Mother, Daughter killed: ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లాలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. ఓ మహిళ తన ఇద్దరు పిల్లలతో కలిసి నిప్పు పెట్టుకోని ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ సంఘటనలో మహిళతోపాటు కుమార్తె మరణించారు. ఈ సంఘటన ఆత్మకూరు మండలం నెల్లూరు పాలెం సెంటర్ వద్ద జరిగింది. వివరాలు.. నెల్లూరుకు చెందిన సుబ్బులు అనే మహిళ తన ఇద్దరు పిల్లలతో కలిసి తాను కూడా నిప్పు పెట్టుకొని ఆత్మహత్యకు ప్రయత్నించింది. ఈ సంఘటనలో తల్లి సుబ్బులు (27), కుమార్తె మధురవాణి (5) పూర్తిగా కాలిపోయి మృతిచెందారు. అయితే.. నిప్పు పెట్టుకోవడాన్ని చూసిన కుమారుడు మహేష్ అక్కడి నుంచి తప్పించుకొని పారిపోయాడు. అనంతరం అక్కడ ఉన్న స్థానికులకు ఈ విషయం చెప్పడంతో ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది.
కాగా ఆ మహిళ ఇద్దరు పిల్లలతో తెల్లవారుజామున 4 గంటలకు బళ్లారి నుంచి వచ్చిన బస్సులో నెల్లూరు పాలెం సెంటర్లో దిగినట్లు స్థానికులు తెలిపారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకోని పరిశీలించారు. ఈ సంఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కుమారుడు మహేష్ నుంచి వివరాలు సేకరిస్తున్నారు.
Also Read: