ఏపీలో ఎన్నికల పోరు తారా స్థాయికి చేరింది. సీఎం వైఎస్ జగన్ వైఎస్ఆర్సీపీకి సంబంధించిన 175 మంది ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితా విడుదల చేశారు. ముందుగా కడప విమానాశ్రయానికి చేరుకున్న సీఎం జగన్, అక్కడి నుంచి తన తండ్రి వైఎస్ఆర్ ఘాట్ వద్దకు వెళ్లారు. తన తండ్రి సమాధి వద్ద నివాళులు అర్పించారు. అనంతరం 2024 అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల బరిలో దిగుతున్న వారి జాబితాను ప్రకటించారు. ఈసారి విజయం వరించడం కోసం ఎన్నికల జైత్రయాత్రను ప్రారంభించే ముందు తండ్రి ఆశీర్వాదాన్ని తీసుకున్నారు.
Cm Ys Jagan
Follow us on
ఏపీలో ఎన్నికల పోరు తారా స్థాయికి చేరింది. సీఎం వైఎస్ జగన్ వైఎస్ఆర్సీపీకి సంబంధించిన 175 మంది ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితా విడుదల చేశారు. ముందుగా కడప విమానాశ్రయానికి చేరుకున్న సీఎం జగన్, అక్కడి నుంచి తన తండ్రి వైఎస్ఆర్ ఘాట్ వద్దకు వెళ్లారు. తన తండ్రి సమాధి వద్ద నివాళులు అర్పించారు. అనంతరం 2024 అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల బరిలో దిగుతున్న వారి జాబితాను ప్రకటించారు. ఈసారి విజయం వరించడం కోసం ఎన్నికల జైత్రయాత్రను ప్రారంభించే ముందు తండ్రి ఆశీర్వాదాన్ని తీసుకున్నారు. మార్చి 16న అభ్యర్థుల 175 అసెంబ్లీ, 25 పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థుల జాబితాను ఒకేసారి ప్రకటించారు. మాజీ మంత్రి ధర్మాన ప్రసాద్ ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించగా.. ఎంపీ నందిగామ సురేష్ పార్లమెంట్ అభ్యర్థుల జాబితాను ప్రకటించారు. మార్చి 18న ఇచ్చాపురం నుంచి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలను గతం కంటే కూడా ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు సీఎం జగన్. మొత్తం 175 అసెంబ్లీ సీట్లలో ఓసీలకు 84, బీసీలకు 48, ఎస్సీ 10, ఎస్టీలకు 33 సీట్లను కేటాయించారు. మొత్తం 25 పార్లమెంట్ సీట్లలో బీసీలకు 11, ఎస్సీ 4, ఎస్టీ 1, ఓసీలకు 9 సీట్లు కేటాయించారు.
ఈ కార్యక్రమంలో సీఎం జగన్ తో పాటు ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామకృష్ణా రెడ్డి, కడప స్థానిక నేతలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. 2024 సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన మ్యానిఫెస్టోపై తీవ్ర కసరత్తు జరుగుతోంది. మ్యానిఫెస్టోలో పొందుపర్చాల్సిన మరిన్ని అంశాలపై చర్చిస్తున్నారు. మరో రెండు రోజుల్లో మ్యానిఫెస్టోను కూడా విడుదల చేసే అవకాశం ఉంది.
పార్లమెంట్ అభ్యర్థుల తుది జాబితా..
