Itlu Mee Niyojakavargam: ఆ నియోజకవర్గంలో టగ్‌ ఆఫ్‌ వార్‌ తప్పదా?.. చీపురుపల్లిలో పొలిటికల్‌ వారసులేవరు..

అందరి చూపు ఆ నియోజకవర్గం పైనే ఉంటుంది. ఒకరు సీనియర్ పొలిటిషియన్.. ఉమ్మడి రాష్ట్ర రాజకీయాలను శాసించిన నేత.. మరొకరు రాజకీయాల్లోకి కొత్తగా వచ్చిన యువకుడు. వీరిద్దరి మధ్య పోరు జిల్లాలోనే కాదు రాష్ట్ర రాజకీయాల్లోనూ ఆసక్తిగానే ఉంటుంది.. అక్కడ అధికార, ప్రతిపక్షాలకు ఎవరి ఓటు బ్యాంక్ వారికుంటుoది. ఎవరి రాజకీయాలూ వారివే.. హాట్ హాట్ గా రాజకీయాలు సాగుతున్న ఆ నియోజకవర్గం లో రానున్న ఎన్నికల పోరు మరింత రసవత్తరంగా మారనుంది.. ఇరుపార్టీలు బలంగా తలపడనున్న నేపథ్యంలో ఆయా పార్టీలకు ప్లస్ ఏంటి? మైనస్ ఏంటి? ప్రజలు ఏ పార్టీకి జై కొట్టనున్నారు.. రాజకీయ ఉద్దండుడితో రాజకీయ ఓనమాలు నేర్చుకుంటున్న నవ యువకుడు పోటీ పడగలడా? ఇంతకీ ఆ నియోజకవర్గ పాలిటిక్స్ ఎలా ఉన్నాయి..

Itlu Mee Niyojakavargam: ఆ నియోజకవర్గంలో టగ్‌ ఆఫ్‌ వార్‌ తప్పదా?.. చీపురుపల్లిలో పొలిటికల్‌ వారసులేవరు..
Cheepurupalli
Follow us
Sanjay Kasula

|

Updated on: Mar 27, 2023 | 8:06 PM

విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గం.. ఏపీ రాజకీయాల్లో కీలకమైంది. అందుకు తగ్గట్టే ఇక్కడ పాలిటిక్స్‌… మొదట్నుంచీ పవర్‌ఫుల్‌గానే సాగాయి. ఇప్పటికీ అలాగే కొనసాగుతున్నాయి. మంత్రి బొత్స సత్యనారాయణకు ఇక్కడ మంచి పట్టుంది. ఎంత పట్టంటే.. 2014లో ఏపీ అంతా కాంగ్రెస్ తుడిచిపెట్టుకుపోతే.. ఇక్కడ మాత్రం హస్తం అభ్యర్థిగా నిలబడిన బొత్స రెండో ప్లేస్‌ దక్కించుకున్నారు. అప్పుడా పార్టీకి దాదాపు 45ఓట్లు వచ్చాయంటే.. అదంతా బొత్స చరిష్మావల్లేనన్నది కాదనలేని నిజం.1999లో బొబ్బిలి పార్లమెంట్‌ స్థానం నుంచి ఎన్డీఏ హవాను తట్టుకుని గెలిచారు బొత్స. 2004లో తొలిసారి చీపురుపల్లి నుంచి అసెంబ్లీకి ఎన్నికైన బొత్స.. ఆ తర్వాత అదే జోష్‌ కంటిన్యూ చేశారు. 2009లో మళ్లీ గెలిచి మంత్రిగానూ అవకాశం దక్కించుకున్నారు.

ఉమ్మడి ఏపీలో పీసీసీ ప్రెసిడెంటుగానూ బాధ్యతలు నిర్వర్తించి.. రాష్ట్రస్థాయి నేతగా గుర్తింపు పొందారు సత్తిబాబు. వైఎస్‌ మరణం తర్వాత సీఎం ఎవరనే విషయంలో.. ఆయన పేరు కూడా తెరమీదకొచ్చింది. అయితే, విభజన సెగ దెబ్బతో 2014లో ఓడిన ఆయన..2015లో జగన్‌తో చేతులు కలిపారు. ఆ తర్వాత 2019లో వైసీపీ తరపున పోటీచేసి… విజయం సాధించారు. 2014 ఎన్నికల్లో మూడోస్థానానికి పరిమితమైన పార్టీని.. చీపురుపల్లిలో ఫస్టు ప్లేసుకు తీసుకొచ్చారు. అలా ఇప్పటికీ చీపురుపల్లిలో తన హవా కొనసాగిస్తున్నారు సత్తిబాబు. మరోసారి విజయం సాధించేందుకు ఉత్సాహంగా ఉరకలేస్తున్నారు.

