AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

YCP Kapu Leaders: జనసేనానికి వైసీపీ కాపు నేతలు స్ట్రాంగ్ కౌంటర్.. త్వరలో మరోసారి విజయవాడలో సమావేశం..

ఆంధ్రప్రదేశ్ లో కాపుల చుట్టూ మళ్లీ రాజకీయం మొదలైన నేపథ్యంలో రాజమండ్రిలో వైసీపీకి చెందిన ఆ సామాజికవర్గ కీలక ప్రజాప్రతినిధుల భేటీ ఆసక్తిగా మారింది. వైసీపీలోని కాపు నేతలపై జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించింది సమావేశం.

YCP Kapu Leaders: జనసేనానికి వైసీపీ కాపు నేతలు స్ట్రాంగ్ కౌంటర్.. త్వరలో మరోసారి విజయవాడలో సమావేశం..
YCP Kapu Leaders vs janasena
Surya Kala
|

Updated on: Nov 01, 2022 | 11:15 AM

Share

2019కి ముందు, ఆ తర్వాత కాపుల పరిస్థితిని, వారికి అందిన పథకాలను జనంలోకి తీసుకెళ్లాలని నిర్ణయించింది వైసీపీ. అందుకోసం కాపు నేతలందరితో విస్తృత స్థాయి సమావేశాన్ని విజయవాడలో నిర్వహించబోతోంది. రాజమండ్రిలో భేటీ అయిన కాపు మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు సుదీర్ఘంగా చర్చించారు. పవన్‌ కల్యాణ్‌ వ్యాఖ్యలకు స్ట్రాంగ్‌ కౌంటర్‌ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ లో కాపుల చుట్టూ మళ్లీ రాజకీయం మొదలైన నేపథ్యంలో రాజమండ్రిలో వైసీపీకి చెందిన ఆ సామాజికవర్గ కీలక ప్రజాప్రతినిధుల భేటీ ఆసక్తిగా మారింది. వైసీపీలోని కాపు నేతలపై జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించింది సమావేశం.

టీడీపీ హయాంలో, ఇప్పుడు కాపుల పరిస్థితి, వారికి అందిన, అందుతున్న పథకాలపై చర్చించారు నేతలు. 2014 నుంచి 2019 వరకు రెండు లక్షల 54 వేల మంది కాపులకు 1824 కోట్ల సాయం అందితే, ఈ మూడున్నరేళ్లలో 70 లక్షల 83 వేల మందికి 26 వేల 490 కోట్ల లబ్ది చేకూరిందని వివరించారు డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ.

మరోవైపు ఇటీవల వైసీపీలోని కాపు నేతలపై, రంగా హత్యపై పవన్‌ కల్యాణ్‌ చేసిన వ్యాఖ్యలు, చంద్రబాబును కలవడంపైనా సమావేశంలో చర్చించారు. చంద్రబాబు కోసమే జనసేన అధ్యక్షుడు పని చేస్తున్నారని విమర్శించారు మంత్రులు. జనసేన సెలబ్రిటీ పార్టీ అని, చంద్రబాబు కోసం పని చేయకపోతే పవన్‌ కల్యాణ్‌ 175 సీట్లలో సింగిల్‌గా పోటీ చేయగలరా అని ప్రశ్నించారు బొత్స. పవన్‌ కల్యాణ్‌ ప్యాకేజ్‌ కోసమే పని చేస్తున్నారని తాము ముందు నుంచి చెబుతున్నదే నిజమైందన్నారు మంత్రి అంబటి రాంబాబు.

ఈ విమర్శలకు కౌంటర్‌ ఇచ్చింది జనసేన. వైసీపీ నుంచి కాపుల్లో ఎవరినైనా సీఎం అభ్యర్థిగా ప్రకటించే దమ్ము ఉందా అని ఆ పార్టీని ప్రశ్నించారు జనసేన నేత కందుల దుర్గేష్‌. మరోవైపు కాపుల అంశంపై చర్చించేందుకు త్వరలోనే విజయవాడలో భేటీ కావాలని నిర్ణయించారు వైసీపీ నేతలు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

కిలో లక్షల్లోనే.. భారత్‌లోనే అత్యంత ఖరీదైన కూరగాయ.. ఎలా..
కిలో లక్షల్లోనే.. భారత్‌లోనే అత్యంత ఖరీదైన కూరగాయ.. ఎలా..
ఏపీ టెట్‌ 2025 ఆన్సర్‌ కీ విడుదల.. ఫలితాలు ఎప్పుడంటే?
ఏపీ టెట్‌ 2025 ఆన్సర్‌ కీ విడుదల.. ఫలితాలు ఎప్పుడంటే?
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఉత్తర్వులు జారీ!
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఉత్తర్వులు జారీ!
ఆ ప్రొడ్యూసర్ రూమ్ కు పిలిచి.. బాంబ్ పేల్చిన బిగ్ బాస్ బ్యూటీ
ఆ ప్రొడ్యూసర్ రూమ్ కు పిలిచి.. బాంబ్ పేల్చిన బిగ్ బాస్ బ్యూటీ
నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. జనవరిలో జాబ్ క్యాలెండర్ 2026 విడుదల
నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. జనవరిలో జాబ్ క్యాలెండర్ 2026 విడుదల
ఏపీ vs తెలంగాణ: మళ్లీ మొదలైన నీళ్ల లొల్లి.. తగ్గేదే లేదంటున్న..
ఏపీ vs తెలంగాణ: మళ్లీ మొదలైన నీళ్ల లొల్లి.. తగ్గేదే లేదంటున్న..
తనూజ కంటే బెటర్.. అసలైన అర్హులు వేరే ఉన్నారు..
తనూజ కంటే బెటర్.. అసలైన అర్హులు వేరే ఉన్నారు..
ఈ చెట్ల పెంపకంతో కోట్లల్లో లాభం..సాగు విధానం గురించి మీకు తెలుసా?
ఈ చెట్ల పెంపకంతో కోట్లల్లో లాభం..సాగు విధానం గురించి మీకు తెలుసా?
ఒక కిలోమీటరు నడవడానికి ఎన్ని అడుగులు వేయాలి..? 99శాతం మందికి..
ఒక కిలోమీటరు నడవడానికి ఎన్ని అడుగులు వేయాలి..? 99శాతం మందికి..
ఇంటర్‌ పబ్లిక్ పరీక్షల టైం టేబుల్ 2026 మారిందోచ్.. కొత్త షెడ్యూల్
ఇంటర్‌ పబ్లిక్ పరీక్షల టైం టేబుల్ 2026 మారిందోచ్.. కొత్త షెడ్యూల్