Lok Sabha Election: అగ్రనేతల ఎంట్రీతో హీటెక్కనున్న పాలమూరు పాలిటిక్స్‌.. మోదీ – రేవంత్ పోటా పోటీ సభలు

అగ్రనేతల ఎంట్రీతో పాలమూరు పాలిటిక్స్‌ హీటెక్కనున్నాయి. ప్రచారంలో ఫైనల్‌ టచ్‌ ఇచ్చేందుకు ఇటు పీఎం, అటు సీఎం... ఇద్దరూ గంట వ్యవధిలోనే మహబూబ్‌నగర్‌ గడ్డపై అడుగుపెట్టనున్నారు. మహబూబ్‌నగర్‌ పార్లమెంట్ స్థానాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఇద్దరు నేతలు...ఒకే రోజు పోటాపోటీగా సభలు నిర్వహించడం హాట్‌టాపిక్‌గా మారింది. పొలిటికల్‌గా ఫుల్‌ బస్‌ క్రియేట్‌ చేస్తోంది.

Lok Sabha Election: అగ్రనేతల ఎంట్రీతో హీటెక్కనున్న పాలమూరు పాలిటిక్స్‌.. మోదీ - రేవంత్ పోటా పోటీ సభలు
Pm Modi Revanth Reddy Kishan Reddy
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: May 09, 2024 | 11:11 PM

అగ్రనేతల ఎంట్రీతో పాలమూరు పాలిటిక్స్‌ హీటెక్కనున్నాయి. ప్రచారంలో ఫైనల్‌ టచ్‌ ఇచ్చేందుకు ఇటు పీఎం, అటు సీఎం… ఇద్దరూ గంట వ్యవధిలోనే మహబూబ్‌నగర్‌ గడ్డపై అడుగుపెట్టనున్నారు. మహబూబ్‌నగర్‌ పార్లమెంట్ స్థానాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఇద్దరు నేతలు…ఒకే రోజు పోటాపోటీగా సభలు నిర్వహించడం హాట్‌టాపిక్‌గా మారింది. పొలిటికల్‌గా ఫుల్‌ బస్‌ క్రియేట్‌ చేస్తోంది.

అగ్రనేతల ఎంట్రీతో మహబూబ్‌నగర్‌ గడ్డ మరోసారి వేడెక్కనుంది. ఓవైపు భారత ప్రధాని నరేంద్ర మోదీ.. మరోవైపు సీఎం రేవంత్‌ రెడ్డి పోటాపోటీ ప్రచార సభలతో పాలమూరు మరింత హీటెక్కనుంది. గంట వ్యవధిలోనే ఇద్దరు నేతలు మహబూబ్‌నగర్‌లో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించనుండటం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఒకే గడ్డపై ఇద్దరు నేతలు ఏం మాట్లాడతారన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది.

మహబూబ్‌నగర్‌ పార్లమెంట్‌ స్థానాన్ని అటు బీజేపీ, ఇటు కాంగ్రెస్‌ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. కాంగ్రెస్‌ నుంచి వంశీచంద్‌ బరిలో నిలుస్తుండగా… బీజేపీ అభ్యర్థిగా డీకే అరుణ పోటీలో ఉన్నారు. గెలుపే లక్ష్యంగా ఇద్దరు అభ్యర్థులు కాళ్లకు చక్రాలు కట్టుకుని ముమ్మర ప్రచారం నిర్వహిస్తున్నారు. గల్లీగల్లీ తిరుగుతూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు. మరోవైపు అగ్రనేతలు సైతం వీళ్ల తరుపున ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇప్పటికే పలువురు బీజేపీ నేతలు డీకే అరుణ తరుపున ప్రచారం నిర్వహించగా… ఇప్పుడు ఫైనల్‌ టచ్‌ ఇచ్చేందుకు ప్రధాని మోదీ రెడీ అయ్యారు. మే 10వ తేదీన మధ్యాహ్నం 2 గంటలకు నారాయణపేట జిల్లా కేంద్రంలో బీజేపీ నిర్వహించే భారీ సభలో ఆయన పాల్గొని ప్రసంగించనున్నారు.

ఇటు మహబూబ్‌నగర్‌ పార్లమెంట్ స్థానాన్ని సీఎం రేవంత్‌రెడ్డి కూడా ఛాలెంజ్‌గా తీసుకున్నారు. వంశీ చంద్‌ను గెలిపించేందుకు ఇప్పటికే పలుమార్లు ప్రచారం నిర్వహించిన ఆయన… ఎన్నికల ప్రచారం తుది దశకు చేరడంతో మరోమారు పాలమూరు గడ్డపై అడుగుపెట్టనున్నారు. ఇటు ప్రధాని సభ ప్రారంభమైన గంట తర్వాత అంటే మధ్యాహ్నం 3 గంటలకు మక్తల్‌ నియోజకవర్గ కేంద్రంలో కాంగ్రెస్‌ జనజాతర సభలో పాల్గొంటారు సీఎం రేవంత్‌ రెడ్డి. వంశీ చంద్‌ను గెలిపించాలంటూ మరోమారు ప్రచారం నిర్వహించనున్నారాయన.

