Krishna District: మ‌హిళా ఎస్సై దురుసు ప్ర‌వ‌ర్త‌న‌.. పాల కోసం బ‌య‌ట‌కు వ‌చ్చిన యువ‌కుడిపై దాడి!

|

Jun 16, 2021 | 2:00 PM

లాక్‌డౌన్‌ సమయంలో ఇళ్ల నుంచి బయటకు రావడం ముమ్మాటికీ తప్పు. ఇక నిబంధ‌న‌లు అతిక్ర‌మించేవారిని  ఒకటికి రెండు సార్లు హెచ్చరించి, పనీష్‌మెంట్లు ఇచ్చినా....

Krishna District: మ‌హిళా ఎస్సై దురుసు ప్ర‌వ‌ర్త‌న‌..  పాల కోసం బ‌య‌ట‌కు వ‌చ్చిన యువ‌కుడిపై దాడి!
Women Si Misbehaviour
Follow us on

లాక్‌డౌన్‌ సమయంలో ఇళ్ల నుంచి బయటకు రావడం ముమ్మాటికీ తప్పు. ఇక నిబంధ‌న‌లు అతిక్ర‌మించేవారిని  ఒకటికి రెండు సార్లు హెచ్చరించి, పనీష్‌మెంట్లు ఇచ్చినా తప్పులేదు. ఈ కర్ఫ్యూ సమయంలో ఇళ్ల నుంచి బయటకు వచ్చిన కారణం నిజంగా జన్యూన్ అయితే  పోలీసులు మానవ‌త్వంతో వ్య‌వ‌హ‌రించాల్సి ఉంటుంది. కానీ, తాజాగా ఓ మహిళా ఎస్సై మాత్రం నానా హంగామా చేసింది.  పాల కోసమని, బయటకు వచ్చిన ఓ యువ‌కుడిపై చేయిచేసుకుంది . కృష్ణాజిల్లా ఇబ్రహీంపట్నంలో సాయంత్రం 7 గంట‌ల స‌మ‌యంలో పాల కోసమని వెళ్తున్న ప్రవీణ్‌ అనే యువకుడిని అడ్డుకుంది మహిళా ఎస్సై. ఎక్కడి వెళ్తున్నావ్‌ అని యువకుడి ప్రశ్నించింది. పాల కోసం వెళ్తున్నాను అని సమాధానం చెప్పినా, హెల్మెట్ లేదంటూ అతడికి ఫైన్‌ వేసింది ఎస్సై. ఇక చేసేదేమి లేక, ప్రవీణ్‌ ఆ ఫైన్‌ మొత్తాన్ని కట్టి, రషీదు తీసుకుని అక్కడ నుంచి వెళ్లాడు. కాసేపటికే పాలు తీసుకోని, అదే రూట్లో ఇంటికి వెళ్తున్న ప్రవీణ్‌ను మళ్లీ అడ్డుకుని చితకబాదింది ఎస్సై. ఎందుకు కొడుతున్నారని ప్ర‌శ్నించ‌డంతో.. త‌న‌ను అస‌భ్య ప‌ద‌జాలంతో బండ బూతులు తిట్టార‌ని స‌ద‌రు యువ‌కుడు ఆరోపిస్తున్నాడు. ఇక ఇందుకు సంబంధించిన వీడియో, ఇప్పుడు సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతుంది. మహిళా ఎస్సై ప్ర‌వ‌ర్త‌న‌పై పలువురు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.

Also Read:  మ‌రో టెన్ష‌న్.. దేశంలో తొలిసారిగా గ్రీన్‌ ఫంగస్‌ కేసు నమోదు

వైయ‌స్ ష‌ర్మిల హుజూర్‌నగర్ ప‌ర్య‌ట‌న‌లో ఊహించ‌ని ట్విస్ట్.. నిరుద్యోగి ఆచూకీ మిస్సింగ్