శ్రీకాకుళం – పేరాడ తిలక్ – బిసి కళింగ
విజయనగరం – బెల్లాన చంద్రశేఖర్ – బిసి తూర్పు కాపు
విశాఖపట్నం – బొత్స ఝాన్సీ లక్ష్మీ – బిసి తూర్పు కాపు
అరకు – చెట్టి తనూజ రాణి – ఎస్టీ వాల్మీకి
కాకినాడ – చెలమలశెట్టి సునీల్ – ఓసీ కాపు
అమలాపురం – రాపాక వరప్రసాద్ – ఎస్‌సి మాల
రాజమండ్రి – డా. గూడురి శ్రీనివాసులు – బిసి శెట్టి బలిజ
నర్సాపురం – గూడూరి ఉమా బాల – బిసి శెట్టి బలిజ
ఏలూరు – కారుమూరి సునీల్ కుమార్ – బిసి యాదవ
మచిలీపట్నం – డా. సింహాద్రి చంద్రశేఖర్‌రావు – ఓసీ కాపు
విజయవాడ – కేశినేని శ్రీనివాస (నాని) – ఓసీ కమ్మ
గుంటూరు – కిలారి వెంకట రోశయ్య – ఓసీ కాపు
నర్సరావుపేట – డా. పి. అనిల్ కుమార్ యాదవ్ – బిసి యాదవ
బాపట్ల – నందిగాం సురేష్ బాబు – ఎస్‌సి మాదిగ
ఒంగోలు – చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి – ఓసీ రెడ్డి
నెల్లూరు – వేణుంబాక విజయసాయిరెడ్డి – ఓసీ రెడ్డి
తిరుపతి – మద్దిల గురుమూర్తి – ఎస్సీ మాల
చిత్తూరు – ఎన్ రెడ్డప్ప ఎస్సీ – మాల
రాజంపేట – పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డి – ఓసీ రెడ్డి
కడప – వైఎస్ అవినాష్‌రెడ్డి – ఓసీ రెడ్డి
కర్నూలు – బివై రామయ్య – బిసి బోయ
నంద్యాల – పోచ బ్రహ్మానందరెడ్డి – ఓసీ రెడ్డి
హిందూపుర్ – జోలదరసి శాంత – బిసి బోయ
అనంతపురం – మాలగుండ్ల శంకర నారాయణ – బిసి కురుబ
అసెంబ్లీ అభ్యర్థుల తుది జాబితా..
శ్రీకాకుళం – ధర్మాన ప్రసాదరావు
ఆమదాల వలస – తమ్మినేని సీతారాం
నరసన్న పేట – ధర్మాన క్రిష్ణదాస్
పాతపట్నం -రెడ్డి శాంతి
టెక్కలి – దువ్వాడ శ్రీనివాస్
ఇచ్ఛాపురం – పిరియా విజయ
పలాస – సీదిరి అప్పలరాజు
రాజాం – డాక్టర్ తలే రాజేశ్
విజయనగరం – కోలగట్ల వీరభద్రస్వామి
బొబ్బిలి- వెంకట చినప్పలనాయుడు
గజపతి నగరం- బొత్స అప్పల నర్సయ్య
చీపురుపల్లి- బొత్స సత్యనారాయణ
పార్వతీపురం – అలజంగి జోగారావు
కురుపాం – పాముల పుష్ప శ్రీవాణి
సాలూరు – పీడిక రాజన్నదొర
పాలకొండ – కళావతి
నెల్లిమర్ల- అప్పలనాయుడు
ఎచ్చెర్ల- కిరణ్‌కుమార్
గాజువాక – గుడివాడ అమర్‌నాథ్
విశాఖ దక్షిణ – వాసుపల్లి గణేశ్
విశాఖ ఉత్తర – కేకే రాజు
భీమిలి – ముత్తంశెట్టి శ్రీనివాసరావు
విశాఖ తూర్పు – ఎంవీవీ సత్యనారాయణ
విశాఖ పశ్చిమ – అడారి ఆనంద్
శృంగవరపుకోట – కడుబండి శ్రీనివాసరావు
పెందుర్తి – అన్నంరెడ్డి అదీప్‌రాజ్
పాయకరావుపేట – కంబాల జోగులు
చోడవరం – కరణం ధర్మశ్రీ
నర్సీపట్నం – పెట్ల ఉమాశంకర్ గణేశ్
అనకాపల్లి – మలసాల భరత్‌కుమార్
మాడుగుల – బూడి ముత్యాల నాయుడు
ఎలమంచిలి – ఉప్పలపాటి వెంకట రమణమూర్తి రాజు
అరకు – మత్స్యలింగం
పాడేరు – మత్స్యరాజు విశ్వేశ్వరరాజు
రంపచోడవరం – నాగులపల్లి ధనలక్ష్మి
నిడదవోలు – గెడ్డం శ్రీనివాస నాయుడు
రాజమండ్రి సిటీ – మార్గాని భరత్
రాజమండ్రి రూరల్ – చెల్లుబోయిన వేణుగోపాల్ క్రిష్ణ