Andhra Pradesh: మరో యువతితో ప్రియుడి పెళ్లి.. ఇంతలో పెట్రోల్‌ బాటిల్‌తో వచ్చిన ప్రియురాలు.. కట్ చేస్తే..

|

Dec 03, 2022 | 7:59 PM

ఆంధ్రప్రదేశ్‌లోని గాజువాక, షీలా నగర్‌లోని ఓ కళ్యాణ్ మండపంలో హైడ్రామా చోటు చేసుకుంది. తనను కాదని వేరే యువతిని పెళ్లి చేసుకుంటున్నాడని ప్రియుడి పెళ్లిని..

Andhra Pradesh: మరో యువతితో ప్రియుడి పెళ్లి.. ఇంతలో పెట్రోల్‌ బాటిల్‌తో వచ్చిన ప్రియురాలు.. కట్ చేస్తే..
Marriage
Follow us on

ఆంధ్రప్రదేశ్‌లోని గాజువాక, షీలా నగర్‌లోని ఓ కళ్యాణ్ మండపంలో హైడ్రామా చోటు చేసుకుంది. తనను కాదని వేరే యువతిని పెళ్లి చేసుకుంటున్నాడని ప్రియుడి పెళ్లిని ఆపే ప్రయత్నం చేసింది ఓ యువతి. పెట్రోల్ బాటిల్ చేత పట్టుకుని పెళ్లి వేదిక వద్దకు వచ్చింది. అయితే, అప్పటికే వీరి వ్యవహారంపై కోర్టులో కేసు నడుస్తుండగా.. తామేమీ చేయలేమంటూ పోలీసులు యువతికి తేల్చి చెప్పారు. దాంతో చేసేదేం లేక బోరుమంటూ విలపిస్తూ అక్కడి నుంచి వెళ్లిపోయింది యువతి.

ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. గాజువాక ప్రాంతానికి చెందిన యువతి, భగత్ ప్రేమించుకున్నారు. ఏవో గొడవల కారణంగా.. 6 నెలల క్రితమే భగత్‌పై దిశ స్టేషన్‌లో యువతి ఫిర్యాదు చేసింది. అప్పట్లో అతనిపై కేసు నమోదు చేసిన పోలీసులు భగత్‌ను రిమాండ్‌కు పంపించారు. మూడు నెలల తరువాత జైలు నుంచి భగత్ విడుదలయ్యాడు. అనంతరం మరో అమ్మాయితో వివాహం నిశ్చయం చేసుకున్నాడు. ఇవాళ ఆ అమ్మాయితో భగత్‌కు మ్యారేజ్ జరిగింది.

అయితే, విషయం తెలుసుకున్న ప్రియురాలు.. పెళ్లి జరుగుతున్న ఫంక్షన్ హాల్‌కు వచ్చింది. తన బంధువులతో కలిసి చేతిలో పెట్రోల్ బాటిల్ పట్టుకుని పెళ్లి వేదిక వద్దకు వచ్చింది. పెళ్లిని అడ్డుకునే ప్రయత్నం చేసింది. దాంతో అక్కడ తీవ్ర ఘర్షణ వాతావరణం నెలకొంది. విషయం తెలుసుకున్న పోలీసులు.. ఘర్షణ జరుగుతున్న పెళ్లి వేదిక వద్దకు వెళ్లారు. అయితే, వీరి కేసు కోర్టులో ఉండటంతో.. పెళ్లిని ఆపే హక్కు తమకు లేదని యువతికి తేల్చి చెప్పారు పోలీసులు. దాంతో నిస్సహాయ స్థితిలో రోధిస్తూ అక్కడి నుంచి వెళ్లిపోయింది ప్రియురాలు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..