బొత్సకు ఈసారి గెలుపు నల్లేరుపై నడకేనా? అడ్డంకులున్నాయా?

మరి, బొత్సకు ఈసారి గెలుపు నల్లేరు మీద నడకేనా? లేక అడ్డంకులేమైనా ఉన్నాయా? అంటే.. అవుననీ అనలేం, కాదనీ అనలేం. ఎందుకంటే, ఇది రాజకీయం. ఎప్పుడు ఏమైనా జరగొచ్చు. రాష్ట్రవ్యాప్తంగా చాలాచోట్ల వైసీపీ.. అంతర్గత కుమ్ములాటలతో సతమతమవుతోంది. ఇక్కడ కూడా అలాంటి గొడవలే ఉన్నా… చివరాకరికి అంతా కలిసి బొత్స సత్యన్నారాయణ గెలుపుకోసమే ప్రయత్నం చేస్తారన్న అభిప్రాయం ఉంది. ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, జడ్ పి ఛైర్మన్ కమ్‌ వైసిపి జిల్లా ప్రెసిడెంట్‌ చిన్న శ్రీనులిద్దరూ ఈ నియోజకవర్గం నుంచే ప్రాతినిథ్యం వహిస్తూ.. బొత్సకు అండగా ఉంటున్నారు. వీరిలో నియోజకవర్గ వైసిపి ఇంచార్జ్‌గా ఉన్న చిన్నశ్రీను.. లోకల్‌గా రాజకీయాలు నెరుపుతుంటారు. బొత్స ప్రతినిధిగా కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ సర్వీస్ చేస్తుంటారు. ఎంపీ బెల్లాన కూడా స్థానికుడు కావడంతో… ఆయన రాజకీయం ఆయనది. వీళ్లిద్దరూ కలిసి బొత్స వెన్నంటి ఉంటూ.. వైసీపీని చీపురుపల్లిలో మరింత బలోపేతం చేస్తున్నారు. అయితే, ఈ ఇద్దరునేతల మధ్య సఖ్యత లేదన్న ప్రచారం… అధికారపార్టీలో అలజడికి కారణమవుతోంది.

ట్రయాంగిల్‌ వార్‌లో గెలిచిన మృణాళిని

కాంగ్రెస్‌కథ కంచికి చేరడంతో.. చీపురుపల్లిలో వైసీపీ, టీడీపీలదే రాజ్యమన్నట్టుగా ఉంది పరిస్థితి. అయితే ఇక్కడ నాలుగుసార్లు జెండా ఎగరేసిన టీడీపీ… 1999 తర్వాత చతికిలపడింది. మళ్లీ, రాష్ట్రవిభజన తర్వాత 2014లో జరిగిన ఎన్నికల్లోనే సైకిల్‌ పార్టీకి విజయం దక్కింది. అనూహ్యంగా తెరమీదకు వచ్చిన కిమిడి మృణాళిని… టీడీపీ తరపున ఎమ్మెల్యేగా ఎన్నికై ఏకంగా చంద్రబాబు కేబినెట్‌లో బెర్త్‌ కొట్టేశారు. ఆమె భర్త కిమిడి గజపతి కూడా గతంలో ఎమ్మెల్యేగా చేశారు. ఆయన తమ్ముడు కిమిడి కళా వెంకట్రావ్‌… ఎమ్మెల్యేగా, మంత్రిగా, ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా సేవలందించారు. ఇంతటి పొలిటికల్‌ బ్యాగ్రౌండ్‌ ఉన్నా.. ఆమె చీపురుపల్లికి కొత్తే. అయినా సరే, ట్రయాంగిల్‌ వార్‌లో… గెలిచేశారన్న అభిప్రాయం ఉంది. అయితే, 2019 వచ్చేసరికి.. ఆమె స్థానంలో కుమారుడు కిమిడి నాగార్జునను బరిలో దింపిన టీడీపీకి… వైసీపీ తరపున బరిలో నిలిచిన బొత్స చేతిలో ఓటమి తప్పలేదు. ఓడినా సరే, నియోజకవర్గంలోనే ఉంటూ వచ్చేసారైనా విక్టరీ కొట్టాలనే ప్రయత్నంలో ఉన్నారు నాగార్జున. వ్యక్తిగత వైరమేమీ లేకపోయినా.. టీడీపీ ఇంచార్జ్‌గా ఉంటూ ప్రత్యర్థి బొత్సతో సై అంటే సై అంటున్నారు.

