AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: పడక గదిలో పరాయి వ్యక్తితో కనిపించిన భార్యను మందలించిన భర్త.. తెల్లారేసరికల్లా..!

వివాహేతర సంబంధం ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. ఈ దారుణ ఘటన పల్నాడు జిల్లా మాచర్ల మండలంలో జరిగింది. తమ అనైతిక బంధానికి భర్త అడ్డుగా ఉన్నాడని ప్రియుడితో కలిసి ఓ భార్య దారుణానికి ఒడిగట్టింది.

Andhra Pradesh: పడక గదిలో పరాయి వ్యక్తితో కనిపించిన భార్యను మందలించిన భర్త.. తెల్లారేసరికల్లా..!
Crime News
Balaraju Goud
|

Updated on: Oct 03, 2024 | 6:17 PM

Share

వివాహేతర సంబంధం ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. ఈ దారుణ ఘటన పల్నాడు జిల్లా మాచర్ల మండలంలో జరిగింది. తమ అనైతిక బంధానికి భర్త అడ్డుగా ఉన్నాడని ప్రియుడితో కలిసి ఓ భార్య దారుణానికి ఒడిగట్టింది. భర్తను హత్య చేసి గట్టుచప్పుడు కాకుండా తప్పుకునేందుకు ప్రయత్నించింది. ఈ సంఘటన మాచర్ల మండలం తాళ్లపల్లిలో చోటుచేసుకుంది. గురువారం(అక్టోబర్ 3) విజయపురి సౌత్ పోలీస్ స్టేషన్‌ పరిధిలో జరిగిన ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. దీంతో అసలు నిందితుల గుట్టురట్టు అయ్యినట్లు మాచర్ల రూరల్ సీఐ నఫీజ్ బాషా తెలిపారు.

సీఐ నఫీజ్ బాషా తెలిపిన వివరాల ప్రకారం మాచర్ల మండలం తాళ్లపల్లికి చెందిన ఓర్సు శివయ్య(32) స్థానిక పవర్ గ్రిడ్‌లో కాంట్రాక్టు ఉద్యోగిగా పనిచేస్తున్నారు. శివయ్య భార్య గాయత్రికి అదే గ్రామానికి చెందిన సచివాలయ ఉద్యోగి ఆమ్మోరయ్యతో వివాహం కాకముందే సాన్నిహిత్యం ఉంది. వారిద్దరూ పెళ్లిచేసుకోవాలని అనుకున్నారు. అందుకు పెద్దలు ఒప్పుకోలేదని సీఐ వెల్లడించారు. ఈ క్రమంలోనే శివయ్యకు గాయత్రిని ఇచ్చి వివాహం జరిపించారు.

ఇదిలావుంటే, సెప్టెంబర్ 30వ తేదీన అర్ధరాత్రి సమయంలో గాయత్రి ,అమ్మోరయ్య ఇద్దరూ కలిసి ఏకాంతంగా గడుపుతున్న సమయంలో భర్త శివయ్య కంట పడ్డారు. దీంతో కంగారుపడ్డ గాయత్రి, అమ్మోరయ్యలు శివయ్యను దిండుతో మొహంపై ఉంచి ఊపిరి అడకుండా చేసి చంపేశారు. అనంతరం గుండెపోటుతో చనిపోయాడంటూ అందరినీ నమ్మించేందుకు ప్రయత్నించింది గాయత్రి. అయితే, అనుమానం వచ్చిన మృతుని తల్లి విజయపురి సౌత్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. దీంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి, తమదైన శైలిలో విచారణ చేపట్టారు. దీంతో నిందితుల అసలు రూపం బయటపడింది. ఇద్దరు నిందుతులు గాయత్రి, ఆమ్మోరయ్యలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇద్దరిని కోర్టులో హాజరు పరచి రిమాండ్ కు తరలించినట్లు సీఐ పేర్కొన్నారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

Follow Us
బెడ్‌రూమ్‌ ఏసీ నుంచి అదే పనిగా శబ్ధాలు.. దగ్గరకు వెళ్లగా.. వామ్మో
బెడ్‌రూమ్‌ ఏసీ నుంచి అదే పనిగా శబ్ధాలు.. దగ్గరకు వెళ్లగా.. వామ్మో
ఉత్తమ నటిగా రష్మిక మందన్నా.. ఉత్తమ నటుడిగా నాగచైతన్య..
ఉత్తమ నటిగా రష్మిక మందన్నా.. ఉత్తమ నటుడిగా నాగచైతన్య..
ఆ స్టార్ హీరో తండ్రి నాకు దేవుడితో సమానం..
ఆ స్టార్ హీరో తండ్రి నాకు దేవుడితో సమానం..
ఏంట్రా ఇది.. బీర్ బాటిల్‌లో ప్రత్యక్షమైన చేప పిల్ల.. కొంచెం అయితే
ఏంట్రా ఇది.. బీర్ బాటిల్‌లో ప్రత్యక్షమైన చేప పిల్ల.. కొంచెం అయితే
పొరపాటున కూడా ఈ రోజుల్లో బూట్లు కొనొద్దు.. ఈ తప్పులు చేస్తే..
పొరపాటున కూడా ఈ రోజుల్లో బూట్లు కొనొద్దు.. ఈ తప్పులు చేస్తే..
అమ్మకు పెళ్లి.. ఈ జంటకు ఎవరూ దిష్టపెట్టకూడదంటూ కూతురి పోస్ట్‌ వైర
అమ్మకు పెళ్లి.. ఈ జంటకు ఎవరూ దిష్టపెట్టకూడదంటూ కూతురి పోస్ట్‌ వైర
పవన్ కళ్యాణ్ ఇష్టపడి ఎక్కువసార్లు చూసిన బాలయ్య సినిమా ఏదో తెల్సా
పవన్ కళ్యాణ్ ఇష్టపడి ఎక్కువసార్లు చూసిన బాలయ్య సినిమా ఏదో తెల్సా
IND vs NZ: మావొడు ఒక్కడు చాలు.. మీకిక రక్త కన్నీరే
IND vs NZ: మావొడు ఒక్కడు చాలు.. మీకిక రక్త కన్నీరే
సికింద్రాబాద్ స్టేషన్‌కు వెళ్లే వారికి బిగ్‌ అలర్ట్.. ఈ మార్పులు
సికింద్రాబాద్ స్టేషన్‌కు వెళ్లే వారికి బిగ్‌ అలర్ట్.. ఈ మార్పులు
ఆ ఒక్క సీన్ సినిమా స్థాయినే మార్చేసింది..
ఆ ఒక్క సీన్ సినిమా స్థాయినే మార్చేసింది..