AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP Weather Report : రాగల మూడు రోజుల్లో ఏపీలో తేలికపాటి జల్లులు.. గంటకు 40 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు

AP Weather Report : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రధానంగా పశ్చిమ / వాయువ్య దిశల నుంచి గాలులు వీస్తున్నాయి. 28 జూలై 2021 న ఉత్తర బంగాళాఖాతం

AP Weather Report : రాగల మూడు రోజుల్లో ఏపీలో తేలికపాటి జల్లులు.. గంటకు 40 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు
Skymet Weather
uppula Raju
|

Updated on: Jul 24, 2021 | 4:03 PM

Share

AP Weather Report : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రధానంగా పశ్చిమ / వాయువ్య దిశల నుంచి గాలులు వీస్తున్నాయి. 28 జూలై 2021 న ఉత్తర బంగాళాఖాతం & పరిసరాల్లో ఒక అల్పపీడన ప్రాంతం ఏర్పడే అవకాశం ఉంది. దీని ఫలితంగా రాగల మూడు రోజులలో వాతావరణ పరిస్థితులు ఇలా ఉన్నాయి.

1. ఉత్తర కోస్తా ఆంధ్ర, యానాం : ఈ రోజు ఉత్తర కోస్తా ఆంధ్రాలో కొన్నిచోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉత్తర కోస్తా ఆంధ్ర తీరం వెంబడి గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గరిష్టంగా 60 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉంది. రేపు, ఎల్లుండి ఉత్తర కోస్తా, ఆంధ్రాలో ఉరుములు, మెరుపులతోపాటు తేలికపాటి వర్షాలు ఒకటి లేక రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉత్తర కోస్తా ఆంధ్ర తీరం వెంబడి గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గరిష్టంగా 60 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉంది.

2. దక్షిణ కోస్తా ఆంధ్ర : ఈ రోజు, రేపు, ఎల్లుండి దక్షిణ కోస్తా ఆంధ్రాలో తేలికపాటి వర్షాలు ఒకటి లేక రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. దక్షిణ కోస్తా ఆంధ్ర తీరం వెంబడి గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గరిష్టంగా 60 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉంది.

3. రాయలసీమ: ఈ రోజు రేపు, ఎల్లుండి రాయలసీమలో తేలికపాటి వర్షాలు ఒకటి లేక రెండు చోట్ల కురిసే అవకాశంఉందని అమరావతి వాతావరణ సంచాలకులు తెలిపారు.

Economic Liberalization: మన్మోహన్ ఆర్ధిక సరళీకరణకు మూడు దశాబ్దాలు.. అప్పటికీ ఇప్పటికీ వచ్చిన మార్పులేమిటి?

Kashi Vishwanath: కాశీ విశ్వనాథుడికి 1700 చదరపు గజాల స్థలం ఇచ్చిన ముస్లిం పెద్దలు.. భూ వివాదానికి తెర..

YS Viveka Murder Case: వైఎస్‌ వివేకా మర్డర్‌ కేసులో సంచలన విషయాలు.. వాచ్‌మెన్‌ రంగయ్య ఇంటికి భారీ భద్రత