Andhra Pradesh: వీడు మామూలోడు కాదు.. బాత్ రూమ్‌కు వెళ్లిన మహిళ.. ఇంతలోనే ఏం చేశాడంటే..?

దొంగల తెలివి మామూలుగా ఉండదు.. చోరీ కోసం ఎలాంటి ప్లాన్ అయినా రచిస్తారు.. తాజాగా.. బంగారం ధర అధికంగా ఉండటంతో బంగారు ఆభరణాలు కొట్టేయడానికి దొంగలు వినూత్న పద్దతులు అవలంభిస్తున్నారు. కొత్త తరహాలో చోరీలు చేస్తున్నారు. పోలీసుల నిఘా ఎంత పెరిగినా దొంగలు కూడా అదే స్థాయిలో నూతన పద్దతులు ఎంచుకుంటున్నారు. గుంటూరులో ఇటువంటి తరహా దొంగతనమే జరిగింది.

Andhra Pradesh: వీడు మామూలోడు కాదు.. బాత్ రూమ్‌కు వెళ్లిన మహిళ.. ఇంతలోనే ఏం చేశాడంటే..?
Crime News

Edited By:

Updated on: Sep 28, 2023 | 12:51 PM

గుంటూరు, సెప్టెంబర్ 28: దొంగల తెలివి మామూలుగా ఉండదు.. చోరీ కోసం ఎలాంటి ప్లాన్ అయినా రచిస్తారు.. తాజాగా.. బంగారం ధర అధికంగా ఉండటంతో బంగారు ఆభరణాలు కొట్టేయడానికి దొంగలు వినూత్న పద్దతులు అవలంభిస్తున్నారు. కొత్త తరహాలో చోరీలు చేస్తున్నారు. పోలీసుల నిఘా ఎంత పెరిగినా దొంగలు కూడా అదే స్థాయిలో నూతన పద్దతులు ఎంచుకుంటున్నారు. గుంటూరులో ఇటువంటి తరహా దొంగతనమే జరిగింది. దొంగను పట్టుకునేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. బుధవారం మధ్యాహ్నం సమయంలో రోడ్లన్నీ నిర్మానుష్యంగా ఉన్నాయి. ఎండ తీవ్ర కూడా ఎక్కువుగా ఉండి. చంద్రమౌళి నగర్‌లో మోహన్ రెడ్డి, అనురాధ దంపతులు నివసిస్తున్నారు. మధ్యాహ్నం వేళ ఇంటిలో అనురాధ తప్ప ఎవరూ లేరు. మిర్చి యార్డులో పనిచేసే మోహన్ రెడ్డి.. యార్డుకు వెళ్లారు. పిల్లలు కాలేజ్‌కు వెళ్లటంతో అనురాధ ఒక్కరే ఇంట్లో ఉన్నారు. ఈ సమయంల అనురాధ బాత్ రూంకి వెళ్లింది. బాత్ రూంలోకి వెళ్లే ముందు ఇంటి తలుపులు వేయడం మర్చిపోయింది. ఆమె బాత్ రూంకు వెళ్లడాన్ని గమనించిన దొంగ ఇంటిలోకి చొరబడ్డాడు. బాత్ రూం కు బయటనుంచి గడియపెట్టాడు. ఆ తరువాత బీరువాలో ఉన్న రెండున్నర లక్షల రూపాయల విలువ చేసే బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లాడు.

కొద్దీ సేపటి తర్వాత బాత్ రూం తలుపు తీసేందుకు ప్రయత్నించి విఫలమయిన అనురాధ కేకలు వేసింది. పక్కన ఉన్న అపార్ట్‌మెంట్ వాచ్‌మెన్.. అనురాధ కేకలు విని ఇంటిలోకి వచ్చాడు. బాత్ రూమ్‌ నుంచి అనురాధ కేకలు వేస్తుండటంతో వెంటనే గడి తీశాడు. బాత్ రూం నుంచి బయటకు వచ్చిన అనురాధ అనుమానం వచ్చి ఇంటిలోకి వెళ్లి చూడాగా బీరుగా తలుపు తీసి ఉంది. బీరువా అంతా పరిశీలించగా రెండున్నర లక్షల రూపాయల విలువ చేసే ఆభరణాలు కనిపించలేదు.

దొంగలే ఇంటిలోకి వచ్చి బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లినట్లు గుర్తించిన దంపతులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు సాంకేతిక ఆధారాలు సేకరించే పనిలో పడ్డారు. త్వరలోనే దొంగను పట్టుకుంటామని పోలీసులు తెలిపారు. కాగా.. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..