వారసుల విషయంలో సీఎం జగన్‌ వైఖరి మారుతుందా?

అయితే, వచ్చేసారి బొత్స సత్యనారాయణ ప్లేసులో… ఆయన కుమారుడు సందీప్‌ పోటీచేస్తారనే ప్రచారం జరుగుతోంది. తాను ఎంపీగా పోటీచేసి.. వారసుణ్ని అసెంబ్లీ బరిలో నిలపాలని ఈ సీనియర్‌ నేత ఆలోచిస్తున్నట్టు సమాచారం. అయితే, ఇప్పట్లో వారసులకు నో ఛాన్స్‌ అంటూ… కొన్నాళ్లక్రితమే సీఎం జగన్‌ కుండబద్ధలు కొట్టేశారు కాబట్టి, బొత్స ప్లాన్‌ వర్కవుట్‌ అవుతుందా? అన్నదే ఇప్పుడు ఆసక్తికరాంశం. ఒకవేళ సీఎం జగన్‌ ఓకే అంటే మాత్రం.. వచ్చేసారి చీపురుపల్లిలో యువనాయకుల మధ్యే పోరు ఉండే అవకాశం ఉంది. అదే జరిగితే అటు టీడీపీ నుంచి నాగార్జున.. ఇటు వైసీపీ నుంచి సందీప్‌.. రచ్చరచ్చేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

గెలుపోటములు నిర్దేశిస్తున్న యాదవ, కొప్పుల వెల్మలు

రెండు లక్షల మంది ఓటర్లు ఉండే చీపురుపల్లిలో తూర్పు కాపులదే హవా. అందుకే, ఆ వర్గం నుంచి బలమైన నాయకుడిగా ఎదిగారు బొత్స సత్యనారాయణ. కొప్పుల వెల్మ, యాదవ సామాజికవర్గాలు సైతం బలంగానే ఉన్నాయి. తూర్పు కాపుల తర్వాత… గెలుపోటములు నిర్దేశించేది కూడా వీళ్లే. అయితే, ఇక్కడ అంతగా బలంలేని కమ్మ సామాజిక వర్గం నుంచి గెలిచిన నేతలూ ఉన్నారు. 1994, 1999 ఎన్నికల్లో టీడీపీ తరపున వరుస విజయాలు నమోదుచేశారు గద్దె బాబూరావు. 2004,2009ఎన్నికల్లోనూ బొత్స చేతిలో స్వల్ప తేడాతోనే ఓడిపోయారు. ఇక్కడ వైసీపీకి యాదవుల మద్దతు ఉన్నట్టు కనిపిస్తోంది. టీడీపీకి గట్టి పునాదులే ఉన్నా… గత ఎన్నికల్లో తూర్పు కాపులు వైసీపీ టర్న్‌ తీసుకోవడంతో ఓటమి తప్పలేదు. అంతేకాదు, బొత్సకు 25వేలకు మించి మెజార్టీ వచ్చింది. బట్‌, ఈసారి సమీకరణాలు మారితే మాత్రం.. విజయం కూడా సైడు మార్చే అవకాశం లేకపోలేదు.

చీపురుపల్లిని వేధిస్తున్న దీర్ఘకాలిక సమస్యలు

బొత్స ఏలుబడిలో చీపురుపల్లి అంతా చిల్‌ అనుకోవడానికి లేదు. నియోజకవర్గంలో దీర్ఘకాలిక సమస్యలు కూడా ఉన్నాయి. తోటపల్లి కుడి ప్రధాన కాలువకు అనుసంధానంగా నిర్మించాల్సిన పిల్లకాలువలు, పూడికతీతలు, మరమ్మతు పనులు.. ఎప్పటికీ పూర్తవుతాయో తెలియని పరిస్థితి. బొత్స ఒత్తిడితో ఇటీవల 120కోట్లు శాంక్షన్ అయినా.. ఇంకా పనులు మాత్రం ప్రారంభం కాలేదు. దీంతో సాగునీరందక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

చీపురుపల్లి, మున్సిపాలిటీ కావాలన్న డిమాండ్‌ నెరవేరదా?

