తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలోని నందంగనిరాజు జంక్షన్‌లో ఉద్రిక్తత చోటుచేసుకుంది. జనసేన నాయకుడు వై.శ్రీను పుట్టినరోజు వేడుకల సందర్భంగా.. పెద్ద ఘర్షణ వాతావరణమే చెలరేగింది. ఓ వైపు న్యూఇయర్ వేడుకలు.. మరోవైపు తమ పార్టీ నేత పుట్టినరోజు ఉండటంతో.. జనసేన కార్యకర్తలు ఫుల్ సెలబ్రేషన్స్‌లో ఉన్నారు. ఈ వేడుకలకు మహాసేన రాజేష్ కూడా హాజరయ్యారు. అయితే ఈ విషయాన్ని ముందుగానే తెలుసుకున్న వైసీపీ కార్యకర్తలు అక్కడకు పెద్ద ఎత్తున చేరుకున్నారు. అతని కారుపై దాడి చేశారు. అద్దాలు ధ్వంసం చేశారు.
ఇంతలో జనసేన కార్యకర్తలు పెద్ద ఎత్తున గుమిగూడటంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఇరు వర్గాలకు సర్దిచెప్పేందుకు పోలీసులు తీవ్ర ప్రయత్నం చేశారు. రాజేష్‌ను అక్కడ నుంచి పంపించేశారు. దీంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. అయితే తమ పార్టీ నేతకు సంబంధించిన కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన రాజేష్‌పై దాడి చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు జనసేన నేతలు.
అయితే తమ పార్టీతో పాటు నాయకులపై సోషల్ మీడియాలో ఇష్టారీతిన వీడియోలు చేస్తుండటంతోనే దాడి చేశామని అంటున్నారు వైసీపీ కార్యకర్తలు. ఇప్పటికైనా అలాంటి వ్యాఖ్యలు చేయడం మానుకోవాలని హెచ్చరిస్తున్నారు.
మరిన్ని ఏపీ వార్తల కోసం..