వెంటాడి మరీ కబళించిన మృత్యువు.. మొదటి ప్రమాదంలో గాయాలు.. రెండో ప్రమాదంలో ప్రాణాలు

|

Feb 24, 2022 | 1:16 PM

మృత్యువు పగబట్టడం మీరెప్పుడైనా విన్నారా..? ఏంటీ.. మృత్యువు పగబడుతుందా అని అనుకుంటున్నారా..? అవునండీ.. కొన్ని ప్రమాదాలను చూస్తే సరిగ్గా ఇలాగే అనిపిస్తుంది...

వెంటాడి మరీ కబళించిన మృత్యువు.. మొదటి ప్రమాదంలో గాయాలు.. రెండో ప్రమాదంలో ప్రాణాలు
Medaram Accident
Follow us on

మృత్యువు పగబట్టడం మీరెప్పుడైనా విన్నారా..? ఏంటీ.. మృత్యువు పగబడుతుందా అని అనుకుంటున్నారా..? అవునండీ.. కొన్ని ప్రమాదాలను చూస్తే సరిగ్గా ఇలాగే అనిపిస్తుంది. తాజాగా ప్రకాశం జిల్లాలో జరిగిన ఓ ఘటన అందరినీ షాక్ కు గురి చేసింది. యువకుడిని మృత్యువు వెంటాడి మరీ కబళించింది. ట్రక్కు నడుపుతున్న ఆయనను తొలుత.. ఓ ఆర్టీసీ బస్సు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో అతనికి గాయాలయ్యాయి. చికిత్స పొంది రాత్రి సమయంలో ట్రక్కులోనే భోజనం చేస్తుండగా వేగంగ వచ్చిన టిప్పర్ ట్రక్కును ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఆ యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. మొదట జరిగిన ప్రమాదంలో గాయాలతో బయటపడగా.. రెండో సారి జరిగిన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడం స్థానికులను కలచివేసింది.

కర్నూలు జిల్లా సున్నిపెంటకు చెందిన ఉమర్‌.. మంగళవారం మధ్యాహ్నం శ్రీశైలం నుంచి ట్రక్కు నడుపుకుంటూ ప్రకాశం జిల్లా మార్కాపురం వస్తున్నాడు. పెద్దారవీడు సమీపంలోని అంకాలమ్మ గుడి మూలమలుపు వద్ద ట్రక్కును ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ట్రక్కు ముందు భాగం దెబ్బ తింది. ఉమర్‌కు స్వల్ప గాయాలయ్యాయి. అనంతరం స్థానిక ఆస్పత్రిలో ఉమర్ చికిత్స పొందాడు. ప్రమాదం జరిగిందని సమాచారం తెలిసుకున్న ట్రక్కు యజమాని మల్లికార్జున సున్నిపెంట నుంచి వచ్చారు. ఆయన, ఉమర్‌ కలిసి మంగళవారం అర్ధరాత్రి 12 గంటల సమయంలో ఘటనా స్థలంలోనే ట్రక్కులో భోజనం చేస్తున్నారు.

ఈ సమయంలో మార్కాపురం నుంచి దోర్నాల వైపు వెళ్తున్న టిప్పర్‌ వేగంగా వచ్చి ట్రక్కును ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఉమర్‌ అక్కడికక్కడే మృతి చెందాడు. మల్లికార్జునకు గాయాలయ్యాయి. సమాచారం తెలుసుకున్న పోలీసులు.. మృతదేహాన్ని మార్కాపురం జిల్లా ఆస్పత్రికి తరలించారు. మల్లికార్జున కూడా గతంలో ట్రక్కు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి కోలుకున్నాడు. మళ్లీ ఇంతలోనే ప్రమాదానికి గురయ్యాడు. ఈ ప్రమాద ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Also Read

Hyderabad: ఫ్యాన్సీ నెంబర్లకు యమ డిమాండ్​.. 9999 ఎంత పలికిందో తెలిస్తే మైండ్ బ్లాంక్

Chicks Oxygen: కోడిపిల్లలకు గుడ్డు లోపల ఆక్సిజన్‌ ఎలా అందుతుంది..? పుట్టే వరకు అందులో ఎలా జీవిస్తాయి..!

Smartwatch: ఆంబ్రేన్‌ నుంచి సరికొత్త స్మార్ట్‌వాచ్.. అదిరిపోయే 10 ఫీచర్స్‌ ఇవే.. చెక్ చేసుకోండి