వంస పాలన కొనసాగుతుంటే.. పోలీసులు ప్రేక్షకపాత్ర వహిస్తున్నారని వైఎస్ జగన్ ఆరోపించారు. చంద్రబాబు అరాచకపాలనపై పోరాటానికి వైఎస్సార్‌ సిద్ధంగా ఉందని వైఎస్‌ జగన్‌ స్పష్టం చేశారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బడ్జెట్‌ కూడా పెట్టలేని అధ్వానమైన స్థితిలో చంద్రబాబు సర్కార్ ఉందని ధ్వజమెత్తారు. ఏడు నెలల ఓటాన్‌ బడ్జెట్‌ పెడుతోంది. పూర్థిస్థాయి బడ్జెట్‌ పెట్టే ధైర్యం బాబు ప్రభుత్వానికి లేదంటే, పాలన ఎంతటి అధ్వాన్నస్థితిలో ఉందో అర్థం చేసుకోవాలన్నారు జగన్. చంద్రబాబు మోసపూరిత హామీలు కేటాయింపులు చూపించలేకనే బడ్జెట్ పెట్టలేకపోతుందని విరుచుకుపడ్డారు. రాష్ట్రం క్లిష్టపరిస్థితుల్లో ఉందని చంద్రబాబు గ్యాంగ్‌ తప్పుడు ప్రచారం చేస్తోందని ఆరోపించారు. రాష్ట్ర ఆర్థికస్థితి బాగులేకనే పూర్తిస్థాయి బడ్జెట్‌ పెట్టడం లేదని వైఎస్ జగన్ విమర్శించారు.

శ్వేత పత్రాలతో రాష్ట్ర ప్రజలను మభ్య పెట్టే యత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ సందర్భంగా ఈ ఏడాది జూన్‌ దాకా, చంద్రబాబు ప్రభుత్వం తీసుకున్న అప్పులకు సంబంధించిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వైఎస్ జగన్ వివరించారు. చంద్రబాబు కంటే తమ హయంలోనే తక్కువ అప్పులు చేశామని అంటున్నారు మాజీ సీఎం జగన్. మార్చి వరకు ఏపీకి ఉన్న అప్పులు 4 లక్షల 85 వేల కోట్లు అయితే ఒక రిపోర్ట్‌లో 10 లక్షల కోట్లు అని, మరో రిపోర్ట్‌లో 14 లక్షల కోట్లు అప్పు అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.

Follow Us
ధర్మాజీపేటలో వరుస ఆలయ దొంగతనాలు.. హుండీలు, ఆభరణాలు మాయం!
ధర్మాజీపేటలో వరుస ఆలయ దొంగతనాలు.. హుండీలు, ఆభరణాలు మాయం!
కొత్త కారు కొనాలనుకుంటే ఇదే బెస్ట్‌ ఆప్షన్‌!
కొత్త కారు కొనాలనుకుంటే ఇదే బెస్ట్‌ ఆప్షన్‌!
మాజీ ఆర్మీ జవాన్.. తాగుడు అతడ్ని ఇంతలా దిగజార్చింది..
మాజీ ఆర్మీ జవాన్.. తాగుడు అతడ్ని ఇంతలా దిగజార్చింది..
అందుకే జీవన్ రెడ్డి కాంగ్రెస్‌ను వీడారు..మల్లు రవి కీలక వ్యాఖ్యలు
అందుకే జీవన్ రెడ్డి కాంగ్రెస్‌ను వీడారు..మల్లు రవి కీలక వ్యాఖ్యలు
టేస్ట్.. డబుల్ ఎనర్జీ.. ఎవ్వరికీ తెలియని రాగి లడ్డు రెసిపీ ఇదే..
టేస్ట్.. డబుల్ ఎనర్జీ.. ఎవ్వరికీ తెలియని రాగి లడ్డు రెసిపీ ఇదే..
పిల్లలకు ఇస్తున్న క్రీమ్ బిస్కెట్లలో అసలు క్రీమ్ ఉందా?
పిల్లలకు ఇస్తున్న క్రీమ్ బిస్కెట్లలో అసలు క్రీమ్ ఉందా?
రంగు పోయిన రోల్డ్ గోల్డ్ నగలకు ఇంట్లోనే మెరుగు
రంగు పోయిన రోల్డ్ గోల్డ్ నగలకు ఇంట్లోనే మెరుగు
ఈ మొక్క మీ ఇంట్లో ఉంటే బల్లులకు చుక్కలే.. ఇలా చేస్తే ఒక్కటి కూడా
ఈ మొక్క మీ ఇంట్లో ఉంటే బల్లులకు చుక్కలే.. ఇలా చేస్తే ఒక్కటి కూడా
పీఎఫ్ ఖాతాదారులకు కేంద్రం సూపర్ న్యూస్.. దేశంలో ఎక్కడైనా..
పీఎఫ్ ఖాతాదారులకు కేంద్రం సూపర్ న్యూస్.. దేశంలో ఎక్కడైనా..
ఐపీఎల్ లో వైభవ్ సూర్యవంశీ సంచలన రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్‌మెంట్
ఐపీఎల్ లో వైభవ్ సూర్యవంశీ సంచలన రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్‌మెంట్