PBKS vs RCB, IPL 2024: ‘పంజా’ విసిరిన బెంగళూరు.. డూ ఆర్ డై మ్యాచ్ లో ఘన విజయం.. ప్లే ఆఫ్ ఆశలు సజీవం

Punjab Kings vs Royal Challengers Bengaluru: వరుసగా 6 ఓటములతో ఢీలా పడిపోయిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఐపీఎల్ లీగ్ లో అద్భుతంగా పునరాగమనం చేసింది. ధర్మశాల వేదికగా గురువారం (మే 09) జరిగిన మ్యాచ్‌లో ఆర్‌సీబీ 60 పరుగుల తేడాతో పంజాబ్ కింగ్స్‌ను ఓడించింది. తద్వారా ఈ టోర్నీలో వరుసగా నాలుగో విజయాన్ని నమోదు చేసింది.

PBKS vs RCB, IPL 2024: 'పంజా' విసిరిన బెంగళూరు.. డూ ఆర్ డై మ్యాచ్ లో ఘన విజయం.. ప్లే ఆఫ్ ఆశలు సజీవం
Royal Challengers Bengaluru
Follow us

|

Updated on: May 10, 2024 | 12:04 AM

Punjab Kings vs Royal Challengers Bengaluru: వరుసగా 6 ఓటములతో ఢీలా పడిపోయిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఐపీఎల్ లీగ్ లో అద్భుతంగా పునరాగమనం చేసింది. ధర్మశాల వేదికగా గురువారం (మే 09) జరిగిన మ్యాచ్‌లో ఆర్‌సీబీ 60 పరుగుల తేడాతో పంజాబ్ కింగ్స్‌ను ఓడించింది. తద్వారా ఈ టోర్నీలో వరుసగా నాలుగో విజయాన్ని నమోదు చేసింది. దీంతో ప్లేఆఫ్ కలను సజీవంగా ఉంచుకుంది. ఆర్‌సీబీ చేతిలో ఓడిన పంజాబ్ ప్లేఆఫ్ రేసు నుంచి పూర్తిగా నిష్క్రమించింది. పంజాబ్ 12 మ్యాచ్‌ల్లో 4 మాత్రమే గెలిచింది. కానీ RCB 12 మ్యాచ్‌ల్లో ఐదో విజయాన్ని నమోదు చేసింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 7 వికెట్లు కోల్పోయి 241 పరుగులు చేసింది. జట్టు తరఫున విరాట్ కోహ్లి 92 పరుగులతో మెరుపు ఇన్నింగ్స్ ఆడగా, రజత్ పాటిడర్ 55 పరుగులు, కామెరాన్ గ్రీన్ 46 పరుగులు చేశారు. ఈ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి పంజాబ్ 17 ఓవర్లలో 181 పరుగులు అలౌట్ అయ్యింది. శశాంక్‌ (37), బెయిర్‌ స్టో (27), సామ్‌ కరన్‌ (22) పరుగులు చేశారు. బెంగళూరు బౌలర్లలో కర్ణ్‌ శర్మ 2, స్వప్నిల్‌ సింగ్‌ 2, ఫెర్గూసన్‌ 2, సిరాజ్‌ 3 వికెట్లు తీశారు.

కాగా బెంగళూరు తర్వాతి రెండు మ్యాచ్‌లు ఢిల్లీ, చెన్నై సూపర్ కింగ్స్‌తో జరగనున్నాయి. ఈ రెండు జట్లూ ప్లేఆఫ్ రేసులో ఉన్నాయి. కాబట్టి ఈ రెండు మ్యాచ్‌ల్లోనూ బెంగళూరు గెలిస్తే ప్లేఆఫ్‌కు చేరుకోవచ్చు. ఇక పాయింట్ల పట్టికలో టాప్ -2 లో ఉన్న ఇరు జట్లకు 16 పాయింట్లు ఉన్నాయి. మూడో స్థానంలో ఉన్న హైదరాబాద్‌కు 14 పాయింట్లు ఉన్నాయి. చెన్నై సూపర్ కింగ్స్ 12 పాయింట్లతో ఉంది. కాబట్టి రెండు జట్లను భర్తీ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే బెంగళూరు రెండు మ్యాచ్‌లు గెలిస్తే 14 పాయింట్లు, ప్లేఆఫ్‌ల లెక్క తేల్చవచ్చు.

