ఏటీఎం మిషన్‌లో డెబిట్ కార్డు పెడితే డబ్బులు వస్తాయి. ఒకవేళ కార్డు లేకపోతే ఏం చేయాలి..! సాధారణంగా ఎవరినైనా అడిగి అప్పు తీసుకుంటాం.. లేదంటూ ఊరుకుంటాం.. కానీ మద్యం మత్తులో ఉన్న ఓ యువకుడు డిఫరెంట్‌గా ఆలోచించాడు. అర్జంట్‌గా డబ్బు అవసరమొచ్చింది. ఏం చేయాలబ్బా.! అంటూ ఏటీఎంలో చోరీకి బరితెగించాడు. అయితే ఏటీఎం పగలకొట్టినప్పుడు.. అక్కడే సీసీ కెమెరా ఉందన్న సంగతి మరిచిపోయాడు. ఆ సీసీ కెమెరా పుటేజ్‌ను బ్యాంకు సిబ్బంది గమనిస్తున్నారన్న సంగతి కూడా అతడికి తెలియలేదు.
ఇది చదవండి: అజీర్తి, కడుపు ఉబ్బరంతో ఆస్పత్రికొచ్చిన వ్యక్తి.. అమ్మబాబోయ్! ఎక్స్‌రే చూడగా
ఏటీఎంలో దర్జాగా కూర్చుని మిషన్‌ను బద్దలు కొట్టి లాకర్‌లోని డబ్బులను తీసుకునేందుకు ప్రయత్నిస్తున్న యువకుడ్ని గమనించిన బ్యాంకు సిబ్బంది.. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వెంటనే ఏటీఎం సెంటర్‌కు చేరుకుని డబ్బులు ఎత్తు కెళ్లేందుకు ప్రయత్నిస్తున్న యువకుడ్ని అదుపులోకి తీసుకున్నారు.
ఇది చదవండి: ఓర్నీ.! దోచేయ్ మూవీ చిన్నది దుమ్మురేపిందిగా.. పోజులు చూస్తే మెంటలెక్కాల్సిందే
ప్రకాశం జిల్లా గిద్దలూరులో ఓ యువకుడు ఏకంగా ఏటీఎం మిషన్‌కే ఎసరు పెట్టాడు. మద్యం మత్తులో ఏటీఎం కేంద్రంలోకి ప్రవేశించి మిషన్‌లో ఉన్న డబ్బును దొంగిలించేందుకు విశ్వ ప్రయత్నం చేశాడు. మిషన్ ముందు భాగాన్ని పక్కకు తొలగించి మిషన్ లాకర్ ఓపెన్ చేసేందుకు ప్రయత్నిస్తుండగా సీసీ కెమెరా ద్వారా బ్యాంక్ అధికారులు గుర్తించారు. వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు అక్కడికి చేరుకుని దొంగను అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు ఏటీఎం మిషన్‌లో నగదు దోచుకునేందుకు ప్రయత్నిస్తున్న దృశ్యాలు ఏటీఎం కేంద్రంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. నిందితుడ్ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నామని గిద్దలూరు అర్బన్ సీఐ సురేష్ తెలిపారు. నిందితుడు కొమరోలు మండలానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. వ్రతం చెడినా ఫలితం దక్కలేదంటే ఇదేనేమో.
ఇది చదవండి: పురాతన తవ్వకాల్లో బయటపడ్డ నల్లటి ఆకారం.. ఏంటని చూడగా.. అమ్మబాబోయ్.!
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..