ఒకేరోజు నారాయణపేట జిల్లాలో జరిగే రెండు బహిరంగ సభలకు ఇటు ప్రధాని, అటు ముఖ్యమంత్రి హాజరవుతుండడంతో… శాంతిభద్రతలను కాపాడవలసిన పోలీసులు, జన సమీకరణ చేయవలసిన నాయకులు ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కోవాల్సి ఉంటుందని విశ్లేషకులు అంటున్నారు. పాలమూరు పార్లమెంటు ఎన్నికను రెండు జాతీయ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయనడానికి ఇంతకన్నా నిదర్శనం ఏముంటుందంటున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి… 

Latest Articles
ఇది క్రేజ్ అంటే.. ఎన్టీఆర్ బర్త్ డే.. దుమ్మురేపిన జపాన్ ఫ్యాన్స్.
ఇది క్రేజ్ అంటే.. ఎన్టీఆర్ బర్త్ డే.. దుమ్మురేపిన జపాన్ ఫ్యాన్స్.
క్యాన్సర్ భూతాన్ని పారదోలే అద్భుత ఫలం..
క్యాన్సర్ భూతాన్ని పారదోలే అద్భుత ఫలం..
తిరుపతి గంగమ్మ జాతరలో తుది ఘట్టం అదే.. వేల సంఖ్యలో భక్తులు..
తిరుపతి గంగమ్మ జాతరలో తుది ఘట్టం అదే.. వేల సంఖ్యలో భక్తులు..
ట్విస్టులే ట్విస్టులు.. కావ్య షాక్.. టెన్షన్‌లో సుభాష్, రాజ్!
ట్విస్టులే ట్విస్టులు.. కావ్య షాక్.. టెన్షన్‌లో సుభాష్, రాజ్!
వార్మప్ మ్యాచ్ నుంచి తప్పుకున్న కోహ్లీ, సిరాజ్, శాంసన్.. ఎందుకంటే
వార్మప్ మ్యాచ్ నుంచి తప్పుకున్న కోహ్లీ, సిరాజ్, శాంసన్.. ఎందుకంటే
అధిక రక్తపోటు ఎంత ప్రమాదమో తెలుసా? నిర్లక్ష్యం చేశారో ఇక అంతే..
అధిక రక్తపోటు ఎంత ప్రమాదమో తెలుసా? నిర్లక్ష్యం చేశారో ఇక అంతే..
గ్లోబల్‌ వార్మింగ్ ను తగ్గించే భారీ ప్లాంట్‌.! అక్కడే ఏర్పాటు..
గ్లోబల్‌ వార్మింగ్ ను తగ్గించే భారీ ప్లాంట్‌.! అక్కడే ఏర్పాటు..
ఇరాన్‌ అధ్యక్షుడు ప్రయాణించిన బెల్‌-212 ఏ దేశం తయారు చేసిందంటే?
ఇరాన్‌ అధ్యక్షుడు ప్రయాణించిన బెల్‌-212 ఏ దేశం తయారు చేసిందంటే?
మళ్లీ మొదలు.. ఎందుకిలా.? కల్కిపై ప్రభాస్ ఫ్యాన్స్ గుస్సా.!
మళ్లీ మొదలు.. ఎందుకిలా.? కల్కిపై ప్రభాస్ ఫ్యాన్స్ గుస్సా.!
ఖాళీ కడుపుతో డ్రై ఫ్రూట్స్ తింటున్నారా.. ఏమవుతుందో తెలుసా.?
ఖాళీ కడుపుతో డ్రై ఫ్రూట్స్ తింటున్నారా.. ఏమవుతుందో తెలుసా.?
గ్లోబల్‌ వార్మింగ్ ను తగ్గించే భారీ ప్లాంట్‌.! అక్కడే ఏర్పాటు..
గ్లోబల్‌ వార్మింగ్ ను తగ్గించే భారీ ప్లాంట్‌.! అక్కడే ఏర్పాటు..
చిన్నారి చేతి వేలికి సర్జరీ చేయాలి. కానీ డాక్టర్లు చేసిన ఆపరేషన్‌
చిన్నారి చేతి వేలికి సర్జరీ చేయాలి. కానీ డాక్టర్లు చేసిన ఆపరేషన్‌
అత్యాచారం కేసులో స్టార్‌ క్రికెటర్‌కు ఊరట.. వరల్డ్‌ కప్‌కు రెడీ.?
అత్యాచారం కేసులో స్టార్‌ క్రికెటర్‌కు ఊరట.. వరల్డ్‌ కప్‌కు రెడీ.?
Thailand: థాయ్‌లాండ్‌ రాజధానికి పొంచి ఉన్న ముప్పు..!
Thailand: థాయ్‌లాండ్‌ రాజధానికి పొంచి ఉన్న ముప్పు..!
ఆటోవాలా ఐడియాకు ప్రయాణికులు ఫిదా.! ఆటోకు కూలర్‌ ఏర్పాటు..
ఆటోవాలా ఐడియాకు ప్రయాణికులు ఫిదా.! ఆటోకు కూలర్‌ ఏర్పాటు..
ఇడియట్ సిండ్రోమ్ అంటే ఏమిటో తెలుసా.?
ఇడియట్ సిండ్రోమ్ అంటే ఏమిటో తెలుసా.?
మళ్లీ మోత మోగిస్తున్న బంగారం ధర.! బంగారంతోపాటే వెండి కూడా..
మళ్లీ మోత మోగిస్తున్న బంగారం ధర.! బంగారంతోపాటే వెండి కూడా..
బ్రిటన్ ఎన్నికల్లో తెలంగాణ వాసి పోటీ.. అంచెలంచెలుగా ఎదిగి..
బ్రిటన్ ఎన్నికల్లో తెలంగాణ వాసి పోటీ.. అంచెలంచెలుగా ఎదిగి..
భారత్ చంద్రుడిపైకి వెళ్తుంటే.. పాక్‌ పిల్లలు మురికి కాల్వల్లో పడి
భారత్ చంద్రుడిపైకి వెళ్తుంటే.. పాక్‌ పిల్లలు మురికి కాల్వల్లో పడి
భారతీయ బాలుడి నిజాయతీకి దుబాయ్ పోలీసులు ఫిదా.!
భారతీయ బాలుడి నిజాయతీకి దుబాయ్ పోలీసులు ఫిదా.!