VSR on Visakha Leaders: కబ్జాలు అడ్డుకున్నా.. కానీ సొంత పార్టీ నేతలే కుట్ర చేసి పంపించారుః విజయసాయిరెడ్డి

విశాఖలో పోటీచేయాలని సేవా కార్యక్రమాలు చేశాను.. కబ్జాలు అడ్డుకున్నా.. కానీ కొందరు సొంతపార్టీ నేతలే కుట్ర చేసి అక్కడి నుంచి వెళ్లేలా చేశారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు విజయసామిరెడ్డి. టీవీ9 మేనేజింగ్‌ ఎడిటర్‌ రజినీకాంత్‌తో జరిగిన క్రాస్‌ఫైర్‌ ఇంటర్వ్యూలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి పాల్గొన్నారు.

VSR on Visakha Leaders: కబ్జాలు అడ్డుకున్నా.. కానీ సొంత పార్టీ నేతలే కుట్ర చేసి పంపించారుః విజయసాయిరెడ్డి
Vijaya Sai Reddy

Updated on: Apr 11, 2024 | 7:59 PM

ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు ఏకకాలంలో జరుగుతున్నాయి. రెండోసారి అధికారమే లక్ష్యంగా వైసీపీ, ఈసారి ఎలాగైనా అధికారం దక్కించుకోవాలని తెలుగుదేశం పార్టీ ఉవ్విళ్ళురుతున్నాయి. గెలుపే లక్ష్యంగా వైసీపీ, టీడీపీ -జనసేన-బీజేపీ కూటమి కొత్త వ్యూహాలు అమలు చేస్తున్నాయి. ఇప్పటికే అన్ని పార్టీలు అభ్యర్దుల జాబితాను ప్రకటించి ప్రచారంలో దూసుకుపోతున్నాయి. అదే సమయంలోనే వైసీపీ రాజ్యసభ ఎంపీగా ఉన్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి టీడీపీలో చేరిపోయి, నెల్లూరు నుంచి బరిలోకి దిగుతున్నారు. దీంతో, సీఎం వైఎస్ జగన్ ఆయన పైన పోటీ కోసం కీలక నిర్ణయం తీసుకున్నారు. రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డిని నెల్లూరు నుంచి పోటీకి నిలపారు. దీంతో

ఇప్పటి వరకు ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయని విజయ సాయిరెడ్డిని నెల్లూరు ఎంపీగా బరిలో దిగుతున్నారు. మొదటి నుంచి విజయసాయి రెడ్డి నెల్లూరు జిల్లా సమన్వకర్తగా గా ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో నెల్లూరు స్థానం చేజిక్కించుకోవాలన్న లక్ష్యంగా విజయసాయిరెడ్డి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు అధినేత వైఎస్ జగన్. అయితే మొదటి నుంచి విశాఖపట్నంపై పట్టు సారించేందుకు రెండేళ్ల క్రితం నుంచి తన కార్యకలాపాలను విశాఖకు విస్తరించారు. అక్కడే తన క్యాంప్ కార్యాలయం ఏర్పాటు చేసుకుని పార్టీ పనులతో నిమగ్నమయ్యారు. గతంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ సైతం విజయసాయిరెడ్డికే ఉత్తరాంధ్ర జిల్లాలకు సంబంధించిన పార్టీ బాధ్యతలు అప్పగించారు. ప్రధానంగా విశాఖ జిల్లా పర్యవేక్షణ పూర్తిగా విజయసాయిరెడ్డి చేతుల్లోనే పెట్టారు. తాజాగా మారిన రాజకీయ సమీకరణాలతో విజయసాయిరెడ్డి నెల్లూరు నుంచి పోటీకి దింపింది వైసీపీ అధిష్టానం. ఈ క్రమంలోనే టీవీ9 మేనేజింగ్‌ ఎడిటర్‌ రజినీకాంత్‌తో జరిగిన క్రాస్‌ఫైర్‌ ఇంటర్వ్యూలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా విశాఖ వీడటానికి సంబంధించి పలు కీలక విషయాలను వెల్లడించారు. ఈ ఇంటర్వ్యూలో ఆయన అనేక సంచలన అంశాలను సూటిగా సుత్తిలేకుండా సమాధానం ఇచ్చారు. విశాఖలో పోటీచేయాలని సేవా కార్యక్రమాలు చేశాను.. కబ్జాలు అడ్డుకున్నా.. కానీ కొందరు సొంతపార్టీ నేతలే కుట్ర చేసి అక్కడి నుంచి వెళ్లేలా చేశారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు విజయసామిరెడ్డి.

పూర్తి ఇంటర్వ్యూ చూడండి…