Andhra Pradesh: పాటలే ప్రచార అస్త్రాలు.. పోటాపోటీగా సాంగ్స్‌ను రిలీజ్ చేస్తోన్న అధికార, విపక్ష పార్టీలు
ఏపీ రాజకీయాల్లో పాటల పంచాయితీ పొలిటికల్ హీట్ పుట్టిస్తుంది. ఎలాగైనా అధికారంలోకి రావడం కోసం తమ ముందున్న అన్ని అవకాశాలను అనుకూలంగా మార్చు కుంటున్నాయి టీడీపీ,వైసీపీ,జన సేన పార్టీలు. ఇటీవల ఏపీలో అన్ని వర్గాల ప్రజలకు దగ్గర అయ్యేందుకు ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి కార్యాచరణ సిద్ధం చేస్తున్నాయి.
ఏపీ రాజకీయాల్లో పాటల పంచాయితీ పొలిటికల్ హీట్ పుట్టిస్తుంది. ఎలాగైనా అధికారంలోకి రావడం కోసం తమ ముందున్న అన్ని అవకాశాలను అనుకూలంగా మార్చు కుంటున్నాయి టీడీపీ,వైసీపీ,జన సేన పార్టీలు. ఇటీవల ఏపీలో అన్ని వర్గాల ప్రజలకు దగ్గర అయ్యేందుకు ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి కార్యాచరణ సిద్ధం చేస్తున్నాయి. అందులో భాగంగానే పోటా పోటీగా పాటలను సిద్ధ చేసి తమ అఫిషియల్ పార్టీ అకౌంట్స్ లో రిలీజ్ చేస్తున్నాయి. ఇప్పటికే టీడీపీ, వైసీపీ, జన సేన పార్టీలు పాటలను సిద్ధం చేసి ఒక్కొక్కటి విడుదల చేస్తున్నాయి. మూడు పార్టీలు పోటా పోటీగా పాటలను విడుదల చేయడం వెనుక ప్రధాన కారణం తమకు దూరంగా ఉన్న వర్గాలను దగ్గర చేసుకోవడమే. ఇటీవల చిన్న ,పెద్దా అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ సోషల్ మీడియా యూజర్స్ గా ఉన్నారు. యూట్యూబ్, ఫేస్ బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్ లాంటి వాటిని ఎక్కువగా వినియోగిస్తున్నారు. దీనితో మూడు పార్టీల నేతలు వాటిని తమ ప్రచార అస్త్రంగా మార్చుకున్నాయి. యూట్యూబ్ షాట్స్, ఇన్‌స్టా రీల్స్ లో వైరల్ చేసేందుకు శ్రద్ద తీసుకున్నాయి. ప్రోఫెషనల్ మ్యూజిక్ డైరెక్టర్లు, లిరిసిస్ట్, యాక్టర్స్, సింగర్స్, ఎడిటర్స్, డీవోపీలతో పాటలు సిద్ధం చేసి ప్రజల్లోకి వెళ్ళేలా ప్రమోట్ చేస్తున్నాయి. వాటిలో ప్రత్యేకించి బాషా, యాసా, వేషం, సంస్కృతి, అభివృద్ధి, పరిపాలన, పార్టీ విధానాలు, సంక్షేమం పేరుతో మూడు పొలిటికల్ పార్టీలు ప్రచారంలో పాటలు విడుదల చేస్తూన్నాయి. అయితే ఏపీలో పొలిటికల్ పార్టీలు పాటలు సిద్ధం చేసి వాటిని తమకు అనుకూలంగా మార్చు కోవడం కొత్త అంశం కానప్పటికీ గత రెండు పర్యాయాయాలుగా ఎన్నికలు సమీపించే కొద్దీ పాటలు విడుదల చేస్తున్న ట్రెండ్ ఏపీ రాజకీయాల్లో పెరిగింది. గతంలో ఎన్నికల ప్రచారం కోసం ప్రజల్లోకి వెళ్ళేలా నేతల స్పీచ్‌లు, హామీలు సిద్ధం ప్రమోట్ చేస్తే ఈ మధ్య కాలంలో అందుకు బిన్నంగా స్పెషల్ సాంగ్స్ తో ప్రజల్లోకి వెళ్తున్నారు మూడు పార్టీల నేతలు.ఇ ప్పటికే టీడీపీ, జన సేన, వైసీపీ పార్టీలు పాటలు సిద్ధం చేసి మరీ తమ అఫిషియల్ పార్టీ అకౌంట్స్ లో విడుదల చేయగా ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.
రావాలి జగన్.. కావాలి జగన్ తో మొదలు..