చీపురుపల్లి పంచాయితీని మునిసిపాలిటీగా మార్చే అంశమూ చాలారోజులుగా పెండింగ్‌లోనే ఉంది. పంచాయితీ కాస్తా నగర పంచాయితీ అయితే… అభివృద్ధి మరింత వేగం పెరిగే అవకాశం ఉంది. ఆ విషయంలో బొత్స ప్రయత్నం శూన్యమన్నది ప్రతిపక్షాల ఆరోపణ.

ఆర్‌ఈసీఎస్‌ విలీన ప్రతిపాదనతో గందరగోళం

ఇక్కడ స్వయం ప్రతిపత్తి గల ఆర్ఈసీఎస్‌ విద్యుత్ సంస్థ సమస్య కూడా అంతకంతకూ జఠిలమవుతోంది. ఆర్ఈసిఎస్‌ను ఏపీఈపిడిసిఎల్ లో విలీనం చేయాలన్న ప్రతిపాదనకు లోకల్‌గా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. దీనిపై, అటు ఉద్యోగులు, ఇటు వినియోగదారులు అసంతృప్తితో ఉన్నారు.

వచ్చేసారి చీపురుపల్లిలో టగ్‌ ఆఫ్‌ వార్‌ తప్పదా?

చాన్నాళ్లుగా పెండింగ్‌లో ఉన్న సమస్యలు ఓవైపు… ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ ప్రతిపక్షం చేస్తున్న పోరాటం మరోవైపు… మొత్తానికి వచ్చేసారి చీపురుపల్లిలో పోరు అంత వీజీగా ఏం ఉండదని అర్థమవుతోంది. అయితే, బొత్స సొంత చరిష్మాతో బలంగా ఉన్న అధికారపక్షాన్ని… విపక్షం ఎలా ఢీకొడుతుందో చూడాలి.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం

'పొద్దున్నే ముఖంపై ఉమ్మి అప్లై చేస్తా': టాలీవుడ్ క్రేజీ హీరోయిన్
'పొద్దున్నే ముఖంపై ఉమ్మి అప్లై చేస్తా': టాలీవుడ్ క్రేజీ హీరోయిన్
లగేజ్‌ స్కాన్ చేస్తుండగా కంగారుపడ్డ వ్యక్తి.. బ్యాగ్ ఓపెన్ చేయగా
లగేజ్‌ స్కాన్ చేస్తుండగా కంగారుపడ్డ వ్యక్తి.. బ్యాగ్ ఓపెన్ చేయగా
భక్తులకు భోజనం అందించేందుకు ఇస్కాన్ తో చేతులు కలిపిన అదానీ సంస్థ
భక్తులకు భోజనం అందించేందుకు ఇస్కాన్ తో చేతులు కలిపిన అదానీ సంస్థ
సల్మాన్ ఖాన్‌ను టీజ్ చేసిన హర్భజన్-యూవీ!
సల్మాన్ ఖాన్‌ను టీజ్ చేసిన హర్భజన్-యూవీ!
ఏపీ, తెలంగాణలో సంక్రాంతి సెలవులు ఇవే.. ఎవరికి ఎన్ని రోజులంటే.?
ఏపీ, తెలంగాణలో సంక్రాంతి సెలవులు ఇవే.. ఎవరికి ఎన్ని రోజులంటే.?
తివారీ – గంభీర్‌కు కేకేఆర్ ఆటగాళ్ల మద్దతు!
తివారీ – గంభీర్‌కు కేకేఆర్ ఆటగాళ్ల మద్దతు!
ఆరు బంతుల్లో ఆరు ఫోర్లు: ఐపీఎల్ జట్లకు నారాయణ్ జగదీశన్ పంచ్!
ఆరు బంతుల్లో ఆరు ఫోర్లు: ఐపీఎల్ జట్లకు నారాయణ్ జగదీశన్ పంచ్!
టాటా గ్రూప్‌లో పెను మార్పులు.. నోయల్ టాటా కూతుళ్లకు కీలక బాధ్యతలు
టాటా గ్రూప్‌లో పెను మార్పులు.. నోయల్ టాటా కూతుళ్లకు కీలక బాధ్యతలు
సినిమా సెట్ లోనే పరీక్షలకు ప్రిపేరవుతోన్న రవీనా కూతురు.. వీడియో
సినిమా సెట్ లోనే పరీక్షలకు ప్రిపేరవుతోన్న రవీనా కూతురు.. వీడియో
నవాబుల నగరంలోని నల్ల క్యారెట్ హల్వా.. స్పెషాలిటీ ఏమిటంటే..
నవాబుల నగరంలోని నల్ల క్యారెట్ హల్వా.. స్పెషాలిటీ ఏమిటంటే..