ఇవి కూడా చదవండి

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు  (ప్లేయింగ్ XI):

విరాట్ కోహ్లి, ఫాఫ్ డుప్లెసిస్ (కెప్టెన్), విల్ జాక్వెస్, రజత్ పాటిదార్, మహిపాల్ లోమ్రోర్, కెమెరూన్ గ్రీన్, దినేష్ కార్తీక్ (వికెట్ కీపర్), స్వప్నిల్ సింగ్, కర్ణ్ శర్మ, మహ్మద్ సిరాజ్, లక్కీ ఫెర్గూసన్.

ఇంపాక్ట్  ప్లేయర్లు:

అనుజ్ రావత్, సుయాష్ ప్రభుదేసాయి, విజయ్‌కుమార్ వైషాక్, యష్ దయాల్, మయాంక్ దాగర్

పంజాబ్ కింగ్స్ (ప్లేయింగ్ XI):

జానీ బెయిర్‌స్టో, ప్రభ్‌సిమ్రాన్ సింగ్, రిలే రూసో, శశాంక్ సింగ్, సామ్ కరణ్ (కెప్టెన్), లియామ్ లివింగ్‌స్టోన్, అశుతోష్ శర్మ, హర్షల్ పటేల్, రాహుల్ చాహర్, అర్ష్‌దీప్ సింగ్, విద్వాత్ కవీరప్ప.

ఇంపాక్ట్  ప్లేయర్లు:

హర్‌ప్రీత్ బ్రార్, తనయ్ త్యాగరాజన్, రిషి ధావన్, జితేష్ శర్మ, నాథన్ ఎల్లిస్

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Latest Articles
దుర్భర స్థితిలో అక్కడి అమెజాన్‌ ఉద్యోగులు.! తాజా సర్వేలో షాకింగ్‌
దుర్భర స్థితిలో అక్కడి అమెజాన్‌ ఉద్యోగులు.! తాజా సర్వేలో షాకింగ్‌
గ్లోబల్‌ వార్మింగ్ ను తగ్గించే భారీ ప్లాంట్‌.! అక్కడే ఏర్పాటు..
గ్లోబల్‌ వార్మింగ్ ను తగ్గించే భారీ ప్లాంట్‌.! అక్కడే ఏర్పాటు..
చిన్నారి చేతి వేలికి సర్జరీ చేయాలి. కానీ డాక్టర్లు చేసిన ఆపరేషన్‌
చిన్నారి చేతి వేలికి సర్జరీ చేయాలి. కానీ డాక్టర్లు చేసిన ఆపరేషన్‌
అత్యాచారం కేసులో స్టార్‌ క్రికెటర్‌కు ఊరట.. వరల్డ్‌ కప్‌కు రెడీ.?
అత్యాచారం కేసులో స్టార్‌ క్రికెటర్‌కు ఊరట.. వరల్డ్‌ కప్‌కు రెడీ.?
Thailand: థాయ్‌లాండ్‌ రాజధానికి పొంచి ఉన్న ముప్పు..!
Thailand: థాయ్‌లాండ్‌ రాజధానికి పొంచి ఉన్న ముప్పు..!
ఆటోవాలా ఐడియాకు ప్రయాణికులు ఫిదా.! ఆటోకు కూలర్‌ ఏర్పాటు..
ఆటోవాలా ఐడియాకు ప్రయాణికులు ఫిదా.! ఆటోకు కూలర్‌ ఏర్పాటు..
ఇడియట్ సిండ్రోమ్ అంటే ఏమిటో తెలుసా.?
ఇడియట్ సిండ్రోమ్ అంటే ఏమిటో తెలుసా.?
మళ్లీ మోత మోగిస్తున్న బంగారం ధర.! బంగారంతోపాటే వెండి కూడా..
మళ్లీ మోత మోగిస్తున్న బంగారం ధర.! బంగారంతోపాటే వెండి కూడా..
బ్రిటన్ ఎన్నికల్లో తెలంగాణ వాసి పోటీ.. అంచెలంచెలుగా ఎదిగి..
బ్రిటన్ ఎన్నికల్లో తెలంగాణ వాసి పోటీ.. అంచెలంచెలుగా ఎదిగి..
భారత్ చంద్రుడిపైకి వెళ్తుంటే.. పాక్‌ పిల్లలు మురికి కాల్వల్లో పడి
భారత్ చంద్రుడిపైకి వెళ్తుంటే.. పాక్‌ పిల్లలు మురికి కాల్వల్లో పడి