AP News: మామూలుగుండదు మరి.! గోదారోళ్ల మర్యాదకు బిత్తరపోయిన కొత్త అల్లుడు..

సంక్రాంతి అంటే కోనసీమ జిల్లాల్లో జరిగే సందడే వేరు. కొత్త ధాన్యాలతో, కోడిపందాలతో పల్లెలన్నీ సంతోషంగా సంబరాలు చేసుకుంటాయి. ఇక సంక్రాంతికి మరో స్పెషల్‌ కొత్త అల్లుళ్లు.. మరదళ్ల సందడి. కొత్తగా ఇంటికొచ్చిన బావగారిని మరదళ్లు ఆటపట్టించడం.. ఆ తర్వాత అతిథి సత్కారాలతో గౌరవించడం..

AP News: మామూలుగుండదు మరి.! గోదారోళ్ల మర్యాదకు బిత్తరపోయిన కొత్త అల్లుడు..
Ap News
Follow us
Eswar Chennupalli

| Edited By: Ravi Kiran

Updated on: Jan 16, 2024 | 12:30 PM

సంక్రాంతి అంటే కోనసీమ జిల్లాల్లో జరిగే సందడే వేరు. కొత్త ధాన్యాలతో, కోడిపందాలతో పల్లెలన్నీ సంతోషంగా సంబరాలు చేసుకుంటాయి. ఇక సంక్రాంతికి మరో స్పెషల్‌ కొత్త అల్లుళ్లు.. మరదళ్ల సందడి. కొత్తగా ఇంటికొచ్చిన బావగారిని మరదళ్లు ఆటపట్టించడం.. ఆ తర్వాత అతిథి సత్కారాలతో గౌరవించడం ఓ రేంజ్‌లో ఉంటుంది. అలా సంక్రాంతికి కొత్తగా తమ ఇంటికి వచ్చిన అల్లుడుగారికి ఈ సారి కొంగొత్తగా అత్తగారు దగ్గరుండి మరీ కొసరి కొసరి స్వీట్లు తినిపించారు.

అనకాపల్లి హోల్సేల్ రైస్ మర్చంట్ గూండా సాయి గోపాల్ రావు కుమార్తె రిషిత కు విశాఖపట్నం ఎస్ఎల్వీ జువెలరీస్ అధినేత దేవేంద్రనాథ్ తో గత డిసెంబర్‌లో వివాహం జరిగింది. నవ దంపతులను మొదటి పండగ సందర్భంగా అత్తింటి వారు ఆహ్వానించారు. కొత్త అల్లుడికి రాచ మర్యాదలు సహజమైనప్పటికీ.. తమ స్టైల్ లో రకరకాల పిండి వంటలు తయారు చేసి వడ్డించారు. కారు దగ్గరకు వెళ్లి బావమరిది స్వయంగా కారు డోరు తెరిచి బావగారికి స్వాగతం చెప్పగా.. అత్తమామలు,ఇతర బంధువులు పూలు చల్లి ఆహ్వానం పలికారు. ఇక కొత్తగా జీవితంలోకి అడుగుపెట్టిన సతీమణి మరోసారి వరమాలవేసి వెల్కమ్‌ చెప్పింది. ఇక్కడి వరకూ బాగానే ఉంది. ఇక అల్లుడుగారు ఇంట్లోకి వెళ్లగానే డైనింగ్‌ టేబుల్‌ దర్శనమిచ్చింది. దానినిండా ఆంధ్రప్రదేశ్‌లోని ఫేమస్‌ వంటకాలు అన్నీ దర్శనమిచ్చాయి.

చెగోడీల దగ్గర నుంచి అరిసెల వరకూ సేమ్యా, గులాబ్‌జామ్‌, జాంగ్రీ, జిలేబీ, మడతకాజా, మలైకాజాలు, రసగుల్లా, పూతరేకులు, సోంపాపిడి, గారెలు, బూరెలు, సున్నుండలు, తొక్కుడు లడ్డూలు.. జంతికలు, చెక్కలు.. అబ్బో.. ఏపీలోని మొత్తం పిండి వంటకాలన్నీ ఎరేంజ్‌ చేశారు. ఇక ద్రాక్షపండునుంచి పనసపండువరకూ ఫ్రూట్స్‌… వీటితోపాటు పడుంటాయని..డ్రై ఫ్రూట్స్‌ కూడా పెట్టారండోయ్‌.. ఇక శీతల పానీయాల దగ్గరకి వస్తే ఫ్రూటీ నుంచి కోకా కోలా వరకూ అన్ని రకాఅ కూల్‌ డ్రింక్స్‌తో కొత్త అల్లుడికి గోదారోళ్ల మర్యాదలేంటో రుచి చూపించారు.. భార్యతోపాటు అత్తగారు కూడా అల్లుడికి కొసరి కొసరి తినిపించడం కొసమెరుపు. అత్తింటివారి మర్యాదలతో పాపం కొత్త అల్లుడు ఉక్కిరిబిక్కిరైపోయాడు అనుకోండి. మొత్తానికి 300 రకాల పిండి వంటలతో ఆతిథ్యం ఇచ్చి కొత్త అల్లుడిని అదరగొట్టేశారు అత్తింటి వారు. మరోవైపు అత్తింటివారి ఆప్యాయత, అనురాగాలకు అల్లుడు కూడా ఫిదా అయిపోయాడు.

వీడియో 1:

వీడియో 2:

వీడియో 3:

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!