అస్సలు పోటా పోటీగా పాటలు సిద్ధం చేయడం వెనుక ప్రధాన కారణం ఏపీలో ప్రజల్లో వచ్చిన మార్పును తమకు అనుకూలంగా మార్చుకోవడం కోసమని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఎపిలో ఈ కల్చర్ రావడం వెనుక భారీ స్ట్రాటజీ ఉందని అంటున్నారు . 2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు జగన్ మోహన్ రెడ్డి పాదయాత్ర ముగిసిన తరువాత (రావాలి జగన్ కావాలి జగన్) అంటూ వైసీపీ విడుదల చేసిన పాట అప్పట్లో పొలిటికల్ సర్కిల్స్ సంచనలనం సృష్టించింది. ఏపీ రాజకీయాల్లో ట్రెండ్ సెట్టర్ గా జగన్ మోహన్ రెడ్డిని నిలపడంలో రావాలి జగన్ కావాలి జగన్ సాంగ్ కూడా రాజకీయాలకు దూరంగా ఉన్న చాలా మందిని దగ్గర అయ్యేలా చేసింది. ఒక దశలో రాజకీయ ప్రత్యర్ధులు కూడా తమ ప్రచారంలో అలసిపోయి రావాలి జగన్ కావాలి జగన్ అనే పాటను హమ్ చేసేలా ఉందని ఆ సాంగ్ వింటుంటే నాకు కూడా గూస్ బమ్స్ వచ్చాయని ఒక ఇంటర్వ్యులో చెప్పుకొచ్చారు టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి జేసీ ప్రభాకర్ రెడ్డి. ఆదే స్థాయిలో జగన్ గెలుపు ఉండేలా ఇంపాక్ట్ క్రియేట్ చేసిన సాంగ్ ఇప్పటికీ ట్రెండ్ సెట్టర్ గా ఉంది. నాటి నుంచి నేటి వరకు 33మిలియన్ వ్యూస్ తో దూసుకుపోతుంది. జగన్ కోసం ప్రత్యేకంగా ఐ ప్యాక్ రావాలి జగన్ కావాలి జగన్ సాంగ్ సిద్ధ చేయగా నేటికీ కూడా ప్రతి సభలో వైఎస్ జగన్ సాంగ్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది.
సూపర్ సిక్స్ హమీలతో టీడీపీ పాటలు..
ఏపీలో సాంగ్స్ రిలీజ్ చేయడం ప్రత్యేకంగా శ్రద్ద తీసుకుంటున్నాయి మూడు పార్టీలు. గత ఎన్నికలకు కొద్ది నెలల ముందే రావాలి జగన్ కావాలి జగన్ తరహాలో మరో ప్రత్యేక సాంగ్ సిద్ధం చేసి విడుదల చేసింది వైసీపీ. జగన్ కనెక్ట్స్ పేరుతో తమ అఫిషియల్ అకౌంట్లో (జెండాలు జత కట్టడం మీ అజెండా. జనం గుండెల్లో గుడి కట్టడమే జగన్ అజెండా.) (కుర్చీలో కూర్చోవడం మీ అజెండా కుర్చీలో ప్రజలు కూర్చోబెట్టడం ప్రజల అజెండా) అంటూ సాంగ్ రిలీజ్ చేసింది వైసీపీ. ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అవడంతో పాటు 1మిలియన్ దిశగా దూసుకుపోతోంది. ఇక మరోవైపు టీడీపీ సైతం ప్రజల్లోకి వెళ్ళేలా ప్రత్యేకంగా సాంగ్స్ సిద్ధం చేస్తుంది. అందులో భాగంగానే తాము ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలు అమలు చేసేలా ఒక్కో హమిపై ఒక్కో పాటను రిలీజ్ చేస్తుంది టీడీపీ. మహా శక్తి పేరుతో మహిళల కోసం టీడీపీ అమలు చేస్తామని చెప్పిన హామీలకు సంబంధించిన పాటను రిలీజ్ చేసింది.తెలంగాణ ఫోక్ సింగర్స్ డాన్సర్లతో కలిపి ఎన్నియాలో ఎన్నీయాలో అంటూ సాంగ్ సిద్ధం చేసి విడుదల చేసింది టీడీపీ. తాము అధికారంలో వస్తె ఏ హామీలు అమలు చేస్తాము అనే అంశాలను ఇందులో ప్రస్తావించింది.
ప్రభుత్వ వైఫల్యాలను చూపిస్తూ..
ఇక జనసేనా సైతం టీడీపీ, వైసీపీలకు పోటీగా పాటను సిద్ధం చేసి తమ అఫిషియల్ అకౌంట్ లో విడుదల చేసింది జన సేన (పరశురాముడు వచ్చినాడురో చూడన్నా., ప్రజల కొరకు నిలిచినాడురో పవనన్న) అంటూ స్పెషల్ సాంగ్ రిలీజ్ చేసింది.ప్రభుత్వ వైఫల్యాలపై పవన్ కళ్యాణ్ చేసిన పోరాటం ప్రభుత్వం స్పందించిన తీరును ప్రస్తావిస్తూ సాంగ్స్ సిద్ధం చేస్తుంది జన సేన పార్టీ
మొత్తానికి ఎపిలో ఎన్నికల సంగతి ఏమో కానీ పాటల పంచాయితీ అప్పుడే మొదలైంది. ప్రత్యర్థులను టార్గెట్ చేసేలా ఎవరికి వారు తమకు అనుకూలంగా పాటలు విడుదల చేస్తున్నారు చూడాలి మరి ఈ పాటలు ఏ మేరకు ఫలితాన్ని ఆయా పార్టీలకు ఇస్తాయో.
మరిన్ని ఏపీ వార్తల కోసం