Andhra Pradesh: ఏపీ రాజకీయాల్లో మేనిఫెస్టో మంత్రం! ఆచరణ సాధ్యం ఏది? జనామోదం పొందేది ఏది?

ఏపీలో ఎన్నికల హడావుడి పీక్స్‌కు చేరింది. అధికార వైసీపీ మరోసారి జనాకర్షక మేనిఫెస్టోతో ప్రజలకు ముందుకు రావడంతో.. రాష్ట్ర రాజకీయం ఒక్కసారిగా మారిపోయింది. ఇప్పటికే ఉన్న నవరత్నాలను మరింత బలంగా ముందుకు తీసుకెళ్తామంటున్న జగన్‌... పేదలకు ఇచ్చే ఆర్థికసాయాన్ని విడతలవారీగా పెంచుతామంటున్నారు. మరి, ఇప్పటికే సూపర్‌ సిక్స్‌ నినాదాన్ని ఎత్తుకున్న విపక్ష కూటమి... వైసీపీకి ధీటుగా ఎలాంటి ఎన్నికల ప్రణాళికను తీసుకొస్తుందన్నదే ఆసక్తిరేపుతోంది.

Andhra Pradesh: ఏపీ రాజకీయాల్లో మేనిఫెస్టో మంత్రం! ఆచరణ సాధ్యం ఏది? జనామోదం పొందేది ఏది?
Weekend Hour
Follow us

|

Updated on: Apr 27, 2024 | 6:55 PM

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల ప్రచారం.. చివరి అంకానికి చేరుకుంటోంది. అధికార వైసీపీ మరోసారి ప్రజాకర్షక మేనిఫెస్టోతో ప్రజల ముందుకు వచ్చింది. పార్టీ ఎన్నికల ప్రణాళికను విడుదల చేసిన సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి.. గతంలో కంటే మెరుగ్గా సంక్షేమ పథకాలను కొనసాగిస్తామని చెప్పారు. చెప్పిందే చేస్తామనీ… చేసేదే చెప్తామనీ స్పష్టం చేశారు సీఎం జగన్‌..

నవరత్నాలను యథాతథంగా ముందుకు తీసుకెళ్తామన్న జగన్మోహన్‌రెడ్డి… తాను చేతకాని హామీలు ఇవ్వబోనని స్పష్టం చేశారు. ఐదేళ్ల పాటు అవినీతికి తావులేకుండా పేదలకు సంక్షేమఫలాలు అందించామన్న జగన్‌… అలవిగాని హామీలిచ్చి కూటమి పార్టీలు ప్రజల్ని మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. గతంలో కూటమి ఇచ్చిన హామీలను గుర్తు చేసిన జగన్‌… విపక్షాలు చెబుతున్న సూపర్‌ సిక్స్‌ను అమలు చేయడం అసాధ్యమన్నారు.

వీకెండ్ హౌర్ లైవ్ వీడియో చూడండి..

ఇప్పటికే సూపర్‌ సిక్స్‌ అంటూ ప్రజల్లోకి వెళ్తోంది విపక్ష కూటమి. ఉమ్మడి మేనిఫెస్టోనూ సిద్ధం చేస్తోంది. మరి, అధికార పార్టీకి ధీటుగా ఎలాంటి ఎన్నికల ప్రణాళికతో ముందుకు వస్తుందన్నదే ఇప్పుడు ఆసక్తి రేపుతోంది.

మొత్తానికి రాష్ట్ర రాజకీయాల్లో మేనిఫెస్టో మంత్రం పఠిస్తున్నాయి పార్టీలు. మరి, ఎవరి ప్రణాళిక ఆచరణ సాధ్యమో… ఎవరి హామీలకు ప్రజామోదం లభిస్తుందో చూడాలి..

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Latest Articles
డూ ఆర్ డై మ్యాచ్‌లో పంజాబ్‌పై ఆర్సీబీ విజయం.. ప్లే ఆఫ్ ఆశలు సజీవం
డూ ఆర్ డై మ్యాచ్‌లో పంజాబ్‌పై ఆర్సీబీ విజయం.. ప్లే ఆఫ్ ఆశలు సజీవం
T20 ప్రపంచకప్‌కు శ్రీలంక జట్టు.. కెప్టెన్ ఎవరో అసలు ఊహించలేరు
T20 ప్రపంచకప్‌కు శ్రీలంక జట్టు.. కెప్టెన్ ఎవరో అసలు ఊహించలేరు
ఒకే గడ్డపై ఇద్దరు అగ్ర నేతలు.. ఏం మాట్లాడతారన్న సర్వత్రా ఆసక్తి!
ఒకే గడ్డపై ఇద్దరు అగ్ర నేతలు.. ఏం మాట్లాడతారన్న సర్వత్రా ఆసక్తి!
బీఆర్ఎస్ నామమాత్రంగా పోటీః రేవంత్
బీఆర్ఎస్ నామమాత్రంగా పోటీః రేవంత్
మామిడి సీజన్‌లో చల్లగా ఇలా మ్యాంగో లస్సీ చేసుకోండి.. ఆహా అంటారు!
మామిడి సీజన్‌లో చల్లగా ఇలా మ్యాంగో లస్సీ చేసుకోండి.. ఆహా అంటారు!
కోహ్లీ సెంచరీ మిస్.. పటిదార్ మెరుపులు.. RCB భారీ స్కోరు
కోహ్లీ సెంచరీ మిస్.. పటిదార్ మెరుపులు.. RCB భారీ స్కోరు
పిండి రుబ్బకుండానే.. జస్ట్ పది నిమిషాల్లో గారెలు చేయొచ్చు..
పిండి రుబ్బకుండానే.. జస్ట్ పది నిమిషాల్లో గారెలు చేయొచ్చు..
తిరుగులేని టీమిండియా..బంగ్లాను క్లీన్‌స్వీప్ చేసిన భారత అమ్మాయిలు
తిరుగులేని టీమిండియా..బంగ్లాను క్లీన్‌స్వీప్ చేసిన భారత అమ్మాయిలు
నవనీత్‌ కౌర్‌ను వెంటనే పార్టీ నుంచి బహిష్కరించాలి.. సీఎం రేవంత్
నవనీత్‌ కౌర్‌ను వెంటనే పార్టీ నుంచి బహిష్కరించాలి.. సీఎం రేవంత్
గుజరాత్ నాయకులపై రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు
గుజరాత్ నాయకులపై రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు