Andhra Pradesh: ఎమ్మెల్యే శ్రీదేవికి షాక్ ఇచ్చిన సొంత పార్టీ కార్యకర్తలు.. ఇంతకీ మ్యాటర్ ఏంటంటే..

Andhra Pradesh: గుంటూరు జిల్లా తుళ్ళూరు మండలంలో ఉద్రిక్తత నెలకొంది. వైసీపీ గడపగడపకూ కార్యక్రమంలో ఎమ్మెల్యే శ్రీదేవికి షాకిచ్చారు

Andhra Pradesh: ఎమ్మెల్యే శ్రీదేవికి షాక్ ఇచ్చిన సొంత పార్టీ కార్యకర్తలు.. ఇంతకీ మ్యాటర్ ఏంటంటే..
Mla Sridevi

Edited By:

Updated on: Jul 16, 2022 | 1:35 PM

Andhra Pradesh: గుంటూరు జిల్లా తుళ్ళూరు మండలంలో ఉద్రిక్తత నెలకొంది. వైసీపీ గడపగడపకూ కార్యక్రమంలో ఎమ్మెల్యే శ్రీదేవికి షాకిచ్చారు గ్రామస్తులు. దొండపాడులో గడప గడపకు కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్యెల్యే ఉండవల్లి శ్రీదేవిని అడ్డుకున్నారు గ్రామస్తులు. బీఆర్‌ అంబేద్కర్‌, వైఎస్సార్‌ విగ్రహాలకు పూల మాలలు వేయకుండా అడ్డుకున్నారు. సొంతపార్టీ నేతల నుంచే నిరసన ఎదురవడంతో కాసేపు గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది.

వైసీపీ కార్యకర్తలతోపాటు.. అమరావతి రైతులు కూడా ఆమెను అడ్డుకున్నారు. ఎమ్మెల్యే గో బ్యాక్ ఎమ్మెల్యే అంటూ నినాదాలు చేశారు. పోలీసుల రక్షణతో వైస్సార్, అంబేద్కర్ విగ్రహాలకి పూలమాలలు వేసి అక్కడి నుంచి వెళ్లిపోయారు. అయితే సొంతపార్టీ కార్యకర్తలు మాత్రం నిరసన విరమించలేదు.. వైఎస్సార్ విగ్రహానికి వేసిన పూల మాలని తొలగించారు కార్యకర్తలు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

ఇవి కూడా చదవండి