పశ్చిమగోదావరి జిల్లా ఉండి పార్సిల్ డెడ్‌బాడీ కేసులో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తులసి మరిది శ్రీధర్‌వర్మను పోలీసులు నిందితుడిగా భావిస్తున్నారు. శ్రీధర్‌వర్మ మూడు రోజులుగా అజ్ఞాతంలోకి వెళ్లడంతో అనుమానాలు మరింత పెరుగుతున్నాయి. ఇక.. అతని కోసం గాలిస్తున్న పోలీసులు.. పలు కీలక విషయాలు సేకరించారు.
శ్రీధర్‌వర్మ.. ఇప్పటికే మూడు పెళ్లిళ్లు చేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. మూడవ మహిళతో కాళ్ళ గ్రామంలో ఉంటున్నట్లు తేల్చారు. కాళ్ల గ్రామంలోని శ్రీధర్‌వర్మ ఇంట్లో తనిఖీలు చేయగా.. మరో ఖాళీ చెక్క పెట్టె ఉండడంతో షాకయ్యారు. అటు.. శ్రీధర్‌వర్మ కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. అయితే.. ఫోన్లు, సిమ్‌కార్డులు మారుస్తూ తప్పించుకుంటున్నట్లు తెలుస్తోంది.
మరోవైపు.. పార్సిల్‌లో పంపిన డెడ్‌బాడీ ఎవరిదనేదానిపైనా పోలీసులు ఫోకస్ పెట్టారు. తాజాగా ఆ డెడ్‌బాడీ మిస్టరీ వీడింది. మృతుడు.. కాళ్ల గాంధీనగర్‌కు చెందిన పర్లయ్యగా గుర్తించారు. మద్యానికి బానిసైన పర్లయ్యను పనికి తీసుకెళ్లి..
సుధీర్‌వర్మ హత్య చేసినట్టు భావిస్తున్నారు పోలీసులు. పరారీలో ఉన్న సుధీర్‌వర్మ కోసం పోలీసుల గాలింపు ముమ్మరం చేశారు.
అసలేం జరిగింది…
పశ్చిమగోదావరి జిల్లా ఉండి మండలం రంగరాజు అనే వ్యక్తి ఫ్యామిలీ నివాసం ఉంటోంది. ఆయనకు ఇద్దరు కుమార్తెలు. పెద్దకుమార్తె పేరు సాగి తులసి. అప్పులు చేసి భర్త పరారీలో ఉండడంతో తులసీ తన కుమార్తెతో కలిసి పాలకోడెరు మండలం గరగపర్రులో ఉంటోంది. తులసికి తన తండ్రి స్వగ్రామమైన యండగండిలో గత ప్రభుత్వం ఓ ఇంటిస్థలం మంజూరు చేసింది. అయితే ఆమె ఆర్ధిక పరిస్థితి గమనించి క్షత్రియ సేవాసమితి పౌండేషన్ అనే సంస్థ ఆమె ఇంటి నిర్మాణానికి అవసరమైన సామాన్లూ అందిస్తూ వస్తోంది. ప్రస్తుతం ఆ ఇల్లు ప్లాస్టింగ్ స్టేజ్ కి వచ్చింది. ఇంటికి కావలసిన సామాన్లు యండగండిలో తండ్రి రంగరాజు ఇంటికి పార్సిల్ ద్వారా వెళుతుంటాయి. ఏమేమి వస్తువులు ఎప్పుడు వస్తాయి అనేది తులసికి వాట్స్అప్ మెస్సేజ్ ద్వారా సమాచారం వస్తుంది. గతంలో కూడా ఇంటికి కావలసిన పెయింట్ డబ్బాలు, టైల్స్ తన తండ్రి ఇంటికి పార్సిల్ ద్వారానే వచ్చాయి. ఆక్రమంలోనే ఇంటికి కావలసిన కరెంటు సామాన్లు మోటారు వస్తాయని తులసికి గురువారం వాట్సాప్ లో మెసేజ్ వచ్చింది. మరుసటిరోజే ఒక చెక్క పెట్ట పార్సిల్ వచ్చింది. చెక్కపెట్టపైన కవర్‌లో ఓ తాళం చెవి, ఓ కవర్ ఉంచారు. ఆకవర్‌లో ఉన్న లెటర్ ఓపెన్ చేయగా…కుటుంబసభ్యులంతా షాక్. కోటి 30లక్షలు చెల్లించాలని..లేకపోతే ఇబ్బందులు పడతారని అందులో రాసి ఉంది.
లెటర్ చూసి షాక్ తిన్న తులసి కుటుంబసభ్యులు…పెట్టెలో ఏముందని ఓపెన్ చేశారు. ఓపెన్ చేయగానే మరోషాక్. కరెంట్ సామానులకు బదులు 45సంవత్సరాల వయసున్న ఓ వ్యక్తి మృతదేహం అందులోకనిపించింది. డెడ్‌బాడీ చూడగానే గుండె ఆగిపోయినంత పని అయింది. వెంటనే ఉండి పోలీసులకు సమాచారం అందించారు. డెడ్‌బాడీ పార్సిల్‌పై అనేక కోణాల్లో పోలీసులు విచారిస్తున్నారు. ప్రస్తుతం ఫ్యామిలీ ఇష్యూస్‌పైనా ఆరాతీస్తున్నారు. డెడ్‌బాడీ ఘటన వెలుగులోకి వచ్చిన సందర్భం నుంచి చిన్నకూతురు భర్త శ్రీధర్‌వర్మ కనిపించకపోవడంపైనా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అతని ఆచూకి కోసమే ప్రస్తుతం పోలీసులు గాలిస్తున్నారు. అతని దొరికితే ఈ కేసు చిక్కుముడి వీడే అవకాశం ఉంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..