భర్తపై కోపంతో 3 నెలల పాపను చెత్త బుట్టలో పడేసిన తల్లి.. బిడ్డను రక్షించిన పారిశుద్ధ్య కార్మికులు..

| Edited By: శివలీల గోపి తుల్వా

Sep 13, 2023 | 12:58 PM

Guntur District News: బిడ్డ పుట్టడంతో అంకమ్మ ఆంజినేయులతో మాట్లాడే ప్రయత్నం చేసింది. అయితే వీరిద్దరికి మరో సారి గొడవ జరిగింది. దీంతో ఆమె తన కూతుర్ని మార్కెట్ సమీపంలోని ఓ చెత్త బుట్టలో వదిలేసి వెళ్లిపోయింది. ఆ రాత్రి ఏడు గంటల సమయంలో బిడ్డ చెత్త కుప్పలో ఉండటాన్ని పారిశుద్ద్య కార్మికులు గమనించారు. వెంటనే స్పందించిన కార్మికులు.. స్థానిక పోలీసుకు ఈ విషయాన్ని చేరవేశారు. బిడ్డను రక్షించి..

భర్తపై కోపంతో 3 నెలల పాపను చెత్త బుట్టలో పడేసిన తల్లి.. బిడ్డను రక్షించిన పారిశుద్ధ్య కార్మికులు..
3 Months Old Infant
Follow us on

గుంటూరు జిల్లా, సెప్టెంబర్ 13: జన్మనిచ్చిన తల్లిలోనే కన్న ప్రేమ, మానవత్వం మంట కలిశాయి. నెలల వయసే ఉన్న కన్న కూతుర్ని ఆ తల్లి చెత్త కుప్ప పాలు చేసింది. భర్త త్రాగుడుకి బానిసై వేధించడంతో అతని మీద కోపాన్ని కూతురిపై చూపించింది ఆ తల్లి. అయితే విషయం తెలుసుకున్న పోలీసులు బిడ్డను రక్షించడంతో పాటు వెంటనే ఆ తల్లిపై కేసు నమోదు చేశారు. బాపట్లలో జరిగిన ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే.. బాపట్లకు చెందిన అంకమ్మ, ఆంజినేయులు దంపతులు చెత్త వేరుకుంటూ జీవనం సాగిస్తారు. కొద్దీ నెలల కిందట అంకమ్మ పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. అయితే అంతక ముందు నుండే భార్య, భర్తల మధ్య గొడవలు ప్రారంభం అయ్యాయి. త్రాగి వచ్చిన ఆంజినేయులు తరచూ భార్యను అంకమ్మ వేధించేవాడు. దీంతో ఇద్దరి మధ్య విబేధాలు పొడచూపాయి. ఈ కారణంతోనే ఇద్దరూ కొన్ని రోజుల నుండి దూరంగా ఉంటున్నారు.

ఈ క్రమంలోనే అంకమ్మ ఆడబిడ్డకు జన్మనిచ్చింది. బిడ్డకు ప్రస్తుతం మూడో నెల వచ్చింది. బిడ్డ పుట్టడంతో అంకమ్మ ఆంజినేయులతో మాట్లాడే ప్రయత్నం చేసింది. అయితే వీరిద్దరికి మరో సారి గొడవ జరిగింది. దీంతో ఆమె తన కూతుర్ని మార్కెట్ సమీపంలోని ఓ చెత్త బుట్టలో వదిలేసి వెళ్లిపోయింది. ఆ రాత్రి ఏడు గంటల సమయంలో బిడ్డ చెత్త కుప్పలో ఉండటాన్ని పారిశుద్ద్య కార్మికులు గమనించారు. వెంటనే స్పందించిన కార్మికులు.. స్థానిక పోలీసుకు ఈ విషయాన్ని చేరవేశారు. బిడ్డను రక్షించి ఐసిడిఎస్ అధికారులకు పోలీసులు అప్పగించారు. మూడు నెలల ఆడ బిడ్డ ప్రస్తుతానికి క్షేమంగా ఉంది.

అయితే పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా బిడ్డను చెత్తబుట్టలో పడేసింది ఎవరని విచారణ మొదలు పెట్టారు పోలీసులు. ఈ దర్యాప్తులో అంకమ్మే బిడ్డను చెత్త బుట్టలో పడేసినట్లు తేలింది. దీంతో ఆమెపై సెక్షన్ 317 కింద కేసు నమోదు చేసి ఆదుపులోకి తీసుకున్నారు. పోలీసులు డిఎన్‌ఏ పరీక్షలు చేయిస్తున్నారు. బిడ్డ అంకమ్మ కూతురు కాదా అన్న అంశాన్ని సాంకేతిక ఆధారాలతో తేలుస్తారు. స్వంత బిడ్డ కాకుంటే ఆమెపై ఇతర సెక్షన్ల కింద కేసు నమోదు చేస్తామని పోలీసులు తెలిపారు. అలాగే 12 ఏళ్ల వయస్సులోపు ఉన్న సంతానాన్ని చెత్త బుట్టలో పడేవేయడం, ఎక్కడైనా వదిలివేయడం చేస్తే సెక్షన్ 317 కింద తీవ్ర నేరంగా పరగణించడబడుతుందని ఏడేళ్ల వరకూ శిక్ష పడే అవకావశం ఉందని బాపట్ల అర్బన్ సిఐ శ్రీనివాసులు తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..