రికార్డుల సునామీతో రెచ్చిపోయిన కింగ్ కోహ్లీ

19 May 2024

TV9 Telugu

ఐపీఎల్ 68వ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ ఎన్నో రికార్డులు సృష్టించాడు. సీఎస్‌కేతో జరిగిన ఈ మ్యాచ్‌లో కోహ్లీ 29 బంతుల్లో 4 భారీ సిక్సర్లు, 3 ఫోర్లతో 47 పరుగులు చేశాడు.

ఈ 47 పరుగులతో విరాట్ కోహ్లీ ఎన్నో రికార్డులు సృష్టించడం విశేషం. ఆ విశేషాలకు సంబంధించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..

ఈ మ్యాచ్‌లో 47 పరుగులు చేయడం ద్వారా చిన్నస్వామి స్టేడియంలో విరాట్ కోహ్లీ పేరిట 3000 పరుగుల ప్రత్యేక రికార్డు చేరింది. ఐపీఎల్‌లో ఒకే స్టేడియంలో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌గా కూడా నిలిచాడు.

ఈ మ్యాచ్‌లో రెండంకెల స్కోరు చేయడం ద్వారా ఈ ఐపీఎల్‌లో 700+ పరుగులు చేసిన తొలి బ్యాట్స్‌మెన్‌గా విరాట్ కోహ్లీ నిలిచాడు.

ఐపీఎల్ చరిత్రలో రెండుసార్లు 700+ పరుగులు చేసిన తొలి భారతీయ బ్యాట్స్‌మెన్‌గా రికార్డు సృష్టించాడు. దీనికి ముందు 2016లో కోహ్లీ 973 పరుగులు చేశాడు.

ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ 4 భారీ సిక్సర్లతో తన రికార్డును తానే బద్దలు కొట్టే స్థాయికి చేరుకున్నాడు. అంటే, ఐపీఎల్ చరిత్రలో ఒకే సీజన్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాడిగా విరాట్ కోహ్లీ రికార్డు సృష్టించాడు.

కింగ్ కోహ్లీ 2016లో 38 సిక్సర్లతో రికార్డు సృష్టించాడు. ఇప్పుడు 2024లో విరాట్ కోహ్లీ 37 సిక్సర్లు కొట్టాడు. 

ఈసారి ఐపీఎల్‌లో అద్భుత బ్యాటింగ్‌ను ప్రదర్శించిన విరాట్ కోహ్లీ 14 ఇన్నింగ్స్‌లలో మొత్తం 708 పరుగులు చేశాడు. అతను 5 అర్ధ సెంచరీలు, 1 సెంచరీ సాధించాడు. దీంతో ఆరెంజ్ క్యాప్ రేసులో అగ్రస్థానంలో ఉన్నాడు.