AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చంద్రబాబు క్వాష్‌ పిటిషన్‌పై సుప్రీం సంచలన తీర్పు..

చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై సుప్రీం కోర్టు తీర్పును వెలువరించింది. త్రిసభ్య ధర్మాసనంలోని న్యాయమూర్తులైన అనిరుద్ బోస్, బేలా. ఏం త్రివేది మధ్య 17ఏపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. వీరిరువురూ చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై విడివిడిగా తీర్పును వెల్లడించారు. గతంలో జరిగిన నేరాలకు 17ఏ వర్తించదని.. చట్టం వచ్చిన తర్వాతనే 17ఏ వర్తిస్తుందని జస్టిస్ బేలా. ఏం త్రివేది పేర్కొనగా.. చంద్రబాబుకు 17ఏ వర్తిస్తుందని జస్టిస్ త్రివేది పేర్కొన్నారు.

చంద్రబాబు క్వాష్‌ పిటిషన్‌పై సుప్రీం సంచలన తీర్పు..
Chandrababu Naidu
Ravi Kiran
|

Updated on: Jan 16, 2024 | 2:02 PM

Share

స్కిల్ కేసు అంశంపై చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం భిన్నమైన తీర్పులను వెలువరించింది. సెక్షన్ 17ఏ చంద్రబాబుకు వర్తిస్తుందని జస్టిస్ట్ అనిరుద్ధ బోస్ అభిప్రాయపడగా.. ఇది చంద్రబాబుకు వర్తించదని జస్టిస్ బేలా త్రివేది పేర్కొన్నారు. ఇద్దరు న్యాయమూర్తులు భిన్న తీర్పులు వెలువరించడంతో.. ఈ కేసు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ముందుకు వెళ్లనుంది.

ఈ కేసు విషయంలో సెక్షన్ 17 ఏ వర్తిస్తుందని జస్టిస్ అనిరుద్ధ బోస్ అన్నారు. దీనిపై ముందుగా అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని అన్నారు. ముందస్తు అనుమతి లేనప్పుడు తీసుకున్న చర్యలు చట్ట విరుద్ధమని అన్నారు. ఈ పరిస్థితుల్లో చంద్రబాబును అవినీతి నిరోధక చట్టంలోని పలు సెక్షన్ల కింద విచారణ చేయడం తగదన్నారు. అయితే రిమాండ్ ఆర్డర్‌ను క్వాష్ చేయడం కుదరదని తెలిపారు. ముందస్తు అనుమతి లేనంత మాత్రాన రిమాండ్ చెల్లుబాటు కాదు అని అనలేమని చెప్పారు. ఈ పరిస్థితుల్లో పిటిషన్‌ను డిస్పోస్ చేస్తున్నట్టు జస్టిస్ అనిరుద్ధ బోస్ అన్నారు.

మరో న్యాయమూర్తి జస్టిస్ బేలా త్రివేది అభిప్రాయాలు చంద్రబాబుకు అనుకూలంగా ఉన్నాయి. చట్టం అమల్లో లేని కాలంలో జరిగిన నేరానికి దాన్ని వర్తింపజేయలేమని ఆమె పేర్కొన్నారు. 2018లో వచ్చిన చట్ట సవరణలో సెక్షన్ 17ఏ ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుందన్న అంశాన్ని ప్రస్తావించలేదన్నారు. ఈ పరిస్థితుల్లో చట్టం రాక ముందు కాలానికి దాన్ని వర్తింపజేయలేమని అన్నారు. ఈ కేసులో సెక్షన్ 17ఏ తీసేసి, కొత్త నేరాలకు మాత్రమే దాన్ని వర్తింపచేయాలని అన్నారు. 2018లో చట్ట సవరణ కంటే ముందు జరిగిన నేరాలకు ముందు ఉన్న సెక్షన్ల ప్రకారమే కేసు విచారణ జరపాలని అభిప్రాయపడ్డారు. చట్టం రాకముందు కాలానికి దీన్ని వర్తింపజేస్తే అనేక సరికొత్త వివాదాలకు తెరలేపినట్టు అవుతుందని పేర్కొన్నారు. ఈ సెక్షన్ అమల్లోకి రాకముందు కాలానికి వర్తింపజేస్తే అనేక పెండింగ్ కేసులు, విచారణలు ప్రభావితమవుతాయని అన్నారు.