Ananthapuram District: బిడ్డకు జలుబు మందు తెచ్చేందుకు బయటకు వెళ్లింది.. బ్రతుకే ముగిసిపోయింది

|

Jul 24, 2021 | 4:02 PM

విధి మనుషుల జీవితాలతో వింత ఆట ఆడుతుంది. తాజాగా  రెండేళ్ల చిన్నారికి జలుబు మెడిసిన్ తెచ్చేందుకు వెళ్లిన తల్లి ప్రమాదంలో ప్రాణాలు విడిచింది.

Ananthapuram District: బిడ్డకు జలుబు మందు తెచ్చేందుకు బయటకు వెళ్లింది.. బ్రతుకే ముగిసిపోయింది
Accident
Follow us on

విధి మనుషుల జీవితాలతో వింత ఆట ఆడుతుంది. తాజాగా  రెండేళ్ల చిన్నారికి జలుబు చేయడంతో మెడిసిన్ తెచ్చేందుకు వెళ్లిన తల్లి ప్రమాదంలో ప్రాణాలు విడవడం పలువురి మనసులను కదిలించింది. వివరాల్లోకి వెళ్తే..  అనంతపురం నగరానికి చెందిన యాస్మిన్‌(29), శ్రీనివాసనగర్‌కు చెందిన జగదీశ్‌ను లవ్ మ్యారేజ్ చేసుకుంది. ఈ దంపతులకు రెండేళ్ల పాప ఉంది. చిన్నారికి జలుబు చేయడంతో గురువారం అర్ధరాత్రి సమయంలో శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడింది. చిన్నారి ఒంట్లో బాలేకపోవడంతో ఆమె ఆందోళన చెందింది. వెంటనే భర్తను లేపి పాపకు మెడిసిన్ తీసుకురావాలని సూచించింది. ఉదయం హాస్పిటల్‌కు వెళ్దామని, ఏం కాదులే అంటూ భర్త చెప్పాడు. కొంత సేపటి తర్వాత చిన్నారిని చూసి తల్లి హృదయం తల్లడిల్లింది. శ్వాస తీసుకోవడం ఇబ్బందైతే పాప ప్రాణానికే ముప్పు కలుగుతుందేమో అని ఆందోళన చెందింది. అర్ధరాత్రి 2గంటల సమయంలో మెడిసిన్ చీటీ పట్టుకొని తన స్కూటీపై మెడికల్ షాపుకు బయల్దేరింది. చంద్ర ఆసుపత్రి సర్కిల్ దాటగానే వెనుక వైపు నుంచి అతివేగంగా వస్తున్న కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో యాస్మిన్‌ స్పాట్‌లోనే మృతిచెందింది.

విషయాన్ని గమనించిన రాత్రి విధుల్లో ఉన్న ఎస్సై జగదీశ్‌ ట్రాఫిక్‌ పోలీసులకు సమాచారం అందించారు. యాస్మిన్‌ డెడ్‌బాడీని గవర్నమెంట్ ఆసుపత్రికి తరలించారు. గస్తీ కానిస్టేబుల్‌ శివకుమార్‌ యాక్సిడెంట్‌కు కారణమైన కారును వెంబడించి పట్టుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. బిడ్డ ఏమైపోతుందోనన్న భయంతో అర్ధరాత్రి పరుగులు పెట్టిన ఆ మహిళను యాక్సిడెంట్ రూపంలో మృత్యువు వెంటాడటం అందర్నీ కలచివేస్తుంది. ఆ పాపాయికి ఇప్పుడు కన్నీరే మిగిలింది.

Also Read: ఇంట్లో ఒంటరిగా ఉన్న కొత్త పెళ్లి కూతురు.. పొలం పనులు పూర్తి చేసుకుని వచ్చిన అత్తమామల షాక్..!

 సరుకులు తీసేందుకు ప్రిజ్ డోర్ తీశారు.. బుసలు కొడుతూ దూసుకొచ్చిన నల్లత్రాచు