Andhra: మహిళల కాళ్ళు పట్టుకున్నాడు.. ఇక తప్పుచేయనని ప్రాథేయపడ్డాడు.. ఇంతకీ ఏం జరిగిందంటే..

నకిలీ ఫేస్‌ బుక్‌ ఖాతాలతో మహిళలకు వలపు వల విసిరి అందులో చిక్కుకున్న యువతులు, మహిళలను బెదిరించి డబ్బులు గుంజుతున్న ఓ కేటుగాడి ఉదంతం వెలుగులోకి వచ్చింది. అలాగే యూట్యూబ్ ఛానెల్ ముసుగులో బెదిరింపులకు దిగుతూ మహిళలను భయభ్రాంతులకు గురిచేస్తున్న కేటుగాడి గుట్టురట్టయింది.

Andhra: మహిళల కాళ్ళు పట్టుకున్నాడు.. ఇక తప్పుచేయనని ప్రాథేయపడ్డాడు.. ఇంతకీ ఏం జరిగిందంటే..
Crime News

Edited By:

Updated on: Mar 05, 2026 | 2:41 PM

నకిలీ ఫేస్‌ బుక్‌ ఖాతాలతో మహిళలకు వలపు వల విసిరి అందులో చిక్కుకున్న యువతులు, మహిళలను బెదిరించి డబ్బులు గుంజుతున్న ఓ కేటుగాడి ఉదంతం వెలుగులోకి వచ్చింది. అలాగే యూట్యూబ్ ఛానెల్ ముసుగులో బెదిరింపులకు దిగుతూ మహిళలను భయభ్రాంతులకు గురిచేస్తున్న కేటుగాడి గుట్టురట్టయింది. సోషల్ మీడియాలో మహిళల ఫోటోలతో ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసి, అమాయకులకు వల వేస్తున్న ఓ ప్రబుద్ధుడిని ప్రకాశం జిల్లా ఏల్చూరు గ్రామస్తులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. మహిళలు చెప్పులతో బుద్ధి చెప్పగా.. అనంతరం మహిళల కాళ్లపై పడి ఇక తప్పు చేయనని లెంపలేసుకున్నాడు.

ప్రకాశం జిల్లా సంతమాగులూరు మండలం ఏల్చూరు గ్రామానికి చెందిన పాలేబోయిన బాలాంజనేయులు కొంతకాలంగా మహిళల ఫోటోలను దొంగచాటుగా తీస్తూ వికృతానందాన్ని పొందుతున్నాడు. కేవలం ఫోటోలు తీయడమే కాదు.. దొంగ పేర్లతో సిమ్ కార్డులు తీసుకుని, ఫేక్ ఫేస్‌బుక్, వాట్సాప్ ఖాతాలు సృష్టించాడు. ఈ ఖాతాల్లో మహిళల అందమైన చిత్రాలను ఉంచి, అమాయక పురుషులకు వల వేసి డబ్బులు గుంజుతున్నట్లు సమాచారం. అదేమని అడిగితే తన యూట్యూబ్ ఛానెల్ పవర్ చూపిస్తానంటూ పోలీస్, ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రకటనల పేరుతో కూడా దోపిడీకి పాల్పడుతున్నాడు.

వీడియో చూడండి..

అయితే, ఇతగాడి పాపం పండింది. ఏల్చూరు గ్రామస్తులు ఈ కేటుగాడి అసలు రంగును కనిపెట్టారు. నిందితుడిని నిలదీయగా.. తప్పు ఒప్పుకోక తప్పలేదు. బాధితులు విరుచుకుపడటంతో, బాలాంజనేయులు వారి కాళ్లపై పడి క్షమాపణలు కోరాడు. మహిళలు చెప్పులతో దేహశుద్ధి చేశారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు రంగ ప్రవేశం చేశారు. ఇలాంటి ఫేక్ ఖాతాల మాయలో పడి మోసపోవద్దని ఎస్ఐ వై. నాగరాజు ప్రజలకు సూచించారు. సోషల్ మీడియాలో పరిచయం లేని వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. మొత్తానికి యూట్యూబ్ రిపోర్టర్ ముసుగులో అక్రమాలకు పాల్పడుతున్న ఈ కేటుగాడి బాగోతం ఇప్పుడు సంచలనంగా మారింది.

Follow Us